
అల్లుఅర్జున్ నిజంగానే గ్యాంబిల్ ఆడుతున్నాడా?
టెన్షన్‌లో టాలీవుడ్ ట్రేడ్ !
‘పుష్ప 2: ది రూల్’తో అల్లుఅర్జున్ తన కెరీర్‌ను ఎవరూ ఊహించని నెక్ట్స్ లెవిల్ కు , పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లాడు. అద్భుతమైన బాక్సాఫీస్ రికార్డులు, పాన్–ఇండియా రిలీజ్, ఓవర్సీస్‌లో అద్భుత గ్రోత్ — ఇవన్నీ కలిసి బన్నీకి ప్రస్తుతం అద్బుతమైన మార్కెట్ ని క్రియేట్ చేసాయి.
అయితే ఇలాంటి సమయంలో స్టార్‌లు సాధారణంగా ఫ్యాన్–ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గ సురక్షితమైన సేఫ్ ప్రాజెక్టులు ఎంచుకుంటుంటే… బన్నీ మాత్రం తమిళ్ డైరెక్టర్ తో ముందుకు వెళ్లటం ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఇప్పుడు మరో తమిళ దర్శకుడుతో చర్చలు జరపటం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఆ దర్శకుడు మరెవరో కాదు తమిళ స్టార్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ అని తెలుస్తోంది.
కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే లోకేష్ కనగరాజన్ బన్నీకి కథ వినిపించాడట. వీరిద్దరి కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్లేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
పుష్ప, పుష్ప 2 చిత్రాలలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతకు ముందు వరకు కేవలం మన తెలుగు రాష్ట్రాలు, కేరళ, మధ్యలో తమిళ్ ఇలా సౌత్ ఇండస్ట్రీకే పరిచయం ఉన్న బన్నీ..పుష్ప చిత్రంతో నార్త్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అంటే.. బాలీవుడ్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. బన్నీ కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోనే కథలను ఎంచుకుంటున్నాడు. దాంతో తమిళ దర్శకులతో వరసపెట్టి రెండు సినిమాలు అనగానే బన్నీ స్ట్రాటజీ ఏంటనేది ఎవరకీ అర్దం కావటం లేదు.
తమిళ్ డైరెక్టర్ – తెలుగు హీరో: ఇటీవలి కాలంలో ఫలితం బాగోలేదు
టాలీవుడ్‌లో గత కొన్నేళ్లలో వచ్చిన కొన్ని సినిమాలు తమిళ్ డైరెక్టర్లు తెలుగు హీరోలతో చేసినపుడు బాక్సాఫీస్‌లో అంచనాలను అందుకోలేకపోయాయి.
పవన్ కళ్యాణ్ ‘బ్రో’, ‘పులి’, ‘పంజా’
మహేష్ బాబు ‘స్పైడర్’
నాగచైతన్య ‘కస్టడీ’
రామ్ ‘ది వారియర్’
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’
ఈ లిస్ట్ ట్రేడ్ వర్గాల ఆందోళనకు కారణం. తమిళ్ డైరెక్టర్ల మేకింగ్ స్టైల్, వారి ఎమోషనల్ నడక, హీరో ఎలివేషన్ పద్ధతి — ఇవన్నీ తెలుగు మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.
అటువంటి సమయంలో బన్నీ తీసుకున్న నిర్ణయాలు
1. అట్లీ తో భారీ Sci-Fi ప్రాజెక్ట్ (AA22×A6)
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. పెద్ద సెట్‌లు, హాలీవుడ్ VFX టీమ్, డ్యూయల్ రోల్‌లో బన్నీ — ఈ సినిమా ఇప్పటికే భారీగా నజరులు ఆకర్షిస్తోంది. కానీ బడ్జెట్ పరంగా ఇది చాలా పెద్ద కమిట్‌మెంట్.
2. తదుపరి లోకేష్ కనగరాజ్‌తో సినిమా?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం అట్లీ తర్వాత బన్నీ మరొక తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కూడా చేయనున్నాడట. ఈ మధ్య ‘లియో’, ‘కూలీ’ ప్రాజెక్టులపై వచ్చిన విమర్శలు లోకేష్ మోమెంటమ్‌ను కొంత ప్రభావితం చేశాయి. ఇలాంటి సమయంలో అల్లుఅర్జున్ అతనితో కలిసి పని చేసేందుకు సిద్ధమవ్వడం, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి మరియు ఆందోళన రెండింటినీ పెంచింది.
