సందీప్ వంగాని నాగ్ అశ్విన్ నిజంగానే  టార్గెట్ చేసాడా? ఏంటి వివాదం
x

సందీప్ వంగాని నాగ్ అశ్విన్ నిజంగానే టార్గెట్ చేసాడా? ఏంటి వివాదం

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రచ్చ నడుస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’తో సంచలనం రేపిన యంగ్ డైరక్టర్ నాగ్ అశ్విన్..ఆ సంతోషంలో సందీప్ వంగా కు కౌంటర్ వేసారని.


నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రచ్చ నడుస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’తో సంచలనం రేపిన యంగ్ డైరక్టర్ నాగ్ అశ్విన్..ఆ సంతోషంలో సందీప్ వంగా కు కౌంటర్ వేసారని. యానిమల్ సినిమాని ఇండైరక్ట్ గా విమర్శ చేసాడని , ఇది పద్దతి కాదని డిస్కషన్స్ మీద డిస్కషన్స్ చేసేస్తున్నారు. అయితే మొదటి నుంచి నాగ్ అశ్విన్ వివాదాలకు పూర్తి దూరంగా ఉంటూ వస్తున్నాడు. మీడియాను కలిసినపుడు కూడా చాలా సింప్లిసిటీతో కూడిన ఆన్సర్స్ ఇస్తూంటాడు. ఎవరైనా జర్నలిస్ట్ లు కవ్వించేలా ప్రశ్నలు వేసినా కూల్‌గా రిప్లై ఇస్తాడు. విమర్శలను కూడా లైట్ అన్నాడు. వాటిల్లోంచి తనకు పనికొచ్చేవి తీసుకుంటా అన్నాడు. అలాంటి నాగ్ అశ్విన్ ...పనిమాలా ఎందుకు సందీప్ వంగా పై వ్యంగ్య బాణాలు ఎక్కుపెడతాడు?

అసలే జరిగిందీ అంటే ‘కల్కి’ వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. అది మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా నాగి ఒక పోస్ట్ పెట్టాడు. "ఈ మైలురాయి… ఈ నెంబర్‌(₹1000 కోట్లు)... నిజానికి మనలాంటి యువతకు ఇదోక పెద్ద విజయమే. కానీ, వాస్తవానికి ఇక్కడ ఎలాంటి రక్తం , గోర్‌, అశ్లీలత, రెచ్చగొట్టే.. దోపిడీ కంటెంట్ లేదు. అయినా ఈ మైలురాయిని మనం సాధించడమంటే చిన్న విషయం కాదు... మూవీని ఆదరించి పెద్ద విజయానికి కారణమైన ప్రేక్షకులకు, నటీనటులకు బిగ్ థ్యాంక్యూ. ఇది ఇండియన్‌, రేపటికోసం #Repatikosam" అని రాసుకొచ్చారు.


అయితే ఇంతకు ముందు వేరేమో కానీ ఇప్పుడు ఇంత పెద్ద హిట్ ఇచ్చాక నాగ్ అశ్విన్ ఏమి మాట్లాడినా, ఏం పోస్ట్ పెట్టినా నిశితంగా అందరి కళ్లూ గమనిస్తూనే ఉంటాయి. అందరూ మెదళ్లకు పని పెడుతూనే ఉంటారు. దాంతో ఈ ఇనిస్ట్రా పోస్టు నాగ్ అశ్విన్ యథాలాపంగా పెట్టింది కాదని.. మరో తెలుగు డైరక్టర్ సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేసేలా ఉందని కామెంట్స్ చేయటం మొదలెట్టేసారు. ముఖ్యంగా కల్కిలో రక్తం , గోర్‌, అశ్లీలత, రెచ్చగొట్టే.. దోపిడీ కంటెంట్ లేదు. అయినా ఈ మైలురాయిని మనం సాధించడమంటే చిన్న విషయం కాదు అనటం కావాలనే ఈ పదాలు వాడినట్లు భావిస్తూ అదే వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ‘అర్జున్ రెడ్డి’తో పాటు ‘యానిమల్’ సినిమా బ్లాక్‌బస్టర్లు అయినప్పటికీ సందీప్ రెడ్డి ఆయా చిత్రాల్లో చూపించిన విషయాల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమాలో హీరో బిహేవియర్.. మహిళల పట్ల అతడి తీరు.. కొన్ని డైలాగుల విషయంలో విమర్శలు వచ్చాయి. వాటిని గుర్తు చేస్తూనే నాగ్ అశ్విన్ అన్నాడన్నారు. దానికి తోడు నాగ్ అశ్విన్ ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే డిలేట్ చేసేయటంతో కన్ఫర్మ్ చేసేసారు. కాబట్టి అసలు నాగ్ అశ్విన్ మనస్సులో కావాలనే సందీప్ కు కౌంటర్ ఇద్దామని ఉందా లేదా అనేది అతను వచ్చి చెప్తే కానీ తెలియదు. అప్పటిదాకా మనం కూడా ఏమీ చెప్పలేము. అంతా ఊహాగానాలే

