కాజల్ ‘కార్తీక’ఓటిటి మినీ రివ్యూ
x
Source: Twitter

కాజల్ ‘కార్తీక’ఓటిటి మినీ రివ్యూ

పుస్తకంలో చదివే పాత్రలే దయ్యాలుగా మారితే ఎలా ఉంటుంది. ఇదే ఐడియాతో వచ్చిందే కాజల్, రెజీనా కలిసి నటించిన ‘కార్తీక’ మూవీ. ఈ సినిమా ఎలా ఉందంటే..


మనం పుస్తకం చదువుతున్నాం..అందులో పాత్రలు నిజ జీవితంలోకి వస్తే...ఇలాంటి కాన్సెప్టులు గతంలో మనం చాలా చూసేశాం. అయితే ఇప్పుడు దాన్నే ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి.. పుస్తకంలో చదివే పాత్రలే దెయ్యాలుగా మారి జీవితంలోకి వస్తే అనే స్టోరీ ఐడియాతో ఈ సినిమా చేశారు. అయితే సాధారణంగా స్టోరీ ఐడియాగా హై ఇచ్చే చాలా ఆలోచనలు.. విస్తవరణలో విరక్తి పుట్టించేలా తయారవుతాయి. మరి ఈ స్టోరీ ఐడియా ...కథ గా ఏ మేరకు విస్తరణ జరిగింది... అదీ నచ్చేలా రెడీ అయ్యిందా అనేది చూద్దాం.

పుస్తకాలు ఎక్కువగా చదివే ఉమ (రెజీనా) తన ఫ్రెండ్ వాళ్ల బ్రదర్ పాతకాలం నాటి లైబ్రరీ నిర్వహిస్తున్నాడని తెలుసుకుంటుంది. ఓ రోజు ఆసక్తిగా అక్కడకి వెళ్లి పుస్తకాలు తిరగేస్తుంటే... అక్కడ ఆమెకి 'కాటుక బొట్టు' అనే ఒక వందేళ్ల క్రితం నాటి పుస్తకం కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో దానిని చదవడం మొదలుపెడుతుంది. అయితే ఆ పుస్తకంలో కంటెంట్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. దాదాపు వందేళ్ల క్రితం నాటి ఆ పుస్తకంలో ఇప్పటి లాక్ డౌన్ తో సహా, చాలా లేటెస్ట్ విషయాలు కూడా ఉండటంతో షాక్ అవుతుంది.


దాంతో ఉమ మరింత ఇంట్రస్ట్‌గా ఆ పుస్తకంలోని ఒక్కో కథను చదువుతూ వెళ్తుంది. అయితే ఆశ్చర్యంగా ఆ కథల్లోని పాత్రలు తన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఆ పుస్తకంలోని 5వ కథలోకి వస్తుంది. ఆ కథ కార్తీక (కాజల్) పాత్రగా చుట్టూ తిరుగుతుంది. ఆమె కొన్ని పరిస్థితుల వలన పగ తీర్చుకోవాలని దెయ్యంగా మారుతుంది. అయితే కార్తీక ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది?అలాగే రెజీనాకు, కాజల్ తో సంబంధమేంటి...కార్తీక కథకు ముగింపు ఏమిటి? ఆ పుస్తకం చదివిన ఉమకి ఏం అర్థమవుతుంది? ఆ బుక్ రాసినవారెవరో ఆమె తెలుసుకోగలుగుతుందా? ఆ పుస్తకానికి .. ఉమకి ఉన్న సంబంధం ఏమిటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కాజల్, రెజీనా కలిసి నటించటంతో ఉన్నంతలో కాస్త ఇంట్రస్ట్ ఏర్పడింది. అయితే సినిమాలో అంత సీన్ లేదనే చెప్పాలి. కామెడీ అని మొదలెట్టిన సీన్స్ ఏవి పెద్దగా వర్కవుట్ కాలేదు. హారర్ కూడా అంతంత మాత్రమే. చివర్లో ఏలియన్స్ కూడా వస్తాయంటే దర్శక, నిర్మాతలు ఎంత లైట్ తీసుకున్నారో అనిపిస్తుంది. ఐడియా వరకూ బాగున్నా మిగతాది వర్కవుట్ అయ్యే రీతిలో రాయలేదు..తీయలేదు. రెండు .. మూడు .. నాలుగు ఎపిసోడ్స్ అసలు బాగోలేదు. ఉన్నంతలో కాజల్ ఎపిసోడ్ మాత్రమే బాగుంది.

ఇక ఈ చిత్రం కరుంగా పియం అనే తమిళ చిత్రానికి డబ్బింగ్ వెర్షన్. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది మే 19న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత కాజల్ కార్తీక పేరుతో తెలుగులోనూ రిలీజై జస్ట్ ఓకే మూవీగా నిలిచింది. కాజల్ అగర్వాల్ మొదటిసారిగా ఓ హార్రర్ సినిమాలో నటించడం ఈ మూవీ ప్రత్యేకతగా ప్రచారం చేశారు. అలాగే 5 వేర్వేరు కథలను ముడిపెట్టి అంత్రోపాలజీగా ఈ సినిమాను తెరకెక్కించడం విశేషంగా చెప్పుకున్నారు.

కాగా ఒరిజినల్ వెర్షన్ కరుంగా పియం ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడిదే హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ఆహాలోకి వచ్చేసింది. ఉగాది కానుకగా మంగళవారం (ఏప్రిల్ 09) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చేదుగానే ఉంది.

చూడచ్చా

కాజల్ కి లేదా రెజీనాకు వీరాభిమాని అయితే ఓ లుక్కేయండి..అంతకు మించి ఆశించకండి

ఏ ఓటిటిలో

అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగులో )

Read More
Next Story