బన్నీ తీసుకున్న గ్యాంబిల్ లలో ప్లస్ లు చూస్తే...
Pan-India ప్రెజెన్స్ పెంచుకోవడం
అట్లీ, లోకేష్ వంటి డైరెక్టర్లు ఉత్తర భారతిలో కూడా పెద్ద మార్కెట్ కలిగినవారు. ఇది బన్నీకి nationwide pullను మరింత పెంచే అవకాశం.
ప్రెష్ ఇమేజ్, ప్రెష్ అప్పీల్
పుష్ప సినిమాల తర్వాత కూడా ఆడియన్స్ కి కొత్తగా కనిపించడానికి బన్నీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
యాక్షన్ + స్టైలిష్ మేకింగ్ ఎడ్వాంటేజ్
తమిళ్ డైరెక్టర్లు టెక్నికల్ గ్రాండియర్ గా పేరు తెచ్చుకున్నవారు. ప్రపంచ స్థాయి సైన్స్ ఫిక్షన్ లేదా యాక్షన్ డ్రామాలకు వీరి నైపుణ్యం సహాయపడుతుంది.
కానీ మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి
తెలుగు ఎమోషనల్ రిథమ్ మిస్ అయ్యే ప్రమాదం
తమిళ్ డైరెక్టర్లు బీట్స్, ఎమోషన్స్‌ను స్ట్రక్చరింగ్ చేసే విధానం తెలుగు ఆడియన్స్ కు ఎక్కడం లేదు.
బడ్జెట్ రిస్క్
AA22×A6 లాంటి సినిమా రూ.500–600 కోట్ల బడ్జెట్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. కీడెంచి మేలు ఎంచాలన్నట్లు చూస్తే... ఒక్క ఫెయిల్యూర్ కూడా భారీ ట్రేడ్ నష్టానికి దారితీస్తుంది.
లోకేష్ కరెంట్ ఫేజ్
ఇటీవల వచ్చిన మిక్స్‌డ్ రిసెప్షన్ టాలీవుడ్ ట్రేడ్‌కి సందేహాలు తెచ్చింది.
ఏదైమైనా రిస్క్ ఉన్నా… మార్కెట్ మార్చే శక్తి ఉన్న నిర్ణయం ఏమటనేదే హీరోలు చూస్తారు. అల్లుఅర్జున్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. అందుకే తమిళ్ డైరెక్టర్లతో వరుసగా చేస్తున్న ఈ నిర్ణయాలు ఆయన్ని ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హీరోగా మరింత నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లవచ్చనేదే ఆశ.
అల్లుఅర్జున్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టంగా సేఫ్ ప్లే కాదు — స్ట్రాటజిక్ రిస్క్. తమిళ్ డైరెక్టర్లతో వరుస కాంబోలు టాలీవుడ్ ట్రేడ్ దృష్టిలో హై రిస్క్ మూవ్ అయినప్పటికీ, బన్నీ గేమ్ ప్లాన్ మాత్రం ఇంకో మెట్టు పైకి వెళ్లడమే.
పాన్–ఇండియా మార్కెట్లో సర్వైవ్ కాకుండా డామినేట్ కావాలంటే, ఇలాంటి బోల్డ్ కొలాబిరేషన్స్ అవసరమని ఆయన నమ్ముతున్నాడు. కానీ ఇవే నిర్ణయాలు ఆయనను వచ్చే సంవత్సరాల్లో భారతీయ సినీ పరిశ్రమలో నంబర్ వన్ ప్యాన్–ఇండియా స్టార్‌గా నిలబెట్టవచ్చు,అందుకే పరిశ్రమ మొత్తం ఇప్పుడు ఒకే ప్రశ్నపై దృష్టి పెట్టింది—
“బన్నీ ఈ రిస్క్‌తో ఇండియన్ సినిమా మ్యాప్‌ని మార్చేస్తాడా… లేక ఇదీ అతని కెరీర్‌లో అత్యంత ప్రమాదకరమైన మలుపా?” సమాధానం… రాబోయే రోజుల్లో వచ్చే రెండు సినిమాలే చెప్తాయి.

