ఆనంది కార్తీక : మిస్సింగ్ కేస్ ఓటిటి మూవీ రివ్యూ!
x

ఆనంది 'కార్తీక : మిస్సింగ్ కేస్' ఓటిటి మూవీ రివ్యూ!

ఈ సినిమాలో కార్తీక మిస్సయ్యిందా? లేక కథే మార్గమధ్యలో మిస్సైందా? ఇప్పుడు చూద్దాం


ఒక మంచి థ్రిల్లర్ అన్నది...అంటే మళయాల థ్రిల్లర్ అన్నట్లు ఓటీటిలలో రిలీజ్ అయ్యే సినిమాలు ముద్ర వేసేసాయి. అయితే ఇప్పుడు తమిళ థ్రిల్లర్ ఒకటి ‘కార్తీక: మిస్సింగ్ కేస్’ అనే టైటిల్ తో తెలుగులో డబ్బింగ్ అయ్యి వచ్చింది. “A thriller isn’t about shocking the audience. It’s about seducing their attention.” అన్నట్లు ఈ థ్రిల్లర్ మన అటెన్షన్ ని సెడ్యూస్ చేయగలిగిందా... ఈ సినిమాలో కార్తీక మిస్సయ్యిందా? లేక కథే మార్గమధ్యలో మిస్సైందా? ఇప్పుడు చూద్దాం

స్టోరీ లైన్

కార్తీక (ఆనంది) ప్రేమించిన కుర్రాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలెడుతుంది. కానీ అనూహ్యంగా అతను యాక్సిడెంట్‌కు గురవుతాడు. అతన్ని రక్షించడానికి డబ్బు అవసరం. డాక్టర్ చంద్రిక (వినోదిని) సరోగసీ అనే దారిని చూపుతుంది . బాగా డబ్బున్న గురుప్రసాద్ ఫ్యామిలీ కోసం కార్తీక తన కడుపున ఒక బిడ్డను మోయడానికి అంగీకరిస్తే, ఆమె భర్త బ్రతకడానికి అవసరమైన డబ్బును వాళ్లు సర్దుతారని చంద్రిక చెబుతుంది. . కార్తీక వేరే దారి లేక అంగీకరిస్తుంది.

అంతా సవ్యంగా జరిగుగుతోంది అనుకునే లోగా ఆమె అందించే బిడ్డ అవసరం లేదంటూ గురుప్రసాద్ దంపతులు తప్పుకుంటారు. ఈ క్రైసిస్ నుంచి ఎలా తప్పుకోవాలో అర్దం కాని పరిస్దితి ఓ ప్రక్క. మరో ప్రక్క తన తన భర్త ఎలా ఉన్నాడో హాస్పటిల్ వాళ్లు చూపించని పరిస్దితి మరో ప్రక్క. దాంతో చూడాలన్న కోరిక గట్టిగా మారుతుంది. దానికి వాళ్లు ఒప్పుకోరు.

ఈ లోగా కార్తీక కనపడకుండా పోతుంది. మిస్సింగ్ కేసుగా ఎంక్వైరీ మొదలవుతుంది. ఈ కేసును ఛేదించేందుకు ప్రవేశించే డిటెక్టివ్ నందా (కథిర్), సీబీఐ ఆఫీసర్ సేతుమాధవన్ (నరేన్) పాత్రలు మరో మిస్టరీని తెరలేపుతాయి – ఇది ఒక్క మిస్సింగ్ కేసేనా?మరేదోనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథా,కథన విశ్లేషణ

"A thriller screenplay is like a magician’s hand – if you show too much too soon, the trick dies."

‘కార్తీక: మిస్సింగ్ కేస్’ సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. సరోగసీ, డబ్బుల కోసం ఒప్పందం, ప్రేమ కోసం త్యాగం... ఇవన్నీ కథను ఎమోషనల్‌గా ముందుకు నడిపేలా అనిపిస్తాయి. కానీ అసలు సమస్య అక్కడే మొదలవుతుంది – కథ కంటే కథనాన్ని ఎక్కువగా వివరించడంలో.

"ఒక మంచి థ్రిల్లర్‌కి కావాల్సింది కేవలం పగడ్బందీగా నడిచే స్క్రీన్‌ప్లే మాత్రమే. ఆఖరి వరకు ప్రేక్షకుడిని ఏం జరుగుతోంది ఊహించలేని విధంగా మాయ చేయగలిగే కథనమే విజయం సాధించగలదు. కానీ కొందరు దర్శకులు – కేవలం ట్విస్టుల వర్షం కురిపించడమే థ్రిల్లర్ సూత్రమనుకుంటున్నారు. దర్శకుడిగా తొలి ప్రయత్నం చేసిన జాక్ హారిస్‌ రూపొందించిన ఈ సినిమా సినిమా కూడా ఈ కోవలోకే చెందింది. కథ ప్రారంభం నుంచే చెప్పేదీ, చూపేదీ అంతగా ఇంటెన్స్ గా ఉండకపోవటం వల్ల, మధ్యలోనే ఆసక్తి కోల్పోతాం."

