
'కట్టప్ప' పాత్రతో సినిమా రాబోతోందా?
ప్రభాస్ ఉంటాడా అందులో?
'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? – ఈ ఒక్క ప్రశ్ననే దేశం మొత్తానికి వైరల్‌గా మార్చిన పాత్ర కట్టప్పది. బాహుబలి, భల్లాలదేవా, దేవసేన ఎంతగా హౌస్‌హోల్డ్ నేమ్స్ అయ్యారో, కట్టప్ప అంతకు మించి అన్నట్లుగా ఆ క్రేజ్‌ని మించిపోయాడు. ఎందుకంటే ఆయన చుట్టూ మిస్టరీ, లోయల్టీ, ట్రాజెడీ, పవర్ కలయిక ఉంది. ఆయన పాత్ర ట్విస్ట్ వల్లే బాహుబలి-2కి అంచనాలు మిలియన్ రెట్లు పెరిగాయి.
బాహుబలి రిలీజైన పదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఆ పాత్ర గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే... రచయిత విజయేంద్రప్రసాద్, కట్టప్ప పాత్ర చుట్టూ ఓ ప్రత్యేక సినిమా చేయాలనుకుంటున్నారని వార్తలు హాట్‌గా వినిపిస్తున్నాయి.
మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప ఎందుకు నమ్మిన బంటు అయ్యాడు? ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి? ఎందుకు బానిసగా ఉండాల్సి వచ్చింది? ఈ అన్ని ప్రశ్నలకూ సమాధానాలే ఆ సినిమా కథ అని టాక్. అయితే ఆ టాక్ ఎంతవరకూ నిజమనేది ప్రక్కన పెడితే...ఈ ప్రాజెక్టు చేస్తే ఏ మేరకు లాభం ఉంటుంది. అసలు ఇలాంటి ఒక పాత్ర చుట్టూ అల్లే కథతో సినిమా వర్కవుట్ అవుతుందా చూద్దాం.
కేవలం కట్టప్ప పాత్రతో సినిమా వర్కవుట్ అవుతుందా?
ఒక పెద్ద సినిమా సక్సెస్ తర్వాత, అందులోని ఒకే ఒక్క పాపులర్ క్యారెక్టర్ చుట్టూ కథ అల్లడం అనేది హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ చాలాసార్లు వర్కౌట్ అయ్యింది. అదే ఐడియా బాహుబలి లాంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్లోని పాత్ర మీద వస్తే? – ఇది నిజంగా గొప్ప కాన్సెప్ట్ అని చెప్పాలి.
కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏమిటంటే – కేవలం ఆ పాత్ర క్రేజ్ మాత్రమే కాదు, సినిమా మేకింగ్ కూడా బాహుబలి లెవెల్‌లోనే గ్రాండియర్‌గా ఉండాలి. ఎందుకంటే బాహుబలి యూనివర్స్‌కి వచ్చిన స్టాండర్డ్ అంత తేలికగా దించలేం. ప్రేక్షకులు ఇప్పటికే visual spectacle, రాజసం, భారీ సెట్స్, బలమైన ఎమోషన్‌కి అలవాటు పడ్డారు.
కాబట్టి కట్టప్ప వంటి పాత్ర చుట్టూ సినిమా చేయాలంటే అది కేవలం బ్యాక్‌స్టోరీ కాకుండా, ఒక కొత్త ఎపిక్ అనుభవంగా రావాలి. అదే ఒక పాపులర్ క్యారెక్టర్‌ని ఫుల్-ఫ్లెడ్జ్ లీడ్‌గా మార్చి, మరోసారి ఇండియన్ సినిమాకి గ్లోబల్ రేంజ్ హిస్టరీ రాసే అవకాశంగా మారుతుంది.
చాలా సార్లు ఒక సినిమా సక్సెస్ కావడానికి కొన్ని సార్లు ఓ ఒక్క పాత్రే చాలు. జోకర్ (Joker) సినిమా ఎలా బాక్స్ ఆఫీస్‌కి షేక్ ఇచ్చిందో గుర్తుందా? లేదా హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎలాంటి కల్ట్ క్రేజ్ తెచ్చిందో? అదే విధంగా కట్టప్ప అనేది ఇప్పటికే ఒక కల్ట్ క్యారెక్టర్. ఆ పాత్రలో లాయల్టీ, బానిసత్వం, ఆత్మగౌరవం, ద్రోహం, ట్రాజెడీ అన్నీ ఒకే ఫ్రేమ్‌లో ఉన్నాయి. అందుకే ఈ పాత్ర చుట్టూ కథ అల్లితే సక్సెస్ ఫార్ములా రెడీ అన్నమాట.
