తీరా కాదల్ : నెట్ ఫ్లిక్స్ మూవీ  రివ్యూ!
x

'తీరా కాదల్' : నెట్ ఫ్లిక్స్ మూవీ రివ్యూ!

మీరు ఓ ట్రిప్ కు వెళ్లారు. అక్కడ మీరు అప్పట్లో విపరీతంగా ప్రేమించి, తప్పనిసరి పరిస్దితుల్లో బ్రేకప్ చెప్పేసుకున్న మీ లవర్ కనపడింది.


మీరు ఓ ట్రిప్ కు వెళ్లారు. అక్కడ మీరు అప్పట్లో విపరీతంగా ప్రేమించి, తప్పనిసరి పరిస్దితుల్లో బ్రేకప్ చెప్పేసుకున్న మీ లవర్ కనపడింది. అప్పటికే మీ పెళ్లైపోయింది. ఆమెకు సేమ్ టు సేమ్ పెళ్లైపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు. పలకరిస్తారా...పాత ప్రేమను తవ్వటం మొదలెడతారా...తవ్వితే అది ఎక్కడితో ఆగుతుంది.

కొన్ని రిలేషన్స్ హటాత్తుగా ఏర్పడతాయి. వాటిని అక్కడతో ఆపేద్దామనుకున్నా కొనసాగుతూనే ఉంటాయి. అలాంటివి ఎక్కువగా వెకేషన్స్ లోనూ, వర్క్ ట్రిప్ కు కోలీగ్స్ తో వెళ్లినప్పుడు మొదలవుతాయి. మనని హెచ్చరించేవాళ్లు, కంట్రోలు చేసేవాళ్లు లేరు అనుకున్నప్పుడు కేర్ ఫ్రీ జీవితం ఉన్నప్పుడు వీటికి ఆస్కారం ఉంటుంది. ఓ ట్రిప్ లో మీ ఎక్స్ లవర్ కనపడితే అప్పటికే మీకు పెళ్లైపోతే ..ఓల్డ్ రొమాన్స్ మళ్లీ చిగురిస్తుందా..చిగురించి కొమ్మలు వేయబోతే వచ్చే పర్యవసానాలు ఏమిటి...

చెన్నైలో జాబ్ చేస్తున్న గౌతమ్ (జై) గౌతమ బుద్దుడేమీ కాదు కానీ తన భార్య , బిడ్డలతో హ్యాపీ లైఫ్ గడుపుతున్నాడు. బార్య వందన (శివద) కూడా ఒక కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి అతను కంపెనీ పనిమీద మంగుళూరు ట్రైన్ లో బయల్దేరతాడు. అప్పుడు అతనికి శరణ్య (ఐశ్వర్య రాజేశ్) కనపడుతుంది. దాదాపు ఎనిమిదేళ్లు అయ్యిపోయింది. ఇద్దరు కలిసి. దాంతో మొహమాట పడుతూ, ఇబ్బంది పడుతూనే పలకరించుకుంటారు. గ్రహించే ఉంటారు. కాలేజీ లైఫ్ లో వీళ్లిద్దరూ లవర్స్ అని.

మనస్సు మాట వినదు కదా. ఇద్దరి గత జ్ఞాపకాలు,మధుర స్మృతులు ఒక్కసారి ఓపెన్ అవుతాయి. వాళ్ల ప్రేమ కు సెకండ్ ఛాన్స్ వచ్చినట్లు అవుతుంది. ఇద్దరూ ఓపెన్ గా తమకు పెళ్లైందనే విషయాలు రివీల్ చేసుకుంటారు. తమ పార్టనర్స్ గురించి చెప్పుకుంటారు. ఇంకా చాలా విషయాలు మెమరైజ్ చేసుకుంటారు. ట్రైన్ జర్నీ పూర్తి అవటంతో వాళ్ళ గతం తవ్వుకోవటం ఆపేసినా ఇద్దరూ మంగుళూరులో కలవటం మాత్రం మానరు.

