కిరణ్ అబ్బవరం `K- ర్యాంప్ ` మూవీ రివ్యూ
x

కిరణ్ అబ్బవరం `K- ర్యాంప్ ` మూవీ రివ్యూ

ఫన్ రైడ్‌నా? లేక ఫుల్ క్రింజ్ ఫెస్ట్‌నా?

రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుమార్‌ (కిరణ్ అబ్బవరం)కి కష్టపడటం ఓ క్రైమ్, తాగడం ఓ హాబీ! తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో, తండ్రి (సాయికుమార్) ప్రేమను “స్వేచ్ఛ”గా ఇస్తాడు… అదే స్వేచ్ఛ, కుమార్ జీవితంలో “అనర్థం”గా మారుతుంది. డే అండ్ నైట్ — పార్టీలు, ఫ్రెండ్స్, బాటిల్స్ — ఇదే అతని రొటీన్.

కానీ ఓ రోజు ఆ తండ్రి గ్రహిస్తాడు — “ఇలా కొనసాగితే ఈ బాబు మనిషి కాకుండా మిగతా అన్నీ అవుతాడు!” అని. దాంతో ప్లేస్ మారిస్తే సెట్ అవుతాడని కుమార్‌ని కేరళకు పంపేస్తాడు… అక్కడ ఓ ఇంజినీరింగ్ కాలేజీ – కొత్త లైఫ్, కొత్త లెసన్.

కానీ పాత అలవాట్లు మారవు. అక్కడ కూడా అదే అవారాపనులు, అదే తాగుడు రాత్రులు… ఒక రోజు రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన కుమార్‌ని ఓ అమ్మాయి కాపాడుతుంది — జెస్సీ (యుక్తి తరేజా). ఆ క్షణమే అతని హార్ట్ “రీస్టార్ట్” అవుతుంది. ఆమె వెనక పడి ప్రపోజ్ చేస్తాడు. కానీ… ఆ ప్రేమలో ఒక సైలెంట్ బాంబ్ దాగి ఉంది!

జెస్సీకి చిన్నప్పటినుంచి Post-Traumatic Stress Disorder (PTSD) —ఎవరైనా ప్రామిస్ చేసి నిలబెట్టుకోకపోతే, ఆమె మైండ్ బ్రేక్ అవుతుంది, ప్రపంచం బ్లాక్ అవుతుంది. ఒక చిన్న తప్పు, ఒక మిస్ అయిన క్షణం…జెస్సీ తన ప్రాణమే వదులుకునే స్థితికి చేరుతుంది.

ఇక్కడినుంచి సినిమా టోటల్ షిఫ్ట్ అవుతుంది — లవ్‌స్టోరీ నుంచి సైకలాజికల్ డ్రామా కి, అందులోంచి పుట్టే ఫన్ కు! అలాంటి జెస్సీతో ఇలాంటి తాగుబోతు హీరో ఎలా వేగాడు, ఎలా తట్టుకున్నాడనేది ఫన్... చివరకు కుమార్ ప్రేమ కథ ఏ తీరం చేరింది. జెస్సీ కి తానే ట్రిగ్గర్ అవుతాడా?

తన తండ్రి గురించి అతను తెలుసుకున్న షాకింగ్ ట్రూత్ ఏంటి? నరేష్ ఈ కథలో ఎక్కడ లింక్ అవుతాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కిరణ్ అబ్బవరం కథలో కూడా “కుమార్ అబ్బవరం”గానే కనిపిస్తాడు — అంటే, పాత్ర పేరు కూడా అదే, వ్యక్తిత్వం కూడా అదే. ఇది deliberate choice – ఒక self-referential, meta idea. కానీ దీన్ని వాడిన తీరు మాత్రం నారేటివ్ మెకానికల్గా ఉంది. పాత్రను మానవ రూపంలో కాకుండా “కిరణ్ ఫిల్మ్ బ్రాండ్ ఎక్స్టెన్షన్”గా చూపించడం సినిమాకు రియలిజం తగ్గించి, రిపిటేషన్ పెంచింది.

దాంతో ఫస్టాఫ్ మొత్తం “కిరణ్ అబ్బవరం సినిమా ట్రోప్ బుక్”ని కాపీ చేసినట్టుంది — రిచ్ అండ్ రెబెల్ హీరో, డ్రింకింగ్ హ్యాబిట్, కాలేజీ ఫ్రెండ్స్, క్యాంపస్ లవ్... ఇదే స్ట్రక్చర్ మూడోసారి, నాలుగోసారి కూడా వాడటం వల్ల ఇప్పుడు ఇది pattern fatigueగా మారింది. దానికి తోడు కామెడీ చాలా భాగం అవుట్ డేటెడ్, సీన్స్ లో కిక్ లేదు. జోకులు 2010ల కాలం టీవీ కామెడీ లా అనిపిస్తాయి. కథలోని సబ్‌టెక్స్ట్ ఎక్కడా లేదు.ఇది స్క్రీన్‌రైటింగ్‌లోని పెద్ద లోపం:

ఇంటరెస్టింగ్‌గా, సినిమాలో హీరో తానే ఒకసారి చెబుతాడు — “ఇంత క్రింజ్ కథ వినటం ఇదే మొదటిసారి!”

జైన్స్ నాని రాసి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెగ్యులర్ కిరణ్ అబ్బవరం స్టైల్‌లోనే మొదలవుతుంది. ‘బార్‌లో బాటిల్, కాంపస్‌లో లవ్’ — ఇదే హీరో ఇంట్రడక్షన్ ఫార్ములా. కుమార్ అనే కేర్‌ఫ్రీ కుర్రాడు, చదువుకంటే చియర్స్‌కి ఎక్కువ టైం కేటాయించే వ్యక్తి అనేది చెప్పే సీన్స్ తో సినిమా మొదలవుతుంది. దాంతో మొదటి నుంచే “మనం ఏమీ కొత్త సినిమా చూడబోవటం లేదు” అనే ఫీలింగ్‌నే ఇస్తాయి.