‘ట్విస్ట్’ అన్నదే కథ కాదు – అది కథనానికి ఒక బలమైన మలుపు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయి చేసారు. “The real twist in a thriller is not in what happens, but in how it is revealed.” ‘కార్తీక మిస్సింగ్’ స్క్రీన్‌ప్లేలో చిన్నపాటి ట్విస్ట్‌లు ఒక్కొక్కటీ అప్రయత్నంగా కలుపుతూ పోతుంటే, అసలు థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఓవర్‌డోస్ లా మారింది.

అలాగే కార్తీక పాత్ర – ఒక సాధారణ మిడిల్ క్లాస్ మహిళగా... ఆమె నిర్ణయాల వెనుక నిర్మించిన ఎమోషన్ చాలా బాగుంది. కానీ ఈ ఎమోషన్‌ను స్క్రీన్‌ప్లేలో ఎలిమెంట్ గా చూపించలేదు. మిస్టరిని ఎక్కువగా ఎక్సప్లెయిన్ చేస్తే అది సస్పెన్స్ ని మర్డర్ చేసిన ఫీలింగ్ వస్తుంది.

క్లాస్‌లో లెక్చర్ విన్న ఫీలింగ్... థ్రిల్లర్‌లోకి లాక్కెళ్లలేదు. కథలోని బాధ నిజమైనది, కానీ కథనం పాఠం లా అనిపించింది.

ఏదైమైనా మేజర్ మిస్టరీ ఎలిమెంట్: సైలెన్స్ & స్పేస్ ని మిస్ చేసారు. ఒక మంచి స్క్రీన్‌ప్లే మౌనాన్ని కూడా గుసగుసలా వినిపించగలగాలి. కానీ ఈ సినిమా చాలా చెప్తుంది – కానీ చాలా చూపించదు. ఫ్లాష్‌బ్యాక్, డైలాగ్, ఆర్టిఫిషియల్ ట్విస్టులు అన్నీ కలిసిపోయి కథని హైపర్ యాక్టివ్ చేసి, అంతరంగిక మూడ్‌ను దెబ్బతీస్తాయి.

రెండు మిస్సింగ్ కేసులు – స్క్రీన్‌ప్లేలో ఒకదాన్నే వదిలేసిన ఫీలింగ్. ఫస్ట్ హాఫ్‌లో ఓ మిస్సింగ్ కేసు. సెకండ్ హాఫ్‌లో మరో మలుపు. కానీ ఈ రెండింటిని ముడిపెట్టే స్క్రీన్‌ప్లే కనెక్షన్ లోపించింది. అవి కలుస్తాయేమోనని ఎదురుచూసే ప్రేక్షకుడికి చివరకు కలిసిన లింక్ చాలా బలహీనంగా అసలు లేనట్లే అనిపిస్తుంది.

నటీనటులపై ఓ లుక్కేస్తే..:

ఆనంది ఈ సినిమాకు స్పైనింగ్ ఎమోషనల్ హార్ట్. ఆమె బాధ, నిరాశ, ఆశలు, ఆశ్చర్యం – ప్రతీది ఆమె కళ్లలో మాట్లాడుతుంది. కథిర్, నరేన్, నట్టి సుబ్రమణియన్ – ముగ్గురూ సరైన బ్యాలెన్స్ తో , మిస్సింగ్ కేసు వెనుక సీక్రెట్ ని డెప్త్ ని పెంచేలా లీడ్ చేస్తారు.

అలాగే పుష్పరాజ్ సంతోష్ ఫొటోగ్రఫీ .. రంజిన్ రాజ్ సంగీతం .. జోమిన్ మ్యాథ్యూ ఎడిటింగ్ తగుమాత్రంలో ఉన్నాయి.

ఫైనల్ థాట్:

‘కార్తీక: మిస్సింగ్ కేస్’లో కథ ఉంది. బలమైన ఎమోషన్ ఉంది. కానీ స్క్రీన్‌ప్లే? మాత్రం మిస్సైంది.

చూడచ్చా?

అద్బుతం ఎక్సెపెక్ట్ చేయకపోతే ఓ లుక్కేయవచ్చు

ఎక్కడ చూడచ్చు?

'ఆహా' ఓటిటిలో తెలుగులో ఉంది

Read More
Next Story