‘కాంతార’ లాంటి చిత్రాలకే ఆదరణ పెరుగుతోందా?
x

‘కాంతార’ లాంటి చిత్రాలకే ఆదరణ పెరుగుతోందా?

కన్నడ సినిమా బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన ‘కాంతారా’ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. సమగ్ర వినోదాత్మక అవార్డు సైతం ఈ చిత్రానికే దక్కింది.


కన్నడ సినిమా బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన ‘కాంతారా’ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. సమగ్ర వినోదాత్మక అవార్డు సైతం ఈ చిత్రానికే దక్కింది. ఈ మూవీలో నటించిన రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. తొమ్మిదేళ్లలో ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి కన్నడ నటుడిగా ఆయన నిలిచాడు. స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి కన్నడ నటుడిగా రిషబ్ శెట్టి చరిత్రకెక్కారు. చివరిసారిగా ఎంవీ వాసుదేవరావు (చోమన దూడి, 1975), చారుహాసన్ (తబరన కథ, 1986), దివంగత సంచారి విజయ్ (నాను అవలల్ల అవును, 2015) ఈ అవార్డు అందుకున్నారు.

ప్రముఖ నిర్మాత, కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ ఉమేష్ బణాకర్ ఇలా అన్నారు: “కన్నడ సినిమా 90వ సంవత్సరంలో ఇది నిజంగా కీలకమైన ఘట్టం. చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించవచ్చు. లేదా ఫెయిల్ కావొచ్చు. ఇది నటులు, దర్శకులు, నిర్మాతలను భయాందోళనలకు గురిచేస్తుంది. పన్నగ భరణ వంటి అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ విడుదల కోసం మరింత వ్యూహాత్మక విధానాన్ని కోరుతున్నారు. "మాకు ప్రతి వారం 10 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. కానీ ఎవరూ కాంతారా లేదా KGF మాయాజాలాన్ని తీసివేయడం లేదు" అని చెప్పాడు. "సప్లై, డిమాండ్ మధ్య సమతుల్యత లేదు. ఏడాదికి 250 నుంచి 300 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 10 మాత్రమే జాక్‌పాట్ కొట్టాయి.’’ అని రాక్ లైన్ వెంకటేశ్ పేర్కొన్నారు.

సినీ విమర్శకులు, పండితులు కూడా అంతే ఆందోళన చెందుతున్నారు. kannadascreens.com ఎడిటర్ చేతన్ నాడిగర్... “దర్శన్ నటించిన కాటేరా (2023) తప్ప, కన్నడ చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద నిజంగా టేకాఫ్ కాలేదు. ఖచ్చితంగా దునియా విజయ్ నటించిన భీమా, గణేష్ నటించిన కృష్ణం ప్రణయ సఖి ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నాయి. “2023లో 230 సినిమాల్లో కేవలం 15 మాత్రమే బాక్సాఫీస్ వద్ద బోనీ కొట్టాయి. 2024 ప్రథమార్థంలో విడుదలైన 125 చిత్రాలలో సక్సెస్ రేటు చాలా తక్కువ” అని అన్నారు.

కాంతార కథేమిటంటే:

18వ శతాబ్దంలో ఓ రాజుకు మనశ్శాంతి కరువవడంతో గురువుల సలహా మేరకు మనశ్శాంతిని వెతుక్కుంటూ దేశాటనకు బయలుదేరుతాడు. ఈ క్రమంలో రాజుకు అడవిలోని ఓ గూడెం వద్ద రాయి రూపంలో దేవుడు కనిపిస్తాడు. దాన్ని దర్శించుకోగానే రాజుకు ప్రశాంతత చేకూరుతుంది. ఆ దేవుణ్ణి తనకు ఇచ్చేస్తే గూడెం జనాలకు తాను భూమి ఇస్తానని రాజు ఆశచూపుతాడు. అయితే అక్కడే ఉన్న ఓ గూడెం వాసుణ్ణి ఆవహించిన దేవుడు తన అరుపు ఎంతవరకు వినిపిస్తే అంతవరకు రాజ్యాన్ని ఏలుకోమంటాడు. తరాలు మారుతాయి. కథ 1970లోకి ప్రవేశిస్తుంది. ఓ రోజు రాజు వారసుడు అక్కడ సంప్రదాయబద్దంగా జరిగే కోలం ఉత్సవంలో దేవుని వేషం కట్టిన వ్యక్తిని దూషిస్తాడు. ఆ అటవీ భూమి ఒకప్పుడు తన పూర్వీకులది కాబట్టి తనకే చెందాలని వాదిస్తాడు. నిజంగా దేవుడుంటే చూపించమని హేళన చేస్తాడు. అప్పుడు దేవుడి ఆవాహనలో ఉన్న వ్యక్తి అడవిలోకి వెళ్లి అంతర్థానమవుతాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రాజు వారసుడు కోర్టు మెట్ల మీద రక్తం కక్కుకొని మరణిస్తాడు. ఆ తర్వాత కథ 90దశకంలోకి ప్రవేశిస్తుంది. రాజు వారసత్వ పరంపరకు చెందిన దొర (అచ్యుత్‌) అడవిలో గూడెం ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతుంటాడు. అదే గూడానికి చెందిన శివ (రిషబ్‌శెట్టి) అక్కడి ప్రజలకు చేదోడువాదోడుగా ఉంటూ కష్టాల్ని తీర్చుతుంటాడు. అదే సమయంలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కిషోర్‌ కుమార్‌ అటవీ భూముల్లో అన్యాయంగా గూడెం వెలిసిందని వాటికి హద్దులు గీసి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటిని శివ ప్రతిఘటిస్తుంటాడు. ఈ నేపథ్యంలో శివపై హత్యాయత్న నేరం మోపి జైలుకు పంపిస్తారు. అదే సమయంలో కోలం ఉత్సవంలో దేవుడి వేషం కట్టే శివ తమ్ముడు గురువా ఓ రోజు హత్యకు గురవుతాడు. ఇంతకు శివ తమ్ముడు గురువాను హత్య చేసిందెవరు? వరహా రూపంలో ఉండే విష్ణుమూర్తి అవతారం తరచూ శివను ఎందుకు కలవరపెడుతుంటుంది? చివరకు గూడాన్ని శివ దుర్మార్గుల బారి నుంచి ఎలా రక్షించాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ..

