కన్నప్ప: పోస్టర్ లో ‘మంచు విష్ణు’ లుక్ అదిరింది
x
భక్త కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు

కన్నప్ప: పోస్టర్ లో ‘మంచు విష్ణు’ లుక్ అదిరింది

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్త కన్నప్ప చిత్రం ఫస్ట్ లుక్ ను శుక్రవారం మహ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు.


మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భక్త కన్నప్ప చిత్రం ఫస్టు లుక్ పోస్టర్ ను మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు.

భక్త కన్నప్పగా టైటిల్ రోల్ లో విష్ణు మంచుతో పాటు, దక్షిణాది స్టార్లు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ బ్రహ్మానందం వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు. అన్నింటే కంటే ముఖ్యమైన శివుడి పాత్రలో రెబెల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు.
శుక్రవారం విడుదల చేసిన పోస్టర్‌లో, విష్ణు మంచు, భక్త కన్నప్ప పాత్రలో, విల్లు, బాణంతో ఆయుధాలు ధరించి, జలపాతం నుంచి ఆవిర్భవించిన యోధుడిగా చూపెట్టారు. తీక్షణమైన చూపుతో లక్ష్యంపై బాణం వేస్తున్నట్లు పోస్టర్ లో ఉంది. తొలి లుక్ పై మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. చాలాకాలం నుంచి సరైన హిట్ లేక అల్లాడిపోతున్న మంచు ఫ్యామిలి ఈ సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటోంది.
భక్త కన్నప్ప ప్రాజెక్ట్ చేస్తున్నానని మంచు విష్ణు ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ తో ఈ అంచనాలు పెరిగిపోయాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ పార్ట్ ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించబడింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో దాదాపు 600 మంది కళాకారులు, నటీనటులు ఉన్నారు.
ఈ సినిమా పై మంచు విష్ణు నమ్మకంగా ఉన్నాడు. " నేను ఈ చిత్రంపై పట్ల ఆనందంగా ఉన్నాను. అంచనాలను అనుగుణంగానే ఇది కొనసాగుతోంది. ఈ చిత్రంలో కన్నప్ప కేవలం శివ భక్తుడిగానే కాకుండా ఓ వారియర్ గా కూడా చూస్తారు. ప్రస్తుత గ్లింప్స్ తో ఆనందం రెట్టింపు అయింది" అని మంచు విష్ణు అన్నారు. కాగా, ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.


Read More
Next Story