ఇక సందీప్ వంగా ని అర్జున్ రెడ్డి సమయంలో చాలా మంది వ్యతిరకంగా కామెంట్స్ చేసారు. ఇక యానిమల్ టైమ్ లో అయితే అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు నుంచి జావెద్ అక్తర్ లాంటి దిగ్గజాలు, ఎంతో మంది నటులు అనేకమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను తప్పుబట్టారు. యువతను తప్పుదోవ పట్టించేలా ఈ చిత్రం ఉందన్నారు. చెడును గ్లోరిఫై చేస్తూ సినిమా తీసి సొమ్ము చేసుకున్నాడంటూ సందీప్‌ ని అన్నారు. అయితే సందీప్ కూడా తగ్గేదేలే అన్నట్లు వారందరికీ సరైన కౌంటర్స్ ఇస్తూనే వచ్చాడు.

ఇప్పుడు సందీప్ పేరు ప్రస్తావన నాగ్ అశ్విన్ చేసిన ఈ పోస్ట్ లో లేదు. అయినా సరే ఇప్పుడు ఈ కోణంలోంచి నాగ్ అశ్విన్ పోస్టు చూస్తే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. సందీప్‌ తీసిన ‘యానిమల్’కు కౌంటర్‌లాగే అనిపిస్తోంది. నువ్వు హింసతో హిట్ కొట్టావు..నేను క్లీన్ కంటెంట్‌తోనే ఇంత పెద్ద విజయం సాధించామంటూ సందీప్‌ను అంటున్నట్లుగా ఈ పోస్టు కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా సందీప్ వంగా అభిమానులకు కోపం తెచ్చి విషయమై. వారు ఈ పోస్ట్ పైన మీద మండిపడుతూ రిప్లై ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో 600 కోట్లు సాధించిన సందీప్ నా తప్పుపడుతున్నావ్ అంటున్నారు.

ఏదైమైనా సందీప్ ..యానిమల్ చిత్రం తర్వాత ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా అతని సినిమాలు జనం విరగబడి చూస్తూనే ఉన్నారు. ప్రభాస్ వంటి స్టార్స్ డేట్స్ ఇస్తున్నారు. రాబోయే సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటప్పుడు ఖచ్ఛితంగా ఇలాంటి సినిమాలనే సందీప్ తీస్తారు. అయినా సినిమా ఇలాగే తియ్యాలనే రూల్ ఏముంది. తేడాగా ఉంటే సెన్సార్ ఆపుతుంది. ఇంకా తేడాగా ఉంటే జనమే చూడరు. అలాంటప్పుడు నువ్వు ఇలా తీసావ్..అలా తీసావ్ అనటంలో అర్దమే లేదు. ఎందుకంటే చెప్పేవారి మాటలు పట్టుకుని సినిమా చేసి, అప్పుడు అది ఆడకపోతే వీరు ఎవరూ కూడా ఆదుకోరు కదా...చివరకు చూడండి అనే ఫేస్ బుక్ పోస్ట్ కూడా పెట్టరు కదా.

Read More
Next Story