మర్డర్ మిస్టరీ : పీటీ సార్ రివ్యూ (అమెజాన్ ప్రైమ్‌)
x

మర్డర్ మిస్టరీ : 'పీటీ సార్' రివ్యూ (అమెజాన్ ప్రైమ్‌)

మర్డర్ మిస్టరీ సినిమాలకు ఓటిటిలో మంచి డిమాండ్ ఉంటోంది. దాంతో ఎక్కడెక్కడి థ్రిల్లర్,మిస్టరీ ఫిల్మ్ లను తెచ్చి డబ్బింగ్ చేసి ఓటిటిలో పెట్టేస్తున్నారు.


మర్డర్ మిస్టరీ సినిమాలకు ఓటిటిలో మంచి డిమాండ్ ఉంటోంది. దాంతో ఎక్కడెక్కడి థ్రిల్లర్,మిస్టరీ ఫిల్మ్ లను తెచ్చి డబ్బింగ్ చేసి ఓటిటిలో పెట్టేస్తున్నారు. అదే క్రమంలో తమిళంలో వచ్చి రిలైజై మంచి టాక్ తెచ్చుకున్న సినిమాని తెలుగులోకి డబ్ చేసి అమేజాన్ ప్రైమ్ వారు అందుబాటులోకి తెచ్చారు. టైటిల్ చూస్తే ఇదేదో స్పోర్ట్స్ డ్రామా అనిపించినా, సినిమాగా థ్రిల్లరే. ఈ థ్రిల్లర్ మనవాళ్లను ఆకట్టుకునేదేనా, అసలు కథేంటి వంటి విషయాలు చూద్దాం.

కథ

క‌న‌గ‌వేల్ (హిప్ హాప్ త‌మిళ‌) ఓ స్కూల్ లో పీటి టీచర్ గా పనిచేస్తూంటాడు. కేవలం చదువే కాదు ఆటలు ముఖ్యమే అని వాదించి మరీ స్కూల్ యాజమాన్యంతో పోరాడి మరీ తన క్లాస్ లుతీసుకుంటూంటాడు. అతనికి జాతకంలో ఓ దోషం ఉంటుంది. అది పెళ్లైతే పోతుందని చెప్తారు. ఆ దోషం ఏమిటంటే... అతను ఎవరితోనైనా గొడవలు పెట్టుకుంటే సమస్యలు వస్తాయి. దాంతో అతను ఎటువంటి గొడవల్లో తలదూర్చకుండా చూసుకోమని ఒక సిద్ధుడు అతని తల్లితండ్రికి చెబుతాడు.

దాంతో క‌న‌గ‌వేల్‌ను అతని తల్లి ఏ గొడవలకు వెళ్లనివ్వదు. ఓ పిరికివాడిగా పెంచుతుంది. దాంతో తన క‌ళ్ల ముందే ఎలాంటి అన్యాయాలు జ‌రిగిన చూడ‌న‌ట్లు ఉండ‌మ‌ని నూరిపోస్తుంది. ఈ క్రమంలో అతను త‌న స్కూల్‌లోనే టీచ‌ర్‌గా ప‌నిచేసే వ‌న‌తిని (క‌శ్మీర ప‌ర‌దేశి) ప్రేమిస్తాడు. ఆమెతో ఇంక అంతా సెట్ అవుతుంది, ఎంగేజ్మెంట్ అననుకున్నసమయంలో ఓ గొడవలో ఇరుక్కోవాల్సిన పరిస్దితి వస్తుంది.

ఎంగేజ్మెంట్ అనుకున్న రోజు క‌న‌గ‌వేల్ ఇంటి ప‌క్క‌నే ఉండే నందిని (అనైక సురేంద్ర‌న్‌) హ‌త్య‌కు గురువుతుంది. ఈ మర్డర్ కు త‌మ స్కూల్ ఓన‌ర్ జీపీకి (త్యాగ‌రాజ‌న్‌) సంబంధం ఉంద‌ని క‌న‌గ‌వేల్ సందేహం. దాంతో జీపీపై పోరాటానికి సిద్ధ‌మ‌వుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ఆమె హత్యేనా లేక సూసైడా అసలు నిజం ఏమిటి..కనగవేల్ వివాహం అయ్యిందా..జాతకంలో దోషం పరిస్దితి ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే...