ఆ తర్వాత వచ్చే క్యాంపస్ సన్నివేశాలు సాఫ్ట్ హ్యూమర్‌తో మొదలవుతాయి కానీ, ఆ కామెడీకి స్పార్క్ లేదు. డైలాగ్ టెంపో సెట్ అయినా, సిట్యుయేషన్స్ రిపిటేటివ్‌. హీరో-ఫాదర్ రిలేషన్‌షిప్ మీద రాసిన సన్నివేశాలు కొంచెం ఎమోషన్ ఇవ్వాలని ప్రయత్నిస్తాయి కానీ అవి కూడా స్క్రీన్‌ప్లేలో పాయింట్ లేకుండా తేలిపోతాయి.

కేరళ బ్యాక్‌డ్రాప్ ఈ కథకు స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుందని ఆశపడతాం. కానీ, డైరెక్టర్ దాన్ని కేవలం పోస్టర్ బ్యాక్‌డ్రాప్ గా వాడేశాడు. లోకల్ కలర్ లేదు, సంస్కృతి లేదు, విజువల్ డిస్టింక్షన్ లేదు. ఎక్కడ చూసినా — మనకు తెలిసిన తెలుగు కాలేజీ సెటప్, తెలుగు డైలాగ్ ఎనర్జీ, తెలుగు ఫ్రేమింగ్. కేరళ సెట్ అనిపించేది కేవలం జెస్సీ క్యారెక్టర్ లో మాత్రమే. అలా ఫస్ట్ హాఫ్‌లో సరదా ఉన్నా, సబ్‌స్టెన్స్ లేదు.

ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథ కొంచెం రైజ్ అవుతుంది. హీరోయిన్ PTSD ఎఫెక్ట్‌తో వచ్చే కామెడీ సీక్వెన్స్ తర్వాత 30 నిమిషాల వరకు బాగానే వర్కౌట్ అవుతుంది —అక్కడే సినిమా ఓ క్షణం బతుకుతుంది. కానీ ఆ పాయింట్ తర్వాత కథ డ్రాప్ అవటం మొదలవుతుంది.

సైకాలజికల్ థీమ్‌ని వాడి ఫన్ చేయాలనుకున్నా, అది ఫన్ కన్నా ఫేక్ గా అనిపిస్తుంది. హీరోయిన్ సైడ్ స్టోరీలో ఉన్న మానసిక బాధను

కేవలం కామెడీ పాయింట్గా చూపించడం వలన సినిమాకు ఎమోషనల్ గ్రౌండ్ కోల్పోయింది. “Trauma cannot be treated as a twist; it must be explored as truth.”

ప్రేమ సీన్లు కూడా “స్టేజ్‌డ్”గా కనిపిస్తాయి — ఆర్గానిక్ కనెక్ట్ లేకుండా ఫ్రేమ్‌లోకి దింపినట్టుగా ఫీలవుతాయి. అలాగే హీరో పాత్ర బయట చర్యలో బిజీగా ఉంటుంది కానీ లోపలి పయనం ఎక్కడా జరగదు.స్క్రీన్‌రైటింగ్ భాషలో దీన్ని Character Arc Collapse అంటారు. అదీ సంగతి.

ఎవరెలా చేసారు..

కిరణ్ అబ్బవరం నటనలో ఓ ప్రత్యేకమైన మిశ్రమం ఉంటుంది — “ఓవర్‌ఎనర్జీ + ఆత్మవిశ్వాసం”. ఈ సినిమా కూడా ఆ ఫార్ములాకే ఉదాహరణ.యుక్తీ తరేజా (మెర్సీ జాయ్ పాత్రలో) — ఫ్రెష్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది. నరేష్ – వయసున్న నటుడికి ఇంత “ఫ్లర్టీ” ట్రాక్ ఇవ్వడం డైరెక్టర్ రిస్క్, కానీ ఫలితం మాత్రం mixed. కామెడీ పేరుతో వచ్చిన కొన్ని సన్నివేశాలు బ్యాడ్ టేస్ట్ వైపు ఒరిగాయి.

టెక్నికల్ గా ..

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ – ఓకే-ఓకే స్థాయిలోనే ఉంది. “కలలే…” సాంగ్ మాత్రం ఫీల్ ఇచ్చే సింగిల్‌గా నిలుస్తుంది. సినిమాలో ఎమోషనల్ లింక్‌ని మ్యూజికల్‌గా కొనసాగించే అరుదైన మోమెంట్ ఇదే.

సినిమాటోగ్రఫీ – క్లాస్ లెవెల్‌లో. కేరళ లొకేషన్లను హై-సాచ్యురేషన్ షాట్లలో చూపించి విజువల్ ఫ్రెష్‌నెస్ తెచ్చారు. క్యాంపస్ సెట్‌లు, సాంగ్ పిక్చరైజేషన్, లైటింగ్ టోన్ — అన్నీ క్లీనుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్‌ను కట్ చేసి ఉంటే.. ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి .

ఫైనల్ థాట్

“K-Ramp” ఒక లైట్‌హార్ట్ కామెడీ అవ్వాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆ హార్ట్ ఎక్కడో మిస్ అయింది. ఫన్ సీన్స్ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఎమోషన్ కనెక్ట్ కాలేదు. ఓవరాల్ గా సినిమాలో ఎంజాయ్ చేయగలిగే సీన్లు ఉన్నాయి — కానీ గుర్తుండిపోయే మోమెంట్స్ లేవు.

Read More
Next Story