జియో సినిమాలో  ఫ్రీగా IPL :  లెక్కలు చూస్తే మతిపోతుంది
x

'జియో సినిమా'లో 'ఫ్రీగా IPL : లెక్కలు చూస్తే మతిపోతుంది

ఫ్రీగా IPL ఇచ్చేయటం వల్ల జియోకు కలిసి వచ్చేదేముటుంది అంటే చాలానే అంటోంది ట్రేడ్. ఈ ప్రీ గా ఇవ్వటం వెనుక భారీ స్కెచ్ ఉంది.అదేంటంటే...


ఇంతకు ముందు ఐపీఎల్ సీజన్ డిజిటల్ ప్రసార హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి ఉండేవి. అయితే, 2023 సీజన్ నుంచి 2027 ఐపీఎల్ సీజన్ వరకు డిజిటల్ హక్కులను వయాకామ్ 18 చేజిక్కించుకుంది. ఈ క్రమంలో ఎలాంటి ఛార్జీలు లేకుండా ఐపీఎల్ చూసే అవకాశాన్ని జియో సినిమా కల్పిస్తోంది. దీంతో యూజర్లు పండగ చేసుకుంటున్నారు. అయితే అలా ఫ్రీగా ఇచ్చేయటం వల్ల జియోకు కలిసి వచ్చేదేముటుంది అంటే చాలానే అంటోంది ట్రేడ్. ఈ ప్రీ గా ఇవ్వటం వెనుక భారీ స్కెచ్ ఉందని, ఈ ఫ్రీ వల్ల భారీగా లాభపడిందని చెప్తున్నారు. అది ఏ విధంగానో చూద్దాం.


IPL ఇంతకు ముందు Disney+ Hotstar లో ప్రీమియం ప్రైస్ కు అంటే సంవత్సరానికి 1499/ - ఉండేది. ఐపీఎల్ కు ఉన్న ఫాలోయింగ్ తో చాలా మంది ఈ ఓటిటికు చందాదారులు అయ్యేవారు. అలా వినియోగదారులు బాగా పెరిగారు. 2022లో ఓపినింగ్ మ్యాచ్ కు ఎనిమిది కోట్ల మంది వ్యూయర్స్ లాగ్ అయ్యారు. ఈ క్రమంలో అయితే జియో ఎంతో ఖర్చు పెట్టి రైట్స్ తీసున్న ఐపీఎల్ ని ఉచితంగా స్ట్రీమింగ్ చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే జియో సినిమా తీసుకున్న ఈ స్ట్రాటజీ బాగా పనిచేసింది. 2023 ఐపీఎల్ సీజన్ కు వచ్చేసరికి జియో సినిమా కు 12 కోట్లు మంది వ్యూయర్స్ లాగ్ అయ్యారు. ఐపీఎల్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కు ఇవ్వటమే కలిసొచ్చింది. ఫ్రీ స్టీమింగ్ తో 40% వ్యూయర్స్ పెరిగారు. అలాగే 2022 సీజన్ లో డిస్నీ హాట్ స్టార్ ...2200 కోట్లు సబ్ స్క్రిప్షన్స్ ద్వారాను, యాడ్స్ ద్వారాను సంపాదించింది.

2023 సీజన్ విషయానికి వస్తే జియో సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ ఇచ్చింది. అయితే ఫ్రీ కావటంతో చాలా మంది చూడటం మొదలెట్టడంతో యాడ్స్ బాగా పెరిగిపోయాయి. 3239 కోట్లు యాడ్స్ ద్వారా రావటంతో అందరూ ఆశ్చర్యపోయారు. హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్స్, యాడ్స్ కలిపి వచ్చిన ఎమౌంట్ కన్నా ఇది పెద్ద మొత్తం. జియో సినిమా బిజినెస్ స్ట్రాటజీ అప్పుడు అందరికీ అర్దమైంది. అయితే ఇది సస్టైన్ అయ్యే మోడలేనా...అనేది వేచి చూడాల్సిన అంశం అంటోంది ట్రేడ్.

ఇక ఇండియన్ ప్రీమియల్ లీక్ (IPL) 2024 ప్రారంభమైన క్రమంలో జియో సినిమా యాప్‌కు ఒక్కసారిగా తాకిడి పెరిగింది. డిజిటల్ ప్రపంచంలో జియో సినిమా దూసుకెళ్తోంది. ఐపీఎల్ ఆరంభంలోనే జియో సినిమా యాప్ రికార్డ్ స్థాయిలో ప్రేక్షకులను సొంతం చేసుకుంది. అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టర్న్‌గా ఉన్న జియో సినిమాకు తాకిడి పెరిగింది. కోట్లాది మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.దీంతో ఒక్కరోజే ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా రికార్డులు సృష్టించింది. లాస్ట్ ఇయిర్ ...మొత్తంగా 10 కోట్ల న్యూ వీవర్స్, 5 కోట్ల న్యూ యాప్ డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ఒక్కో ప్రేక్షకుడు మ్యాచ్ సమయంలో ఈ యాప్‌లో సగటున 57 నిమిషాల పాటు వీక్షిస్తున్నాడని అంచనా.


Read More
Next Story