ఈ కథ ఆ మధ్య తమిళనాడు ఓ స్కూల్ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే దానికి కారణం స్కూల్ యాజమాన్యాన్నే ఆరోపణలు వచ్చాయి. దాన్నే బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నారు. అయితే టైటిల్ కు సినిమాకు సంభందం లేదు. టైటిల్ చూసి స్పోర్ట్స్ డ్రామా అని ఆవేశపెడితే మన పని అంతే. ఈ పీటి సార్ సినిమాలో వర్కవుట్ అయ్యేది ఏమిటీ అంటే మైల్డ్ గా ఫస్టాఫ్ లో సాగే ఫఎంటర్టైన్మెంట్.ఇంక ఇంట్రస్టింగ్ ఇంట్రవెల్ ట్విస్ట్. మధ్యలో మనని మర్డర్ మిస్టరీతో మడతెడదామనుకుంటాడు. కాని కొంతే నెరవేరింది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సినిమాని లేపింది. అప్పటిదాకా మనకి ఎందుకు ఈ సినిమా చూస్తున్నామనే అసంతృప్తి ఉన్నా అది మాయమైపోతుంది.

సాధారణంగా కథలో మర్డర్ ఉందంటే తెలియకుండానే మన దృష్టి దానివైపే వెళ్లిపోతుంది. ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు.. దాని వెనుక కారణాలేంటి చివరికి ఏం జరిగింది ఇలాంటివి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోతుంది. ఇదే ఇలాంటి కథలకు యుఎస్ పి. అయితే ఈ కథలకు బ్యూటీ అంతా కూడా వాటి నేరేషన్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పిటికే మనం ఇలాంటి కథలు బోలెడు చూసి ఉంటాము. దాంతో ఏదో ఒక ఎలిమెంట్ లో కొత్తదనం కనపడితేనే కనెక్ట్ అవుతాము. అలాగే ఈ పీటి సార్ ని కూడా తీర్చి దిద్దాలని దర్శకుడు ప్రయత్నం చేసారు. కాని పూర్తిగా సక్సెస్ కాలేదు.

అయితే ఈ స్టోరీ లైన్ ఇంట్రస్టింగ్ గా ఉన్నా నేరేషన్ లో ఓ ప్లో కనపడదు. పూర్తిగా మర్డర్ మిస్టరీ జానర్ లోకి జారదు. కాంపస్ ఎంటర్టైనర్ గా మొదలై తర్వాత సెక్సువల్ క్రైమ్స్ గా షిప్ట్ అయ్యి చివరకు అసంపూర్తిగా ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాగా ముగుస్తుంది. చాలా చోట్ల ఇవి వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ లు తెరపై చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదైమైనా ఇంకాస్త జాగ్రత్తలు స్క్రీన్ ప్లే విషయంలో తీసుకుంటే సినిమా మరో విధంగా ఉండేది.

టెక్నికల్ గా చూస్తే... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో హైలెట్ అని చెప్పాలి. చాలా నార్మల్ సీన్స్ ని లేపి కూర్చోబెట్టింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్,మిగతా టెక్నికల్ యాస్పెక్ట్స్ స్క్రిప్టు డిమాండ్ మేరకు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ నార్మల్ గా ఉన్నాయి.

చూడచ్చా

పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి మరీ చూడక్కర్లేదు కాబట్టి ఓటిటిలో ఓ లుక్కేయచ్చు. కాలక్షేపం అయ్యిపోతుంది.

ఏ ఓటిటీలో ఉంది

అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది

Read More
Next Story