
రివర్సైన ప్రభాస్ ‘రాజా సాబ్’ ఓటీటీ డీల్ !
-ఓటీటీలోనూ అన్యాయమే!
ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్ వసూళ్లే. కానీ ఇప్పుడు సీన్ మారింది! సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్స్ రూపంలో నిర్మాతలకు సగం బడ్జెట్ వెనక్కి వచ్చేస్తోంది. అయితే, ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. సినిమా రిజల్ట్‌ని బట్టి ఈ ఓటీటీ అగ్రిమెంట్లు రకరకాలుగా మారుతుంటాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఓటీటీ సంస్థలు ఇచ్చే బోనస్‌లతో నిర్మాతలు పండగ చేసుకుంటారు. అదే పొరపాటున టాక్ తేడా వస్తే మాత్రం, అగ్రిమెంట్‌లో ఉన్న ‘పర్ఫార్మెన్స్ బేస్డ్’ క్లాజుల వల్ల కోట్లాది రూపాయలు ఆవిరైపోతాయి. తాజాగా ప్రభాస్ 'ది రాజా సాబ్' (The Raja Saab) విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే...
బాక్సాఫీస్ వద్ద ‘ది రాజా సాబ్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రంతో కేవలం థియేట్రికల్ వసూళ్లే కాదు, ఇప్పుడు డిజిటల్ రైట్స్ (OTT) విషయంలో కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి వచ్చిన ఓటీటీ ఆఫర్ చూసి ట్రేడ్ వర్గాలే విస్మయానికి గురవుతున్నాయి.
ఏమిటా ‘జియో ప్లస్ హాట్‌స్టార్’ డీల్?
తాజా సమాచారం ప్రకారం, 'ది రాజా సాబ్' డిజిటల్ రైట్స్‌ను జియో ప్లస్ హాట్‌స్టార్ (Jio Plus Hotstar) సంస్థ దక్కించుకుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రభాస్ గత చిత్రాల డిజిటల్ రైట్స్ వందల కోట్లు పలికితే, రాజా సాబ్ అన్ని భాషలు కలిపి కేవలం ₹80 కోట్లకే అమ్ముడుపోయింది. ఇటీవలి కాలంలో ప్రభాస్ సినిమాకు జరిగిన అతి తక్కువ డీల్ ఇదే!
కండిషన్ రివర్స్ అయింది:
మేకర్స్ ఈ డీల్‌లో ఒక కండిషన్ పెట్టుకున్నారు. సినిమా థియేటర్లలో ₹200 కోట్ల గ్రాస్ దాటాక, వచ్చే ప్రతి ₹100 కోట్లకు అదనంగా ₹10 కోట్లు హాట్‌స్టార్ చెల్లించాలి. సినిమా ₹500 కోట్లు దాటుతుందని మేకర్స్ ఆశపడ్డారు కానీ, కలెక్షన్స్ ₹200 కోట్ల వద్దే ఆగిపోవడంతో అదనపు ఆదాయం వచ్చే ఛాన్స్ మిస్ అయింది.
ప్రభాస్ బిగ్ ప్రామిస్.. నిర్మాతలను ఆదుకునేందుకేనా?
సినిమా ఫలితం దెబ్బకొట్టడంతో నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో తన నిర్మాతలను ఆదుకునేందుకు ప్రభాస్ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారట:
స్పిరిట్ (Spirit) థియేట్రికల్ రైట్స్:
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ఈ సంస్థకు ఇచ్చేందుకు ప్రభాస్ హామీ ఇచ్చారు. అలాగే నష్టాలను భర్తీ చేసేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో సినిమా చేస్తానని ప్రభాస్ ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది.
ఏదైమైనా
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు కేవలం కంటెంట్ చూసి మాత్రమే కాదు, థియేటర్లలో సినిమా ఎంతవరకు ‘సస్టైన్’ అవుతుందనే దానిపైనే తమ రేట్లను ఫిక్స్ చేస్తున్నాయి. 'రాజా సాబ్' ఫలితం టాలీవుడ్ నిర్మాతలకు ఒక పెద్ద గుణపాఠం. బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ జరిగితేనే ఓటీటీలోనూ లాభాల వర్షం కురుస్తుందని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. ఏదేమైనా తన నిర్మాతలను ఆదుకోవడంలో ప్రభాస్ మళ్ళీ ‘పెద్ద మనసు’ చాటుకున్నారు.

