మూడు సినిమాలు, మూడు హిట్లు,  మ్యాజిక్ ఒక్కటే...
x

మూడు సినిమాలు, మూడు హిట్లు, మ్యాజిక్ ఒక్కటే...

కాంతారా, కార్తికేయ, హనుమాన్ లో ప్రేక్షకుల మీద విసిరిన మ్యాజిక్ ఏమిటో తెలుసా. ఈ సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ ను కొల్లగొట్టాయి.


మొన్న సంక్రాంతికి హనుమాన్ ఒక బ్యాక్సాఫీస్ మ్యాజిక్ చేసింది. హనుమంతుని సూపర్ మ్యాన్ గా ప్రెజెంట్ చేస్తూ బాక్సీఫీస్ గెలిచింది. అంతకు ముందు కాంతారా, కార్తికేయ 2 అదే మ్యాజిక్ తో విజయం సాధించాయి.


ఏమిటా మ్యాజిక్ : భక్తి. గతంలో భక్తి సినిమాలు, దేవతల సినిమాలు వచ్చాయి. గతంలో భక్తికి, ఈ భక్తికి తేడా , ఈ సారి భక్తిలో సినిమా రసాలున్నీ ఉన్నాయి. పూర్వపు సినిమాలలో భక్తి ప్రశాతంగా, నిర్మళంగా ఉండేది.


ఇప్పుడు ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. హనుమాన్ కు ఆల్రెడీ సీక్వెల్ ప్రకటించేసారు. ఇక కార్తికేయ 3 తయారికీ రంగం సిద్దమవుతోంది. మరో ప్రక్క కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నారు. కాంతారా ప్రీక్వెల్ లో , దివ్యమైన ఆథ్యాత్మిక అనుభూతిని అందిస్తామని చెప్తున్నారు! నిజానికి అలాంటి స్వేచ్ఛ పొందాలనే కాంక్ష దాదాపు ప్రతి మానవుడిలోనూ ఉంటుంది. మరి దాన్ని పొందడం ఎలా? అది అంతలా సాధ్యమయ్యే పనికాదు. అలాంటప్పుడు కొన్ని పుస్తకాలు, సినిమాలు ఇలాంటివాటికి ఊతమిస్తాయి. సినిమాలతో ఆధ్యాత్మిక ప్రస్థానం అందుకోవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అది ఆశ్చర్యమే కదా.

‘కాంతార’ మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. కన్నడిగులు ఆచారాన్ని వివరిస్తూ ప్రకృతికి మనిషికి మధ్య జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించాడు హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమాలో కన్నడ దైవనర్తకుల గురించి .. కొలం గురించి తెలిపారు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం అందుకుంది. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన.. చివరి 20 నిముషాలు.. ప్రేక్షకులు థియేటర్స్ లో సీట్ అంచున కూర్చోబెడుతుంది.

అందుకే, ఇప్పుడు ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ను ఇంగ్లీష్‌లో కూడా రూపొందిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమాను 7 భాషల్లో సిద్ధం చేస్తున్నారు. ఈరోజు ఆ 7 భాషల్లో ఫస్ట్ లుక్‌ను, ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రిషబ్ శెట్టి మరోసారి ఆశ్చర్యపరిచారు. యోధుడి రూపంలో రిషబ్ శెట్టి భయపెట్టారు. పరమశివుడి అవతారంలా కనిపించారు. వెలుగు.. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది. కానీ అది వెలుగు కాదు దర్శనం. గతంలో జరిగింది తరవాత జరగబోయేది అంతా చూపిస్తుంది ఆ వెలుగు. కనబడుతుందా?’ అనే డైలాగ్‌తో కథ మలుపు తీసుకుంటుంది. శివ ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుడు వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు కథ కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. యోధుడి రూపంలో రిషబ్ శెట్టి పరిచయం అవుతారు. కండలు తిరిగిన శరీరం, పొడుగాటి జులపాలు, గుబురు గెడ్డంతో మహాశివుడి రూపంలో ఆ యోధుడు దర్శనమిచ్చాడు. శత్రువులను చీల్చి చెండాడుతూ నిలబడ్డాడు.

ఇక ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ ద్వారా 4వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారు రిషబ్ శెట్టి. సుమారు నాలుగు శతాబ్దాల పాటు ఉత్తర కర్ణాటకను పాలించిన కదంబ రాజవంశీయుల కాలంలోకి వెళ్లబోతున్నాం. కదంబ రాజ్యంలో పుట్టిన ఒక యోధుడిని చాప్టర్ 1లో పరిచయం చేయబోతున్నారు. మరి ఈ కథ ఎన్ని చాప్టర్లలో చెప్తారో వేచి చూడాలి. మొత్తం మీద ‘కాంతార’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ప్రీక్వెల్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. అందుకే ఏకంగా 7 భాషల్లో రూపొందిస్తున్నారు.


Read More
Next Story