చుక్కల లోకం నుంచి రాజకీయల్లోకి కూలిపడ్డ తార
x

చుక్కల లోకం నుంచి రాజకీయల్లోకి కూలిపడ్డ తార

రాజ్యసభ సీటుకోసం నీతి సర్వాన్ని కమల్ హాసన్ వదిలేసుకున్నడా?


రామ్. సి


"ఇప్పుడు కాదు అంటే ఇంకెప్పుడు? మనమే కాకపోతే మరెవరు?" అంటూ కమల్ హాసన్ Makkal Needi Maiam (MNM) అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రతి సినీ తరాలనే ఊకదంపుడు ఉపన్యాసాలు దంచి కొడుతూ, చేతిలోని టార్చ్ లైట్ ను వేసి దారి చూపుతామని చెబుతూ, తాను తమిళనాడు రాజకీయాల్లో భిన్నత, ప్రజాహిత , సమగ్రత చూపించాలనుకున్నాను అంటూ ప్రగల్భాలు పలికి. ఇప్పుడు ప్రజల కోసం ఒక స్వచ్ఛమైన రాజకీయాన్ని తీసుకురావాలన్న ఆశయం ఉన్న వాడ్ని అంటూ ప్రచార హోరు రేపి, ఇప్పుడు తన ప్రయాణాన్ని ఓటింగ్ విజయంతో కాకుండా, డీఎంకే కుదిరిన ఎన్నికల సమీకరణలో భాగంగా రాజ్యసభ సీటుతో పై చెప్పిన వాగ్దానాలన్నీ ముగించుకున్నారు.

ఇది నిజమైన మార్పు కాదు, ఇది స్పష్టమైన రాజీనే. "ప్రజలే నా హైకమాండ్" అని గర్వంగా ప్రకటించిన కమల్, ఇప్పుడు తానే విమర్శించిన వ్యవస్థలో భాగస్వామిగా మారిపోవాదం కన్నా విడ్డురం ఏముంటుంది. వెండితెరపై కమల్ హాసన్ ఎన్నో ప్రయత్నాలు, ఘనమైన విజయాలు సాధించారు. అయితే రాజకీయంగా మాత్రం ఆయన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించలేకపోయారు.ఒక్క మాటలో చెప్పాలంటే"బాక్సాఫీస్ సూపర్‌స్టారే, కానీ, ఓటింగ్ బూత్‌లో పేలవ స్టార్".

రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశానికి పెద్ద హంగామా చేసి, బరిలోకి దిగాక ముందే ఆ ప్రయత్నానాన్ని ముందే నిలిపేసి, తనయూ ఎదో రూపంలో రక్షించుకొన్నారు. కానీ, కమల్ మాత్రం అందుకు భిన్నంగా పూర్తిగా రాజకీయ ప్రవేశం చేశారు, అనేక ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ప్రజల మద్దతు రాకపోవడంతో, చివరకు అధికార పార్టీలతో ఒప్పందం చేసుకొని రాజ్యసభ సీటు తీసుకున్నారు. "నేను రాజకీయాల్లో నటించడానికి కాదు, మార్పు తేవడానికి వచ్చాను" అని ప్రకటించిన కమల్ హాసన్, ఇప్పుడు పూర్తిగా తన మాటలకే వ్యతిరేకంగా నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

George Orwell Animal Farmలో చెప్పినట్లే, 'మొదట విప్లవం ఆశయాలతో మొదలవుతుంది, కానీ చివరికి ఆ ఆశయాలకు తానే దూరమవుతూ ఉంటుంది. అందులోని చివరిలో PIGs మానవుల్లా రెండు కాళ్ళ మీద నడుచుకొంటూ వెళ్లినట్టు, MNM కూడా తన ఆదిలో నిర్దేశించిన లక్ష్యాలను విడిచి, పాత రాజకీయ తరహాలోనే కలిసిపోయింది.కొట్టుకు పోయింది.

కమల్ హాసన్ కూడా గంభీరంగా మొదలుపెట్టి, సరైన మద్దతు లేక ప్రజల విశ్వాసం కూడబెట్టలేక పోవడంతో చివరకు తన ఆశయాలను వదిలి, పరాయి పార్టీ చేతిలో మిగిలిపోయారు. ఈ ప్రయాణం మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది, ప్రఖ్యాతిగా ఉన్నంత మాత్రాన ప్రజల మద్దతు లభించదు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలంటే నిబద్ధత, నేలమీద పనితనం,ప్రజా పోరాటాలు, గళం విప్పడం, ఏంటో కొంత నిజాయితీ కావాలి. లేకపోతే, ఎంత గొప్పగా మొదలైన ఉద్యమం అయినా చివరికి ఒక దురదృష్టకరమైన రాజీగానే ముగుస్తుంది.

చివరగా, నాకు తోచేదేంటంటే, "ఒకప్పుడు తన సినిమాలకి టికెట్లు అమ్మిన కమల్, ఇప్పుడు తన విలువల్ని అమ్ముకుని రాజ్యసభ సీటు పొందారు. ఆయనపై నమ్మకంతో నిలబడ్డ అభిమానుల విశ్వాసాన్ని, చివరికి ఒక పెద్దల సభ పదవితో మార్చేసుకున్నారు."చరిత్ర ఆయనను ఎలా గుర్తుంచుకుంటుంది అని నన్నడిగితే " తాను చెప్పిన కథను తుంగలో తొక్కి, తారత్వాన్ని కోల్పోయిన నటుడు."


Read More
Next Story