
“అఖండ 2 : తాండవం” ప్రీమియర్ షో టాక్ డివైడ్?
బాలయ్య గర్జించాడు… కానీ
మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన “అఖండ 2 : తాండవం” థియేటర్స్ లో అడుగు పెట్టింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య వన్ మాన్ షో 'అఖండ 2 'నిన్న సాయింత్రం ప్రీమియర్స్ పడ్డాయి. బాలయ్య, బోయపాటి కాంబో కావడంతో పాటు బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెట్టడంతో అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి. మరి మూవీ టాక్ ఎలా ఉందో చూద్దాం.
బాలకృష్ణ అభిమానుల వైపు నుంచి సినిమా టాక్ చాలా పాజిటివ్‌గా ఉంది, ముఖ్యంగా బాలకృష్ణ మాస్ పెర్ఫార్మెన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వం, యాక్షన్ ఎలిమెంట్స్, ఆధ్యాత్మిక అంశాలను అభిమానులు "శివ తాండవమే", "మాస్ విస్పోటనం" అని పొగుడుతున్నారు, సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని, బాక్సాఫీస్ షేక్ చేస్తుందని చెప్తున్నారు. అయితే అదే సమయంలో మరో ప్రక్క నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది.
అభిమానులు కాకుండా చూసిన వారు... “అఖండ 2 : తాండవం”కు ముందు వచ్చిన అఖండ సృష్టించిన ఆధ్యాత్మిక ఉత్సాహం, మాస్ ఎనర్జీ, దేశభక్తి భావం — ఏ ఒక్కదాన్ని కూడా పూర్తిగా రీ-క్రియేట్ చేయలేకపోయిందని చెప్తున్నారు. బోయపాటి స్టైల్‌కు సిగ్నేచర్‌గా ఉండే హై-ఆక్టేన్ భావోద్వేగాలు, డ్రామా ఈసారి ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. బలమైన విజువల్ ప్రెజెంటేషన్, కొన్ని థియేటర్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, ఫిల్మ్ మొత్తం మీద ఒక మిస్సింగ్ థ్రిల్ ఫీలింగ్ తప్పలేదు.
సెకండాఫ్ లో కొన్ని బాగున్న సీన్లు, బాలకృష్ణ స్క్రీన్ కమాండ్ మాత్రమే చిత్రానికి బూస్ట్ ఇచ్చాయి. కానీ స్క్రీన్‌ప్లే పలుచగా ఉండటంతో, ప్రేక్షకుడిపై కావాల్సిన ఇంపాక్ట్ మాత్రం రాలేదు.
మొదటి అఖండ తో పోలిస్తే?
మొదటి దాని దగ్గరలోకి సగం కూడా వెళ్లలేదు. ఆ ఇంపాక్ట్ లో పావు వంతు కూడా ఇవ్వలేకపోయింది. మొదటి భాగానికి ఉన్న మాస్ ఆరా, ఎమోషనల్ కనెక్షన్, డెవోషనల్ హై పాయింట్లు — ఇవన్నీ ఈసారి ఔట్‌పుట్‌లో లోపించాయి.
ప్రిమియర్స్ టాక్ – డివైడ్ ఓపెనింగ్స్
ప్రీమియర్స్ పడ్డ వెంటనే వచ్చిన స్పందన స్పష్టంగా డివైడ్ అయిపోయింది.
నందమూరి & బాలయ్య అభిమానులు:
బాలయ్య థాండవం, ఘాటైన డైలాగులు, యాక్షన్ పీక్స్ కి సాలిడ్ రెస్పాన్స్ ఇచ్చారు.
సామాన్య ప్రేక్షకులు:
కథనం నెమ్మదిగా సాగటం, భావోద్వేగాలు పనిచేయకపోవడం, గందరగోళంగా నడిచే స్క్రీన్‌ప్లే కారణంగా పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు.
హైప్‌కి తగ్గ బజ్ మల్టీప్లెక్స్, జనరల్ ఆడియన్స్ సెగ్మెంట్ నుంచి రానట్లు కనిపిస్తోంది.
అఖంఢ 2 స్టోరీ లైన్
అఖండ హిమాలయాల్లో అష్టసిద్ధి యోగం సాధనలో నిమగ్నమవుతాడు. ఈలోగా, బాల మరళికృష్ణ (రెండో బాలయ్య) ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. అతని కుమార్తె జనని, DRDOలో ప్రతిభావంతమైన శాస్త్రవేత్త. ఆర్మీ అధికారి అర్చనా ఆమెకు బయో-ప్రొటెక్షన్ షీల్డ్ అభివృద్ధి బాధ్యత అప్పగిస్తుంది.
ఇదే సమయంలో ఒక తిరుగుబాటు చైనా జనరల్ భారత్‌పై బయోలాజికల్ వార్ ప్లాన్ చేస్తాడు. మహా కుంభమేళా సమయంలో గంగాలో ప్రాణాంతక వైరస్ కలుషితం చేస్తాడు. దేశవ్యాప్తంగా అలజడి.
ప్రధానమంత్రి అత్యవసరంగా చికిత్స కోరతాడు. జనని వ్యాక్సిన్ తయారు చేస్తుంది, కానీ దాన్ని సేఫ్ గా డెలివర్ చేయడానికి బయల్దేరినప్పుడు శత్రువుల దాడి.
చిన్నతనంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అఖండ ఆమె ముందుకు వచ్చి రక్షిస్తాడు. జననీని మాత్రమే కాదు — దేశం మొత్తాన్ని, ధర్మాన్ని కాపాడటమే అతని అసలు లక్ష్యం.
ఫైనల్ గా
“Akhanda 2: Thaandavam” — భారీ అంబిషన్స్ ఉన్నా, అమలులో అది తడబడింది. సినిమాలో అక్కడక్కడా అభిమానులను ఉత్సాహపరచే మూమెంట్స్ ఉన్నా, సాధారణ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయిందని చెప్తున్నారు. ఇదే టాక్ నిజమైతే అనుకున్న స్దాయిలో ఈ సినిమా నిలబడటం కష్టం. ఈ రోజు అసలైన టాక్ బయిటకు వస్తుంది.
హైప్‌కి తగ్గ అవుట్‌పుట్?
ఇంతకీ… లేదు.
కాసేపట్లో ఫుల్ రివ్యూ చూడచ్చు..ఇదే సైట్ లో

