చెలరేగిన పుష్పారాజ్ సామాన్యుడిలా పోలీసు వ్యాన్ ఎక్కేయడం. ఎంత వింత...
x

చెలరేగిన పుష్పారాజ్ సామాన్యుడిలా పోలీసు వ్యాన్ ఎక్కేయడం. ఎంత వింత...

ఏంటిది పుష్పా, అరెస్ట్ ని ఊహించలేదా లేక పోలీసుతో ఉచ్చపోయించినందుకు పరిహారమా?

'పుష్ప' హీరో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన వార్త అంతటా వైరల్ అవుతోంది. పుష్ప 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసే మూడ్ ని ఈ విషయం ఖచ్చితంగా డిస్ట్రబ్ చేస్తుంది. పోలీస్ లు స్వయంగా ఇంటికెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. బట్టలు మార్చుకునే టైమ్ ఇవ్వమని బన్నీ అడిగినప్పటికీ.. పోలీసులు ససేమీరా అన్నారు. దీంతో అలానే అల్లు అర్జున్.. పోలీస్ వ్యాన్ ఎక్కాడు. అయితే పోలీసులతో వెళ్లేముందు బన్నీ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా వైరల్ వీడియో ద్వారా బయిటకు వచ్చింది. అయితే తెరపై ఎదురు లేని పుష్పా రాజ్ గా చెలరేగిన అల్లు అర్జున్, తెర వెనక ..అతి సామాన్యుడులా పోలీస్ వేన్ ఎక్కడటం అభిమానులు జీర్ణించుకోలేని విషయం.

పష్ప 1 లో కానీ, పుష్ప 2 లో కానీ అల్లు అర్జున్ పాత్ర ఎర్ర చందనం స్మగ్లర్. అతన్ని పోలీస్ లు, శత్రువులు నిరంతరం వెంటాడుతూనే ఉంటారు. అయితే అతనికి పొలిటికల్ అండదండ ఉంటుంది. పోలీస్ లనే కాదు తనతో ఫొటో దిగలేదని ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసే సత్తా ఉంటుంది. తనని రెడ్ సాండిల్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని ప్రయత్నించే పోలీసుల కళ్ల గప్పేందుకు ఎన్నెన్నో వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూంటాడు. డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తూంటాడు. తన మనుష్యుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి చర్చలు జరుపుతూంటాడు. ఏకంగా పోలీస్ లకు రిటైర్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత ఇచ్చేసి వాళ్ల చేత రాజీనామాలు చేయిస్తూంటాడు.

ఇంకా తనకు ఎదురుగా నిలబడి తనని సవాల్ చేసే పోలీస్ అధికారిని ఉచ్చ (సినిమా భాషలోనే) పోయిస్తాడు . అతనిపైనా పోస్తాడు. కాని నిజ జీవితం లో ఒక చిన్న అరెస్టు ను తప్పించుకోలేని సిట్యువేషన్. సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు దాటింది. అయినా పోలీస్ లు తన దాకా వస్తారని ఊహించలేకపోయారా. ఊహించినా పోలీస్ ల అరెస్ట్ తప్పించుకునే వ్యూహం తన లీగల్ టీమ్ తో కలిసి రచించలేకపోయారా అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. అయితే చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్నది ఇలాంటి సమయాల్లో ప్రజలందరికీ అర్దమవుతుంది. జీవితానికి సినిమాకి చాలా అంతరం ఉందనేది ప్రతీసారి ప్రూవ్ అవుతూనే ఉంటుంది.

వాస్తవానికి సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ (Allu Arjun) హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు.

అయితే ‘అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే మెన్షన్ చేయాలి కదా’ అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్‌ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు.

అలాగే బుధవారం పిటిషన్ దాఖలు చేసి, నెంబర్ అయినా.. కోర్టు సిబ్బంది బిజీగా ఉండడం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే ఇవన్నీ ఇప్పుడు అరెస్ట్ తర్వాత చేపడుతున్న చర్యలు.


ఇక అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ భార్య స్నేహా తట్టుకోలేకపోయింది. దీంతో బన్నీ ఆమెని సముదాయించాడు. 'స్నేహ భయపడకు.. నాకు ఏమీ కాదు' అని చెప్పాడు. తన భార్యకు ముద్దు ఇచ్చి అల్లు అర్జున్ పోలీసు వాహనం ఎక్కాడు. అదే టైంలో తండ్రి అల్లు అరవింద్ కూడా వ్యాన్ ఎక్కడంతో.. ఆయన్ని వద్దని చెప్పి బన్నీ ఒక్కడే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ కోరేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం బన్నికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. సినిమా ఫేక్, జీవితం రియల్. డబ్బును లెక్ చేయదు.

Read More
Next Story