రేప్‌లు, మర్డర్లు జరిగినా ఇలాగే ఉంటారా?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి గెలుపొందిన ప్రముఖ నటి కంగన రనౌత్‌పై విమానాశ్రయంలో దాడి చేసిందెవరు? రనౌత్ చెంపమీద కొట్టడానికి కారణమేంటి? కంగనా ఎలా స్పందించారు?
ప్రముఖ నటి కంగన రనౌత్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలంతా న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశానికి హాజరుకావాల్సి ఉండడంతో కంగనా రనౌత్ చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బోర్డింగు పాయింట్‌కు వెళ్తుండగా..విధులు నిర్వహిస్తున్నఓ సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనాపై చేయిచేసుకున్నారు. ఆమె చెంపపై కొట్టారు. వెంటనే అప్రమత్తయిన ఎయిర్ పోర్టు పోలీసులు దాడి చేసిన మహిళా కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కంగనాపై దాడిచేసిన కుల్విందర్ కౌర్‌పై కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
కంగనాపై దాడిని కొందరు సమర్థించారు. వారినుద్దేశించి కంగనా రనౌత్ ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇక అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకేం ఫర్వాలేదా?’ అంటూ కానిస్టేబుల్‌కు సపోర్టు చేస్తున్నవారిని ఉద్దేశించి పోస్టు చేశారు.
‘‘రేపిస్టు, హంతకుడు, దొంగ..ఇలా నేరం చేసినవారు భావోద్వేగ, మానసిక, ఆర్థికపర కారణాలు చెబుతుంటారు. కారణం లేకుండా ఏ నేరం జరగదు. నేరానికి వారిని దోషిగా తేల్చి శిక్ష విధిస్తారు. అలా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడ్డ వారి భావోద్వేగాలకు విలువ ఇస్తే.. అనుమతి లేకుండా ఓ వ్యక్తి శరీరాన్ని తాకడం, వారిపై దాడి చేయడం లాంటి ఘటనలను మీరు సమర్థిస్తే.. అత్యాచారాలు, హత్యల వంటివి జరిగినా మీకేం ఫర్వాలేదనే అర్థం. మీలాంటివారు మీ మానసిక స్థితిపై దృష్టిపెట్టాలి. యోగా, ధ్యానం చేయండి. లేకపోతే జీవితం చేదు అనుభవంగా మారుతుంది. పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. వాటినుంచి ఇకనైనా విముక్తి పొందండి’’ అని కంగనా లేఖలో రాసుకొచ్చారు.
Every rapist, murderer or thief always have a strong emotional, physical, psychological or financial reason to commit a crime, no crime ever happens without a reason, yet they are convicted and sentenced to jail.
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 8, 2024
If you are aligned with the criminals strong emotional impulse to…
దాడికి కారణమేంటి?
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగనా మాట్లాడడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ‘రూ.100ల కోసమే రైతులు రోడ్ల మీద కూర్చొన్నారని కంగన మాట్లాడారు. మా అమ్మ కూడా నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. ఆమె వెళ్లి అక్కడ కూర్చోగలరా? అని కుల్విందర్ కౌర్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.
షబానా పోస్టు..
తనపై జరిగిన దాడిపై బాలీవుడ్ మౌనాన్ని ప్రశ్నించారు కంగనా. అయితే ప్రముఖ నటి షబానా అజ్మీ కంగనా పోస్టు స్పందించారు. భద్రతా సిబ్బంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ప్రారంభిస్తే, మనలో ఎవరూ సురక్షితంగా ఉండలేం' అని షబానా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
I have no love lost for #Kangana Ranaut. But I can't find myself joining this chorus of celebrating "the slap". If security personnel start taking law into their hands none of us can be safe .
— Azmi Shabana (@AzmiShabana) June 7, 2024