క్రేజీ ఆంథాల‌జీ:  “హాట్ స్పాట్” ఓటిటి సినిమా రివ్యూ
x

క్రేజీ ఆంథాల‌జీ: “హాట్ స్పాట్” ఓటిటి సినిమా రివ్యూ

ఓటిటిలు వచ్చాక ఆంథాల‌జీల‌కు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్‌, అమేజాన్ లాంటి ఓటీటీ సంస్థ‌లు అంథాల‌జీల వైపు దృష్టి పెట్టడమే అందుకు కారణం.


ఓటిటిలు వచ్చాక ఆంథాల‌జీల‌కు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్‌, అమేజాన్ లాంటి ఓటీటీ సంస్థ‌లు అంథాల‌జీల వైపు దృష్టి పెట్టడమే అందుకు కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఆంథాల‌జీ లను చూసే ప్రేక్షకులు బాగా పెరిగారు. అయితేతెలుగులో ఆ ప్రయత్నాలు మొదటినుంచీ తక్కువే. ఆ మధ్యన పిట్ట‌క‌థ‌లు. అంటూ ఓ ఆంథాల‌జీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్‌లో వచ్చింది. ఇప్పుడు కూడా ఆహాలో మరో ఆంథాల‌జీ వచ్చింది. దాని పేరు హాట్ స్పాట్. ఈ ఆంథాల‌జీ లో ఉన్న కథలు ఏమిటి, వాటి నేపధ్యం ఏమిటి..తెలుగులో డబ్ చేసేటంత స్పెషాలిటీ ఏముందో చూద్దాం.

స్టోరీ లైన్

డైరక్షన్ ట్రైల్స్ లో ఉన్న మహమ్మద్ షఫీ(విగ్నేష్ కార్తీక్) ఓ నిర్మాత(బాల మణిమర్బన్) ని కలిసి కథ చెప్పి ఒప్పించి సినిమా చేద్దామనుకుంటాడు. అయితే ఆ నిర్మాత పది నిముషాల్లో చెప్పేయ్..అలాగే రొటీన్ కథ అయితే అసలే చెప్పకు అని అల్టిమేటం ఇస్తాడు. ఆ క్రమంలో ఈ కొత్త డైరక్టర్ తన దగ్గరున్న నాలుగు కథలు తీసి చెప్పటం మొదలెడతాడు. అందులో హ్యాహీ మ్యారీడ్ లైఫ్ ,గోల్డెన్ రూల్స్,టమోటా చట్నీ, ఫేస్ గేమ్ అనే నాలుగు వైవిధ్యమైన కథలు. సమాజంలోని మనం పట్టించుకోవటానికి కూడా భయపడే సమస్యలను సూటిగా ప్రశ్నస్తూ సాగుతాయి. అలాగే ఈ కథలకు ముగింపు కూడా ఓ చిన్న ట్విస్ట్ తో ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏమిటి...ఈ కథలు విన్న నిర్మాత వీటిలో దేనితో సినిమా చేద్దామంటాడు. ఆ కథలు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ

ఓ నిర్మాతను కలిసి ఓ ఫిల్మ్ మేకర్ తన దగ్గర ఉన్న నాలుగు డిఫరెంట్ కథలు వినిపిస్తాడు. అయితే ఆ నిర్మాతకు ఆ కథలు నిజ జీవితంలో కనెక్ట్ అవటం మొదలెడతాయి. అంతేకాదు ఆ డైరక్టర్ తనకే ఎందుకు ఈ కథలు చెప్తున్నారు అనేదే ఫైనల్ క్లైమాక్స్ ట్విస్ట్. లోకేష్ కనకరాజ్ వచ్చాక hyperlink కథలకు డిమాండ్ వచ్చింది. ఈ డైరక్టర్ కూడా అదే పంధాను ఎంచుకున్నాడు. ఇంట్రస్టింగ్ గా కథలను నేరేట్ చేస్తూ ఓ చోట ముడిపెట్టాడు. అలాగే ఈ కథలలో అవసరానికి సరపడ పాత్రలు వుండటం మరో కలిసొచ్చే అంశం. ఆ పాత్రల వెనుక ఒకొక్క కథ వుంటుంది. ఆ కథలు ఏమిటో, వాళ్ళ బాధ ఏమిటో ప్రేక్షకుడికి పట్టే లోగా కథ పూర్తై పోయి, మరో కథలోకి వెళ్లటమే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

ఇవి క‌థలు అనేదానికంటే కొన్ని సంఘ‌ట‌నల సమాహారం అని చెప్ప‌డం బాగుంటుంది. తెరపై జరిగే సంఘటన వెనుక ఉన్న భిన్న‌మైన భావోద్వేగాల్ని, మ‌న‌స్త‌త్వాల్నీ డీల్ చేయటమే ప్రధానాంశం. ఓ కథల పుస్తకం చదువుతన్నట్లు అనిపిస్తుంది. ప్రతీ ఎపిసోడ్ చూస్తున్నంత‌సేపూ… ఓ క‌థ చ‌దువుతున్న భావ‌నే క‌లుగుతుంది. డ్రామా పడంటం, షాకింగ్ వాల్యుూ ఉన్న సీన్స్ కావటంతో ఈ క‌థలు మ‌రింత ర‌క్తి క‌ట్టాయి. టేకింగ్, షాట్ మేకింగ్ ఇవ‌న్నీ చూస్తే… మన ప్రక్కింట్లో జరుగున్న కథనేమో అన్న భావ‌న క‌లుగుతుంది. ఓ విషయం జరిగాక దాని తాలుకూ త‌న‌ని వేధించే ప్ర‌శ్న‌లు, వాస్త‌వాలూ ఇవ‌న్నీ ఇంత త‌క్కువ స‌మ‌యంలో, ఇంత చిన్న ప‌రిధిలో చెప్ప‌డం మెచ్చుకోద‌గిన విష‌యాలే. ఓ చిన్న ఆఫ్‌బీట్ సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

టెక్నికల్ గా...

నిర్మాణ పరంగా సినిమా బాగుందనిపిస్తుంది. నేపధ్య సంగీతం, కెమెరాపనితనం డీసెంట్ గా వున్నాయి. దర్శకుడు సెన్సేషన్ కథలు ఎంచుకోవటం తో పాటు ఎమోషన్ పైన కూడా ద్రుష్టి పెట్టాల్సింది. ఆఖరి కథే ఎమోషనల్ గా కదలిస్తుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ బాగుంది. డైలాగులు నీట్ గా ఉన్నాయి. ఆర్టిస్ట్ లు పెద్దగా తెలుసున్న వాళ్లు కాకపోయినా బాగానే ఎంగేజ్ చేసారు.

చూడచ్చా

కొన్ని మాట్లాడుకోవటానికి ఇబ్బంది పడే సమస్యలను కూడా కథగా మార్చి అందించారు. వాటిని చూడాల్సిన అవసరం ఉంది. సమాజంలో వివిధ వర్గాల వారి ఆలోచన తీరుని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. అయితే పిల్లలను ఈ సినిమాని దూరంగా పెట్టాలి.

ఎక్కడ చూడచ్చు

OTT: ఆహా లో తెలుగులో ఉంది

Read More
Next Story