సంక్రాంతి సక్సెస్ ఫార్ములా  గేమ్  ఛేంజర్  తో బ్యాక్ ఫైర్ కాబోతుందా?
x

సంక్రాంతి సక్సెస్ ఫార్ములా 'గేమ్ ఛేంజర్ ' తో బ్యాక్ ఫైర్ కాబోతుందా?

ఈ సంక్రాంతికి బరిలో ఉన్న గేమ్ ఛేంజర్ ,డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఈ పండుగ కలిసి వస్తుందా?రాదా?


సంక్రాంతి రాబోతుంది! కొత్త తెలుగు సినిమాల హడావుడి కూడా మొదలైంది. జనవరి 10 న 'గేమ్ ఛేంజర్', జనవరి 12 న 'డాకు మహారాజ్', జనవరి 14 న 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాలు ఈ సంక్రాంతి బరిలో ఉన్నాయి. అటూ ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు తెలుగు సినిమాల టికెట్ల పెంపుకి ప్రభుత్వం అనుమతి కూడా వచ్చేసింది. ఒక్క 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు తప్పితే, మిగిలిన రెండు సినిమాలకి బెనిఫిట్ షోలను కూడా ఆంధ్రా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంలో తెలంగాణలో మాత్రం పుష్ప-2 సినిమా విషయంలో జరిగిన వృత్తాంతం పునరావృతం కాకుండా ఉండటానికి ఇక్కడ బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండబోవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే తేల్చేసారు. డాకు మహారాజ్ సినిమాకి నిర్మాతగా ఉన్న నాగవంశీ ఒక ప్రెస్ మీట్ లో తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు గురించి తానూ అడగలేదని, ఇప్పుడు ఉన్న మామూలు ధరలతో కూడా తానూ సంతోషంగా ఉన్నానని అన్నారు. వీటిని బట్టి చూస్తే ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాల కలక్షన్స్ ఆంధ్రాలో ఎక్కువ వసూలు అయితేనే సక్సెస్ టాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఇప్పుడు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఈ సంక్రాంతికి పెద్ద సినిమా. శంకర్-రామ్ చరణ్ -దిల్ రాజు కాంబినేషన్ లో ఐ సినిమా రాబోతూ ఉండటంతో అటూ ఫ్యాన్స్, ఇటు మామూలు ఆడియన్స్ కూడా దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా కలక్షన్స్ రెండు రాష్ట్రాల్లో వేర్వేరు టికెట్ ధరల వల్ల మొదటి రోజుల్లో పెట్టిన పెట్టుబడిని వసూలు చేసే అవకాశాలు ఎంతమేరకు ఉండవచ్చు?సినిమా రిలీజ్ అయిన రోజు నుండి సోషల్ ప్రమోషన్స్ తో కలక్షన్స్ సంఖ్యతో అదరగొట్టే ఊకదంపుడు ఇప్పుడు ఎలా మారబోతుంది? ఇది కూడా తెలుగు సినిమాకు ఒక 'గేమ్ ఛేంజర్'!



ఇంకేదైనా సందర్భంలో ఈ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోతే అప్పుడు వేరేలా ఉండేదేమో! కానీ సంక్రాంతి మాములు పండుగ మాత్రమే కాదు;సినిమా వసూళ్ళ పండుగ కూడా.పండుగను జరుపుకునే క్రమంలో ఒక సెలబ్రేషన్ గా కుటుంబం అంతా కలిసి సినిమా థియేటర్ లో చూడటం ఎప్పటినుండో మన సంస్కృతిలో ఒక భాగం కూడా అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ ,యువత ,ఫ్యాన్స్ ;ఇలా ఎక్కువ శాతం మంది సినిమా థియేటర్ లో చూసే అవకాశం ఇచ్చేది ఈ పండుగలే. దీనిని సక్సెస్ ఫార్ములాగా చేసుకునే పెద్ద సినిమాలను పండుగలకు విడుదల చేయడం కూడా ఒక సినిమా మార్కెట్ సక్సెస్ సీక్రెట్ గా మారిపోయింది. మరి ఇప్పుడు ఆ సక్సెస్ ఫార్ములా ఫెయిల్ అవ్వబోతుందా? చూద్దాం!



భారీ బడ్జెట్లతో వచ్చే సినిమాలకు టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలు బ్రేక్ ఈవెన్ ను ఇస్తాయి. ఇప్పుడు తెలంగాణలో మాత్రం వీటికి ఆస్కారం ఉండనట్టే కనిపిస్తుంది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో ల వల్ల వచ్చే హైప్ లేకపోవడం కూడా ఇప్పటివరకు సినిమా కమర్షియల్ సక్సెస్ ని నిర్ణయించిన సమీకరణాలు ఈ సారి తిరగబడొచ్చు. అటూ ఆంధ్రాలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉన్నా సరే; తెలంగాణ అస్సలు లేకపోవడం అన్నది ఇప్పటివరకూ ఈ షోలు, టికెట్ల పెంపు ఉన్న ఇంతకుముందు సినిమాలకు ఉన్నఅన్ని లాభాలు మాత్రం ఇప్పటి నుండి రాబోయే సినిమాలకు వర్తించవు. మరి ఈ ప్రభావాన్ని దర్శకులు,నిర్మాతలు ఎలా చూస్తారు? తెలంగాణలో సినిమాలు విడుదల చేయడానికి భవిష్యత్తులో వారు ఆసక్తి చూపుతారా లేక ఆంధ్రాకి పరిమితమయ్యే ఆలోచన చేస్తారా ? లేక పోతే బడ్జెట్లు, హీరోల మరియు అగ్రనటుల రెమ్యునరేషన్లు తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతాయా?ఇది భారీ బడ్జెట్లతో సినిమాలు తీసే దర్శకులకు,హీరోలకు ఒక పాఠంగా మారుతుందా? ఇదంతా ఒక కోణం! మరి ప్రజలు ఈ అంశాన్ని ఎలా చూస్తారు?మధ్యతరగతి జీవితాల్లో కొంత క్యాంపరిజన్ మనస్తత్వం ఉంటుంది. మనం మార్కుల నుండి వస్తువుల ధరల వరకూ అన్ని పోల్చుకుంటూ ఉంటాం. మరి ఒక పక్క తెలంగాణ లో తక్కువ ధరలకు టికెట్లు ఉంటే , ఆంధ్రాలో ఈ పెరిగిన ధరలను ప్రజలు ఆమోదిస్తారా? లేదా ఓటిటి లో ఈ సినిమా చూద్దాం అనుకుంటారా? ఇక పోతే ఈ పెద్ద సినిమాల విషయంలో అటూ ఆంధ్రా, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు భిన్న నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఏ కొత్త రాజకీయ సమీకరణానికి నాంది పలుకుతుందో? చూద్దాం ....ఈ పరిణామాలు తెలుగు చిత్ర పరిశ్రమ కమర్షియల్ మార్కెట్ లో ఎన్ని మార్పులు తీసుకురాబోతున్నాయో !
* * *


Read More
Next Story