కన్నడ నటుడు దర్శన్‌కు పోలీసులు ‘రాచ మర్యాదలు’ చేశారా?
x

కన్నడ నటుడు దర్శన్‌కు పోలీసులు ‘రాచ మర్యాదలు’ చేశారా?

ఓ హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌కు స్టేషన్ లో పోలీసులు రాచ మర్యాదలు చేశారా? మీడియాతో హోం మంత్రి పరమేశ్వర ఏమన్నారు?


హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, ఆయన సహచరులకు పోలీస్ స్టేషన్‌లో రాచ మర్యాదలు లభించాయన్నవార్తలను కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర శుక్రవారం ఖండించారు.

దర్శన్‌ తమకు ప్రత్యేకమేమీ కాదన్నారు. ఇతర నిందితుల్లాగా అతను ఒకడని చెప్పారు. ఆయన కోసం పోలీసు స్టేషన్‌కు 'బిర్యానీ' తెప్పించడం, ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లాంటివేమి జరగలేదన్నారు.

"మీడియా కథనాలపై విచారించాను. దర్శన్, ఆయన అనుచరులకు ఎలాంటి మర్యాదలు చేయలేదని నిర్ధారించుకున్నాను’’ అని మంత్రి చెప్పారు.

రాకపోకలకు ఇబ్బందులు..

దర్శన్‌ను ఉంచిన అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆయన అభిమానులు రోడ్లను దిగ్బంధించడం ద్వారా ప్రజల రాకపోకలను, విద్యార్థులు స్కూళ్లక వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంతి పాత్రికేయులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తానని మంత్రి పరమేశ్వర చెప్పారు.

దర్శన్ ఎందుకు హత్య చేశాడు?

దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపడంతో పాటు దర్శన్‌ను విడిచిపెట్టాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న దర్శన్‌, అతని సహచరులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read More
Next Story