జిలేబి ఓటిటి  మూవీ రివ్యూ
x

'జిలేబి' ఓటిటి మూవీ రివ్యూ

కాలక్రమంలో ఓ దర్శకుడు తన ప్రతిభను కోల్పోతాడా లేక అనుభవం రాటు తేలి మరింత రాణిస్తాడా అంటే చాలా సార్లు ఫేడవుట్ అవుతారు అనే సినిమా టెక్నికల్ పదమే వాడాల్సి వస్తుంది.


కాలక్రమంలో ఓ దర్శకుడు తన ప్రతిభను కోల్పోతాడా లేక అనుభవం రాటు తేలి మరింత రాణిస్తాడా అంటే చాలా సార్లు ఫేడవుట్ అవుతారు అనే సినిమా టెక్నికల్ పదమే వాడాల్సి వస్తుంది. గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన దర్శకులు చాలా సార్లు తమ మ్యాజిక్ ని కోల్పోతున్నారు. ఇక దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మదుడు ,మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ విజయ భాస్కర్. ఆయన రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా జిలేబి. చాలా గ్యాప్ తరువాత ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో విజయ భాస్కర్ తన కొడుకు శ్రీ కమల్ ను హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. ఇంట్రస్టింగ్ కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆహా ఓటిటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే..

స్టోరీ లైన్

అల్లరి బేవార్స్ కుర్రాడు కమల్ (శ్రీ కమల్). అతనికి పరిచయమైన జి లక్ష్మి భారతి అలియాస్ జిలేబి (శివానీ రాజశేఖర్) ఓ పని అప్పచెప్తుంది. దాని నిమిత్తం ఇరవై వేలు కూడా పే చేస్తుంది. అదేమిటంటే....కమల్ ఉంటే బోయ్స్ హాస్టల్ లో తనకు పని ఉందనికి, అక్కడకు సీక్రెట్ గా తీసుకెళ్లి,తీసుకురావాలని అడుగుతుంది. ఎందుకంటే ఆ హాస్టల్ ని మేనేజ్ చేస్తున్న వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) చాలా స్ట్రిక్ట్. ఆయన కళ్లు గప్పి ఎలాగయితేనేం లోపలకు ఈజీగానే తీసుకువెళ్తాడు. అయితే వెనక్కి వచ్చేద్దామంటే రకరకాల సమస్యలు ఎదురౌతాయి.

ఈ క్రమంలో ఆమెని బయిటకు తీసుకెళ్ళటానికి కమల్ ప్రయత్నిస్తూంటే...అతని స్నేహితులు బుజ్జి (సాయి కుమార్ బబ్లూ), బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ)లు కు ఆమె ఇక్కడుందని తెలిసిపోతుంది. దాంతో కమల్ వారికి విషయం చెప్పి సాయిం కోరతాడు. మరో ప్రక్క తన కూతురు కనపడటం లేదని జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) తన మనష్యులతో సీరియస్ గా వెతకటం మొదలెడతాడు. ఈ క్రమంలో జిలేబికి, కమల్ కు ఎదురైన పరిస్థితులు ఏంటి.. ఈ హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) కు ఆమె తన హాస్టల్ లోనే ఉందనే విషయం తెలిసిందా? తండ్రి రుద్ర ప్రతాప్‌రానా (మురళీ శర్మ) కు ఆమె ఇక్కడే ఉందని ఎలా తెలిసింది?చివరికి జిలేబీ బాయ్స్‌ హాస్టల్‌ నుంచి ఎలా బయటపడింది అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే...

బోయ్స్ హాస్టల్ లో ఓ అమ్మాయి ఇరుక్కుందంటే వినటానికి ఫన్నీగా ఉంటుంది. చాలా ఊహలు మనకు వస్తాయి. అయితే అవేమీ ఈ సినిమాలో ఊహామాత్రంగా అయినా కనపడవు. కామెడీ అంతా ఇరవై ఏళ్ల క్రితం స్టక్ అయ్యిపోయినట్లు అనిపిస్తుంది. కావాలని ప్రాస డైలాగులు మాట్లాడిస్తూంటే విజయ్ బాస్కర్ తన హిట్ సినిమాల రోజుల్లోనే ఉన్నారని అర్దమవుతోంది. ఇప్పుడు మారిన ట్రెండ్ ని ఆయన నామ మాత్రంగా అయినా టచ్ చేయలేదు. ఇప్పటి యూత్ మాట దేవుడెవరుగు..ఆయన సినిమాలు ఆదరించిన యూత్ కు కూడా ఈ సినిమా పెద్దగా అలరించదు.

ఇలాంటి సినిమా కథలు స్క్రీన్ ప్లే ప్రధానంగా నడపాలి. ఈ సినిమాలో ఓ హాస్టల్, నాలుగైదు క్యారక్టర్స్ మధ్య మొత్తం నడుస్తుంది. ఆ గదిలోంచి..ఈ గదిలోకి...అక్కడనుంచి మరో గదిలోకి అన్నట్లు అక్కడక్కడే తిరుగుతుంది. అలా అక్కడక్కడే కథ తిరిగేటప్పుడు బోర్ కొడుతుంది. దాన్ని దాటేందుకు డైరక్టర్ పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు. అలాగే ఈ చిత్రం మళయాళంలో వచ్చిన చిత్రానికి రీమేక్. ఇక్కడికి పెద్దగా మార్పులు చేసుకున్నట్లు లేరు. దాంతో కాంటపరరీ సినిమాగా అనిపించదు.

నటీనటుల్లో ...

విజయ్ భాస్కర్ కుమారుడు కమల్ ని పరిచయం చేస్తూ చేసిన సినిమా ఇది. అయితే అనుకున్న స్దాయిలో అతను ఫెరఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. తండ్రే డైరక్టర్ కావటంతో కాంప్రమైజ్ అయ్యారో మరేమో తెలియదు. హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ జస్ట్ ఓకే. ఆమె మంచి ఫెరఫార్మర్ కాని పెద్దగా స్కోప్ లేదు. మురళి శర్మ ..ఓ రూడ్ ఎమ్మల్యేగా కనిపించాలని తాపత్రయపడ్డారు. నలుగురు రౌడీలు ని వెనకేసుకున్నంత మాత్రాన ఆయన విలన్ గా కనిపిస్తారనుకుంటే కష్టమే.

చూడచ్చా

మీరు విజయ భాస్కర్ కొత్త సినిమా అనుకుని ఎక్సపెక్ట్ చేసి చూస్తే బోల్తా పడతారు. ఏవో కొన్ని కామెడి సీన్స్ ఉన్న తెలుగు సినిమా చూడాలనుకుంటే ఓకే.

ఏ ఓటిటిలో ఉంది

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story