
కరణ్ జోహార్
బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అంటున్న కరణ్ జోహార్
దురంధర్, బోర్డర్-2 చిత్రాల విజయం సాధించడమే కారణమన్న దర్శకనిర్మాత
వరుసగా రెండు హిట్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ తిరిగి ఫామ్ లోకి వచ్చిందని బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నుంచి విడుదలైన దురంధర్, బోర్డర్-2 ఘన విజయం సాధించింది.
దురంధర్ ఏకంగా పాత రికార్డులను అన్నింటిని తిరిగి రాస్తూ వస్తోంది. దీనిపై ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఓ కథనం పంచుకున్నారు. ‘‘ఇటీవల వరుసగా వచ్చిన రెండు మెగా హిందీ చిత్రాలు విజయం సాధించాయి.
ఇవి ఓ విషయాన్ని తెలియజేస్తున్నాయి. బాలీవుడ్ తిరిగి ఫుంజుకుంది. సినిమాలు ప్రేక్షకులతో కనెక్ట్ అయినప్పుడూ, భావోద్వేగాలను తాకినప్పుడూ అన్ని దురంధర్ లు సరిహద్దు దాటుతాయి’’ అని రాసుకొచ్చారు.
ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ‘‘దురంధర్’’ డిసెంబర్ 5, 2025న విడుదల అయింది. రణ్ వీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషించారు.
కాందహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్క్ ను దాటింది. ఈ సినిమా రెండో భాగం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది.
‘‘బోర్డర్ -2’’ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇది 1997 లో విడుదలైన బోర్డర్ చిత్రానికి కొనసాగింపు. వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి నటించారు.
జనవరి 23న ఈ సినిమా విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా 129. 89 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీనిని భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించారు.
గత కొంతకాలంగా బాలీవుడ్ లో వచ్చిన మెగా ప్రాజెక్ట్ లన్నీ ఘోరంగా విఫలమవడం, దక్షిణాది సినిమాల హావా పెరగడంతో హిందీ చిత్రపరిశ్రమ ఆందోళన చెందింది. అయితే బాలీవుడ్ విజయాల కరువును దురంధర్, బోర్డర్ చిత్రాలు తీర్చాయి.
Next Story