కట్టప్ప క్రేజ్ ఎందుకు వచ్చిందంటే?
ఆయన వల్లే కథలోని భారీ ట్విస్ట్ సెట్ అయింది. ఆయన నిర్ణయాలు వల్లే బాహుబలి, భల్లాలదేవా ఫేట్ నిర్ణయమైంది.
బిజినెస్ & మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ
బ్రాండ్ ఎక్స్టెన్షన్: బాహుబలి యూనివర్స్ ఇప్పటికే ఒక బిలియన్ డాలర్ ఫ్రాంచైజ్. Netflix వెబ్ సిరీస్, అనిమేషన్, గేమ్స్ – ఇవన్నీ ఆ యూనివర్స్‌ని విస్తరించాయి. కట్టప్ప సినిమా వస్తే, అది బ్రాండ్ విలువని మల్టిప్లై చేస్తుంది.
ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్ పొజిషనింగ్: “బాహుబలి-3” అనగానే ఎక్సపెక్టేషన్స్ చాలా హెవీగా ఉంటాయి. కానీ “కట్టప్ప – ది అన్టోల్డ్ స్టోరీ” అనే పొజిషనింగ్ ఇస్తే, పబ్లిక్‌కి క్రేజ్, మార్కెటింగ్‌లో సేఫ్ బెట్.
మార్కెటింగ్ క్యాంపెయిన్ స్ట్రాటజీ:
బాహుబలి-2లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ప్రశ్న → "కట్టప్ప..బాహుబలిని ఎందుకు చంపాడు?" అని. కట్టప్ప సినిమాలో కూడా క్యూరియాసిటీ-డ్రైవన్ ట్యాగ్ లైన్ వాడితే → "కట్టప్ప ఎందుకు బానిసగా మారాడు?" లేదా "మహిష్మతికి రాకముందు కట్టప్ప ఎవరు?" → ఇదే హుకింగ్ పాయింట్.
టార్గెట్ మార్కెట్లు:
ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటికే మాస్ కనెక్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కి కట్టప్ప ఒక మిస్టికల్, ట్రాజిక్ వారియర్ ఇమేజ్. మార్కెటింగ్‌లో గ్లోబల్ కనెక్ట్ క్రియేట్ చేయడానికి ఇది ఫెరఫెక్ట్ హుక్.
మెర్చండైజింగ్ & సీక్వెల్ పొటెన్షియల్:
కట్టప్ప లాంటి ఐకానిక్ క్యారెక్టర్‌కి టాయ్స్, గ్రాఫిక్ నావెల్స్, వీడియో గేమ్స్ – ఇవన్నీ నెక్ట్స్ లెవిల్ రెవిన్యూ సిస్టమ్. ఫ్రాంచైజ్ లైఫ్ లైన్ కూడా అవుతుంది.
కట్టప్ప మీద సినిమా చేస్తే ఏమవుతుంది?
బాహుబలి యూనివర్స్‌కి కొత్త బ్లడ్ వస్తుంది. ఇప్పటికే తెలిసిన మిస్టరీకి ఎమోషనల్ బ్యాక్‌స్టోరీ యాడ్ అవుతుంది. మలుపులు, మానవ విలువలు, బానిసత్వపు బాధ – ఇవన్నీ బాక్స్ ఆఫీస్ మీద గ్యారంటీగా పనిచేస్తాయి. ఒక పాత్ర చుట్టూ మిథాలజికల్ ఎమోషన్ అల్లడం అనేది ఇండియన్ సినిమాల్లో తరచుగా హిట్ ఫార్ములానే.
హాట్ టేక్:
అయితే కట్టప్ప సినిమాకి ఎవరు డైరక్షన్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. రాజమౌళి స్వయంగా దర్శకత్వం వహిస్తే, ఇది బాహుబలి-3 కన్నా కూడా క్రేజీగా ఉంటుందనే అంచనా వేయటంలో తప్పు లేదు. కానీ రాజమౌళి ఇప్పుడున్న బిజీలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టరు. మరి ఎవరు చేస్తారు అనేదానిపై ఈ ప్రాజెక్టుకి వచ్చే క్రేజ్ ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కొద్ది సేపు అయినా కనపడితే ఓ రేంజిలో క్లిక్ అవుతుంది.