‘థగ్ లైఫ్’ కర్ణాటక రిలీజ్ రద్దు
x

‘థగ్ లైఫ్’ కర్ణాటక రిలీజ్ రద్దు

నిజమైన నష్టం ఎవరికి? కమల్ కి కాదా?

కన్నడ.. తమిళ్‌ నుంచి పుట్టిందంటూ కొన్ని రోజుల క్రితం జరిగిన ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో కమల్‌ కామెంట్స్‌ చేసారు. అవి కన్నడనాట మాత్రమే కాకుండా అంతటా చర్చనీయాంశమయ్యియి. వివాదం పెద్దదైంది. చిరిగి చేటంత అయ్యింది. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలను అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉందని కమల్‌ హాసన్‌ (Kamal Haasan) అన్నారు. తమది (తమిళ్‌, కన్నడ ప్రజలు) ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషను తక్కువ చేయడం కాదని పేర్కొన్నారు.

అయితే అధికార, విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (KFCC) ఈ విషయమై తీవ్రంగా స్పందించాయి. ఈ క్రమంలోనే.. కమల్‌ నటించిన ‘థగ్‌ లైఫ్‌’ని కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ కేఫ్‌సీసీ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన హైకోర్టు కమల్‌ హాసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని’ వ్యాఖ్యానించింది.

అయితే తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ ‘కేఎఫ్‌సీసీ’కి కమల్‌ లేఖ రాశారు. అయితే, అందులోనూ సారీ చెప్పకపోవడం గమనార్హం. వాదోపవాదాల తర్వాత ‘‘కమల్‌ తాను చెప్పాలనుకుంది చెప్పారు. పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంటే కర్ణాటకలో తన సినిమాని విడుదల చేయరు’’ అని కమల్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అలా ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్‌హాసన్‌ (Kamal Haasan) నిర్ణయించారు. ఈ విషయాన్ని కమల్‌ తరఫు న్యాయవాది కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. ఈ నేపధ్యంలో సినిమా విడుదల చేయకపోవటం వలన ఎవరికి, ఏ మేరకు నష్టం అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చగా మారింది.

ఈ నేపధ్యంలో కమల్ హాసన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతటా చర్చనీయాంశమవుతోంది. 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా ఉంచాలనే నిర్ణయం వల్ల కోట్ల రూపాయల నష్టం. కమల్ వ్యక్తిగతంగా నష్టాన్ని మోయడానికి సిద్ధమయ్యారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే...

నిజమైన నష్టం ఎవరిది?

బయటకి చూస్తే నష్టం కమల్ హాసన్‌దే అనిపిస్తుంది. కోట్ల రూపాయల బిజినెస్‌ ను వదులుకుంటున్నారు. కానీ లోతుగా చూస్తే… కమల్ కన్నా ఎక్కువ నష్టపోయేది కన్నడ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటున్నారు.

ఇప్పటికే కన్నడ పరిశ్రమలో బిజినెస్ స్లంప్ లో ఉంది. గత కొద్దికాలంగా పెద్ద సినిమాలు మార్కెట్లో లేకపోవటం, రిలీజైన సినిమాలు ఆడకపోవటంతో కమర్షియల్ గా నష్టాలు చూస్తున్న కర్ణాటక ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొద్దోగొప్పో 'థగ్ లైఫ్' పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ రద్దు ఊహించని పెద్ద దెబ్బే. గోరు చుట్టు మీద రోకలిపోటు లాంటిదే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

“A missed blockbuster is more dangerous than a flop. Because a flop at least runs for a few days, but a missed hit never lets you open your doors.”

– అనిల్ థామస్, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ అనలిస్ట్

ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీలో సత్తా చూపిన పెద్ద హిట్స్ లేకపోవటంతో థియేటర్లు ఇప్పటికే ఖాళీగా ఉంటున్నాయి. పెద్ద హైప్ ఉన్న సినిమా వస్తే, అది ఓ "ఆక్సిజన్ మాస్క్" లాంటిది. అలాంటి సమయంలో , థగ్ లైఫ్‌ లాంటి సినిమాను మిస్ కావడం అనేది నేరుగా వారిపైనే ప్రభావం చూపుతుందనటంలో సందేహం లేదు.

బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఏంటంటే:

థగ్ లైఫ్ మల్టీ లాంగ్వేజ్ రిలీజ్: అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇది కనీసం 100 కోట్లు తొలివారం వసూలు చేసే స్థాయి పాన్-ఇండియా మూవీ అని అంచనా.

కర్ణాటక మార్కెట్ వాటా: సాధారణంగా పాన్-ఇండియా సినిమాల్లో కర్ణాటక మార్కెట్ 10% వసూళ్లను ఇస్తుంది. అంటే 10–15 కోట్లు డైరక్ట్ గా నష్టమే. హిట్ అయ్యితే ఇంకా ఎక్కువ నష్టం క్రింద లెక్కేయాలి.

థియేటర్ ఎకనామిక్స్ దెబ్బతిన్నట్లే: ఇక పాప్‌కార్న్, పార్కింగ్ వంటవి ఇలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ తోనే పుంజుకుంటాయి. వాటిని కోల్పోవడం వల్ల థియేటర్లు రొటేషన్ ఇబ్బందుల్లో పడుతుంది. ఇది లాంగ్ రన్ లో వచ్చే నష్టాలను ప్రారంభ సూచిక లాంటిది.

కమల్ హాసన్ ఇలా రిలీజ్ ఆపటం అనే ఈ నిర్ణయంతో తన నమ్మకాల్ని,ఆలోచనలను ఆర్ధికంగా విలువైన సినిమాకంటే పై మెట్టులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం సినిమా బిజినెస్ కు వచ్చిన ఇబ్బంది మాత్రమే కాదు. తమిళనాడు–కర్ణాటక మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాలపై ప్రభావం చూపే సంఘటన కూడా అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

ఏదైమైనా ఒక సినిమాను ఆపితే ఓ కథ ఆగిపోతుంది. కానీ విలువల్ని నిలబెడితే చరిత్ర మొదలవుతుంది.

ఇది కేవలం ఓ సినిమా రిలీజ్ రద్దు విషయం కాదు. ఇది ఒక వ్యక్తి విలువలు ఒక వాణిజ్య యుగంలో ఎలా నిలబడతాయో చూపించే ఉదాహరణ. ఈ సంఘటనను మనదైన కోణంలో చూసినపుడు అది ఒక నైతిక పరీక్ష లా కూడా కనపడుతుంది.

కమల్‌ హాసన్‌, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

Read More
Next Story