కమల్, నువ్వు ఎందుకింత గొప్పోడివో అర్దమైంది, ఈ పని ఏ స్టార్ చెయ్యలేడు
x

కమల్, నువ్వు ఎందుకింత గొప్పోడివో అర్దమైంది, ఈ పని ఏ స్టార్ చెయ్యలేడు

మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో... అబ్బా కమల్ హాసన్ అంటాడు అభినవ గోమఠం అనే తెలుగు కమిడయన్ ఓ సినిమాలో. అంటే అన్ని షేడ్స్ చూపించేవాడు...ఖచ్చితంగా కమల్ హాసన్ స్దాయి అయ్యింటాడు అని అక్కడ కవి భావం.


మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో... అబ్బా కమల్ హాసన్ అంటాడు అభినవ గోమఠం అనే తెలుగు కమిడయన్ ఓ సినిమాలో. అంటే అన్ని షేడ్స్ చూపించేవాడు...ఖచ్చితంగా కమల్ హాసన్ స్దాయి అయ్యింటాడు అని అక్కడ కవి భావం. నిజమే కదా. కమల్ హాసన్ ని కొట్టే నటుడు మనకు కనపడరు. నటుడుగా, దర్శకుడుగా, కథకుడుగా, డాన్స్ డైరక్టర్ గా ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ క్రాఫ్ట్ ని ఆకళింపు చేసుకుని తెరపై పండించి అద్బుతాలు సృష్టించటం కమల్ కు ఆనవాయితీ. ఆ అద్బుతాల వెనక సీక్రెట్..వయస్సుతో సంబంధం లేకుండా కష్టపడటం... నిత్యం తనను తాను అప్డేట్ చేసుకోవటం.

లేకపోతే ఈ వయస్సులో కమల్ సినిమాలు చేసుకుంటూ హ్యాపిగా బ్రతికేయచ్చు. ఉన్న కీర్తి చాలు, ఆఫర్స్ ,డబ్బు లెక్క లేదు. కానీ కమల్ వంటి కళాకారుడుకి అవేమీ సంతృప్తి ఇవ్వరు. ఇంకేదో కావాలి. ఎవరెస్ట్ ని ఎక్కాక కూడా అంతకు మించినది ఏదైనా ఉందా అని చూస్తూంటాడు ఆయన. అలాగే ఎవరెస్ట్ ఎక్కాక ఇక దిగటం తప్ప వేరే దారి లేదు అనుకోడు. అలా అక్కడికి దాకా వెళ్లి జారిపడిన వాళ్లు చాలా మంది ఉన్నా..కమల్ మాత్రం అక్కడ కంటిన్యూగా నిలబడటానికి అవసరమైన సాధన..వనరలు సమకూర్చుకుంటాడు. ప్రస్తుతం అదే పని మీద ఉన్నాడు ఆయన.

రెండు సినిమాలు హిట్ పడగానే హీరోలు ఎలా మారిపోతారో , ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలుసు. తమకు తెలుసున్నదే నటన అని, సీన్ చెప్తే చాలని, తమదైన శైలిలో చేసుకుంటూ పోతామని అంటూంటారు. అంతేకానీ కథలో క్యారక్టర్ తగ్గట్లుగా కనిపించటానికి ఇష్టపడరు. ఏ సినిమాలో చూసినా ఒకటే గెటప్, లుక్, నటన. అలాగే తమ చుట్టూ కథ తిరగాలని కోరుకుంటారు. వాళ్లు స్టార్స్ కావచ్చు ఏమో కానీ ఆర్టిస్ట్ లు కాలేరు.

నట దిగ్గజం కమల్ హాసన్ కు ఎన్ని ఏళ్ల అనుభవం ఉన్నా తనను తాను నిరూపించుకునేందుకు ప్రతి రోజూ ప్రయత్నిస్తారని ఆయనతో పనిచేసిన నటులు, దర్శకులు ఎప్పుడూ చెప్పేమాట. కమల్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు నిత్యం పాఠాలు నేర్చుకుంటారనేది నిజం. నిజానికి ఆయన అద్భుతమైన నటుడు. నటనలో నిరూపించుకునేందుకు ఏమీ లేకపోయినా, ఆయన నిత్య విద్యార్థిగా ఉండటం స్పూర్తినిచ్చేదాను ఆసక్తిగానూ ఉంటుంది. అదే ఆయన సీక్రెట్ కూడా.

రీసెంట్ గా ఆయన కల్కిలో తనేంటో మరోసారి ప్రపంచానికి చూపించాడు. సినిమాలో కనపడేది మూడు నాలుగు సీన్లే అయినా గుర్తుండిపోయారు. ఆయన గెటప్, లుక్ మెస్మరైజ్ చేసేసాయి. సుప్రీమ్ యాస్కిన్ గా వైవిధ్యంగా కనిపించి మతిపోగొట్టారు. సెకండ్ పార్ట్ లో ఆయన విశ్వరూపం కనపించనుంది. అందుకోసం దాదాపు నలభై రోజులు డేట్స్ అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కమల్ దృష్టి అంతా మరొక దానిపై ఉంది. అది AI. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న AI గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు.

AI నేర్చుకోవటం కోసం కమల్ హాసన్ 90 రోజుల కోర్స్ కు హాజరు కానున్నారు. అందుకోసం ఆయన USA వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, దాని వివిధ రకాల ఉపయోగాలు, సినిమాలకు ఏ మేరకు అది పనికొస్తుంది వంటి విషయాలను అధ్యయనం చేయనున్నారు. అందుకోసం ఆయన తన విలువైన సమయాన్ని, డేట్స్ ని వినియోగిస్తున్నారు. ఆ 90 రోజుల్లో ఆయన కోట్లు సంపాదిస్తారు. కానీ అంతకు మించిన విలువైన నాలెడ్జ్ ని కమల్ సంపాదించాలని నిర్ణయించుకుని బయిలు దేరుతున్నారు.

బాల్య నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. కళాకారుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, మాటల రచయితగా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తిన లోకనాయకుడు.. కమల్ హాసన్‌కు ఇవేమీ కొత్తేమీ కాదు. నేర్చుకోవటం అనే పక్రియే ఆయన్ను ఈ స్దాయికి తెచ్చింది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ కూడాను.

ఉలగనాయగన్ కెరీర్ విషయానికి వస్తే కల్కిగా ఓ పాత్ర లో కనిపించి సూపర్ హిట్ ఇచ్చిన నెలలోపలే...భారతీయుడు 2 తో డిజాస్టర్ ఇచ్చారు. ప్రస్తుతం కమల్ హాసన్ 234వ సినిమాగా తెరకెక్కుతున్న థగ్ లైఫ్ తమిళ సినిమా పరిశ్రమకే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న భారీ ప్రాజెక్ట్. ప్రధానంగా నాయకుడు వంటి క్లాసిక్ తరువాత ఇన్నేళ్లకి మళ్ళీ మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి 2 చిత్రం కూడా కమల్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే సినిమా. ఇక AI నేర్చుకువచ్చిన కమల్ ఆ నాలెడ్ద్ తో ఏ అద్బుతాలు చెయ్యబోతున్నారో అని అభిమానులు ఎదురుచూస్తూంటారు

Read More
Next Story