
నోస్టాలజీ నే కానీ... : 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ రివ్యూ
ఈ సీరిస్ ఎలా ఉంది. కథేంటి, చూడదగిదేనా, మరోసారి మ్యాజిక్ జరిగిందా వంటి విషయాలు చూద్దాం.
ఆ మధ్యన ఈటీవీ విన్ లో వచ్చిన '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సీరిస్ లోని సీన్స్ మీమ్స్ రూపంలో ఇప్పటికి అక్కడక్కడా కనపడుతూనే ఉంటాయి.ఆ స్ఫూర్తితో ఇప్పుడు అదే నిర్మాత అలాంటి మరో ప్రయత్నం చేశారు 'హోమ్ టౌన్' టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సీరిస్ ఎలా ఉంది. కథేంటి, చూడదగిదేనా, మరోసారి మ్యాజిక్ జరిగిందా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
ఈ కథ మొత్తం తెలంగాణలోని హన్మంతుల గూడెం అనే పల్లెలో జరుగుతుంది. అక్కడ ప్రసాద్ (రాజీవ్ కనకాల)కు ఒక ఫోటో స్టూడియో ఉంది. దానిపై వచ్చే ఆదాయంతో మిడిల్ క్లాస్ లైఫ్ ని లాగుతూంటాడు. కంగారుపడకండి ఇది తొంభైల నాటి టైమే. ప్రసాద్ కు ఇద్దరు పిల్లలు. కొడుకు శ్రీకాంత్ (ప్రజ్వల్ యాదమ్మ)ను పై చదువుల కోసం ఫారిన్ పంపించాలనేది అతని జీవితాశయం. కూతురు జ్యోతి (ఆనీ)కి పెళ్లి చేసి పంపించేయాలనకుంటాడు. అందుకోసం తనకున్న తక్కువ ఆదాయంలోనే ఎల్ ఐసీ వంటివి కడుతుంటారు.
అయితే శ్రీకాంత్ కి పెద్దగా చదువు బుర్రకెక్కలేదు. రివర్స్ లో పిల్ల బాగా చదువుతూంటుంది. శ్రీకాంత్ కు ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలతో పొద్దు పోతుంది. పిల్ల మాత్రం చదవటమే పనిగా ఉంటుంది. ఈ క్రమంలో శ్రీకాంత్ బీటెక్ ఫెయిల్ అవుతాడు. అప్పుడు కొడుకుని ఫారిన్ పంపాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి ఏం చేసాడు? చివరకు ఏం జరిగింది? చెల్లెలి విషయంలో శ్రీకాంత్ ఏం చేశాడు? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్
90స్ కిడ్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సీరిస్ కొంతవరకూ నోస్టాలజీ మూవ్మెంట్స్ ఇవ్వగలిగింది. మొదటి మూడు ఎపిసోడ్స్ సరదాగా గడిచిపోయాయి. పాత్రలు మనకు అలవాటై, ఆ ఫన్ మూడ్ లోకి వచ్చేసరికి మూడో ఎపిసోడ్ లు అయిపోతాయి. దాంతో మూడో ఎపిసోడ్ బాగా వర్కవుట్ అయ్యింది. అయితే ఆ తర్వాత డల్ అయిపోయింది,. అలాగే ఫేస్ బుక్ ఎపిసోడ్ బాగా సాగ తీసారు. లస్ట్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది.
ఏదైమైనా '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' కి ఈ సీరిస్ కాపీలా ఉంది తప్పించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒరిజినాలిటీ మిస్ అయింది. అన్నయ్య కంటే బాగా చదివే చెల్లెలు, కూతురు కంటే కుమారుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తల్లిదండ్రులు, టీనేజ్ వచ్చేసరికి కోరికల గురించి తెలుసుకోవాలని ఆరాటపడే అబ్బాయిలు ఇప్పటికీ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. అవే ఉన్నంతలో కనెక్ట్ అయ్యాయి. కాకపోతే వాటితో ప్రత్యేకంగా ఫీల్ అయితే రాకపోవటమే సీరిస్ కు ఇబ్బందిగా మారింది.
టెక్నికల్ గా ..
స్క్రిప్ట్ ఇంకొంచెం బాగా రాసుకుని,ల్యాగ్ లు తగ్గించాల్సిందే. ఒకే విషయాన్ని సాగ తీస్తే ఫీల్ వస్తుందనుకోవడం భ్రమే. ఈ స్పీడ్ యుగంలో ఎంత క్రిప్స్ గా విషయాన్ని చెప్పామన్నదే ముఖ్యం. ఇక దేవ్ దీప్ గాంధీ సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ బొబ్బిలి పాటల్లో 'ఏదో ఏదో...' కు రిపీట్ వాల్యూ ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఓటీటీకి తగ్గట్టు ఉన్నాయి. క్వాలిటీ అయితే గొప్పగా లేదు.
నటీనటుల్లో ...
కొత్త వాళ్లైనా ప్రజ్వల్, సాయి రామ్ అలాగే అనిరుద్ లు చాలా బాగా చేశారు. కామెడీ సీన్స్ బాగా రక్తి కట్టించారు.ముఖ్యంగా సాయి రామ్ పై కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ప్రజ్వల్ నీట్ పెర్ఫామెన్స్ ని అందించాడు సీనియర్ నటులు రాజీవ్ కనకాల, ఝాన్సీలు తమ అనుభవాన్ని తమ పాత్రల్లో చూపించారు. అయితే ఓ విషయంలో మెచ్చుకోవాలి తెలంగాణ పల్లెకు, 2003 - 2004 కాలానికి తీసుకువెళ్లారు 'హోమ్ టౌన్' మేకర్స్.
చూడచ్చా
పిల్లలతో పెద్ద వాళ్ళు కలిసి చూసేది కాదు కానీ విడి విడిగా కుటుంబ సభ్యులు చూడచ్చు. మరీ గొప్పగానూ లేదు. తీసి పారేసేది కాదు.'90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ఎక్స్పీరియన్స్ లాంటిది 'హోమ్ టౌన్' తో ఎక్సపెక్ట్ చేస్తే డిజప్పాయింట్ అవుతారు.
ఎక్కడ చూడచ్చు
ఆహా ఓటీటీ లో తెలుగులో ఉంది.