తరుచుగా ఇద్దరూ డిన్నర్స్ కు వెళ్లటం, ఆఫీస్ కు డుమ్మా కొట్టి కలుసుకుని కబుర్లు చెప్పుకోవటం, ఇద్దరూ సన్నిహితంగా మసులుకోవటం మొదలెడతారు. అయితే ఇద్దరికి తెలుసు చెన్నైకు వెళ్లాక ఎవరి జీవితాలు వాళ్లవి అని. దాంతో సినిమాటెక్ భాషలో చెప్పాలంటే మాంటేజ్ లతో కొత్తగా ప్రేమలో పడిన జంటలా తిరుగుతారు. అంతా బాగానే ఉంది త్వరలోనే హానిమూన్ లాంటి మంగుళూరు ట్రిప్ ముగిసింది. ఇద్దరూ చెన్నై వెళ్లిపోయారు. అయితే అసలు కథ అక్కడే మొదలైంది.

గౌతమ్ తిరిగి తన జీవితంలో పడిపోతాడు. కానీ శరణ్య మాత్రం అలా చెయ్యలేకపోతుంది. తనను ఇబ్బంది పెడుతున్న భర్తను వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. అంతేకాకుండా గౌతమ్ ప్లాట్ కు ఆపోజిట్ ప్లాట్ లో దిగుతుంది. నేను నా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను కాబట్టి నువ్వు కూడా నీ భార్యకు బై చెప్పి వచ్చేసేయి అని ప్రెజర్ పెట్టడం మొదలెడుతుంది. గౌతమ్ కు ఏం చేయాలో అర్దం కాదు. అటు భార్యకు ఈ విషయం తెలియనివ్వకూడదని మేనేజ్ చేస్తూంటాడు. మౌనంగా టార్చర్ లా దాన్ని అనుభవిస్తూంటాడు.

అయితే గౌతమ్ భార్య వందన తెలివైంది. తన భర్త ఈ మధ్యన అదోలాగ ఉంటున్నాడు...ఏదో తేడా కొడుతోందని ఓ కన్నేస్తుంది. ఆ క్రమంలో అసలు నిజం బయిటపడుతుంది. అప్పుడు ఏమైంది. గౌతమ్ ఎటువైపు మ్రొగ్గాడు. శరణ్య చివరకు ఏం నిర్ణయం తీసుకుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నిజానికి ఇది పెద్ద కథేమి కాదు కానీ నీట్ గా డైరక్టర్ ప్రెజెంట్ చేసారు. ఇంతకు ముందు తమిళంలో ఇలా గతంలో ప్రేమలో పడి..ఇప్పుడు మళ్లీ కలిసిన వాళ్ల కథతో 96(2018) సినిమా వచ్చింది. శర్వానంద్ తో తెలుగులోనూ రీమేక్ చేసారు. ఆ సినిమాకు ఎక్సటెన్షన్ లాగ అనిపిస్తుంది. అయితే శరణ్య పాత్ర తీసుకునే డెసిషన్ తో కథలో కల్లోలం ఏర్పడుతుంది. అదే చివరిదాకా సినిమాని నిలబెడుతుంది. అయితే క్లైమాక్స్ ఇంకాస్త బాగా చేసి ఉంటే బాగుండును అనిపిస్తుంది. హడావిడిగా హఠాత్తుగా సినిమా ముగింపుకు వచ్చేసింది కాబట్టి శరణ్య పాత్రకు ఏదో దారి చేయాలనే తపన దర్శకుడులో కనపడుతుంది.

ఫైనల్ గా విజయ్ సేతుపతి, త్రిష కాంబోలో వచ్చిన 96 సినిమా మీ ఎక్స్ కనపడినప్పుడు ఏమి జరుగుతుందనే విషయాన్ని రొమాంటిసైజేషన్ చేస్తే ఈ సినిమా ప్రాక్టికల్ ఎప్రోచ్ తో వెళ్లినట్లు అనిపిస్తుంది.

టెక్నీషియన్స్ అందరు బాగా చేసారు. జై పాత్ర చూస్తుంటే రాజు- రాణి సినిమా గుర్తు వస్తుంది. ఐశ్వర్య రాజేష్ ఒంటి చేత్తో సినిమాని మోసుకు వెళ్లిపోయింది. అలాగే ఈ సినిమాకు మరో హీరో బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

చూడచ్చా

అసభ్యత, హింస లేని ఈ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎంగేజ్ చేస్తుంది. ఓ లుక్కేయవచ్చు

ఎక్కడుంది

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story