ఆ రెండు చిత్రాల ద్వారానే రూ. 400 కోట్లు..

కన్నడ సినిమా పరాజయాల పరంపర కేవలం దురదృష్టం లేదా దేవుళ్ల ఆగ్రహానికి సంబంధించినది కాదని సినీ రచయితలు అంగీకరిస్తున్నారు. అక్టోబర్ 2024లో సంకేత్ కులకర్ణి, రోహన్ బాబు రాసిన కాలం ఒకటి ప్రచురితమమైంది. స్థానిక సంస్కృతి, నైతికతలోకి ప్రవేశించకుండా లేదా విభిన్నమైన, వ్యూహాత్మక కంటెంట్‌ను రూపొందించకుండా, కన్నడ సినిమా తడబడుతోందని అందులో రాసుకొచ్చారు. కులకర్ణి, బాబు తమ వ్యాసంలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘2022లో KGF-2, కాంతారా అనే రెండు సినిమాలు మొత్తం పరిశ్రమను తమ భుజాలపై వేసుకున్నాయి. ఈ రెండు చిత్రాల ద్వారా కన్నడ సినిమా ఇప్పటికీ రూ. 400 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఏడాది విడుదలైన చిత్రాలు 200 కోట్లు కూడా రాబట్టలేదు. 2022 నాటి గ్లోరీ డేస్‌లోని జేమ్స్, గంధాడ గుడి, విక్రాంత్ రోన, 777 చార్లీ వంటి హిట్ చిత్రాలు, గాలిపాట-2, లవ్ మాక్‌టెయిల్-2 లాంటి సీక్వెల్‌లు బాక్సాఫీస్‌కు మంచి ఊపునిచ్చాయి’ అని కులకర్ణి మరియు బాబు రాశారు.

కన్నడ చిత్ర పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటుందా?

‘‘కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, కర్ణాటక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ముఖ్యంగా 15 ఏళ్ల కర్ణాటక చలనచిత్ర అకాడమీ కన్నడ సమస్యలపై కూర్చొని చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది. కర్ణాటక సినీ -సాంస్కృతిక కార్మికుల సంక్షేమం బిల్లు 2024 జూలై 19న శాసనసభలో ప్రవేశ పెట్టారు. సినిమా టిక్కెట్లు, OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఫీజుపై 2% సెస్ సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కళాకారులకు మేలు చేయడమే ఈ బిల్లు ఉద్దేశం అని పేర్కొంది. “కర్ణాటకలో సినిమా హాల్లు ఒక్కొక్కటిగా మూసివేస్తున్నప్పుడు, 2 శాతం సెస్ పెద్ద దెబ్బే. ఈ పరిణామం వల్ల తలెత్తే సమస్యలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్దకు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి వివరిస్తాం. అదే సమయంలో కన్నడ సినిమా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తాం’’ అని కర్ణాటక ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ చంద్రశేఖర్ అన్నారు.

క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రార్థనలు, పూజలు, రాజకీయాలు ఇటీవల జోరందుకున్నాయి. కన్నడ సినిమా ప్రస్తుత పతనం నుంచి బయటపడేందుకు ఇది సరిపోతాయా అన్నదే ప్రశ్న?

Read More
Next Story