ఓటిటి లోకి మోహన్ లాల్ ఫిల్మ్... కేరళ ఎగ్జిబిటర్ల ఆగ్రహం, ఆల్టిమేటం
x

ఓటిటి లోకి మోహన్ లాల్ ఫిల్మ్... కేరళ ఎగ్జిబిటర్ల ఆగ్రహం, ఆల్టిమేటం

ఒటిటి థియటర్ ని బాగా దెబ్బ కొట్టింది. ఎలాగూ ఓ నెలలో ఒటిటిలో సినిమా చూడొచ్చంటూ థియటర్ కు వెళ్లడం మానేస్తున్నారు.కేరళలో ఇపుడిది పెద్ద గొడవవుతూ ఉంది. వివరాలు


ఓటీటి అనేది థియేటర్ సినిమాకు ప్రత్యన్మాయంగా తయారైంది. ఓ రకంగా థియటర్ సినిమాని భారీగా దెబ్బ కొట్టింది. ఎలాగూ నెలలోపలే ఓటిటిలో క్వాలిటీ ప్రింట్ తో సినిమా దొరుకుతుందనే థీమాతో డబ్బు, టైమ్ ఖర్చు పెట్టి థియటర్ కు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ మన తెలుగు,తమిళంలో స్టార్స్ తో వచ్చే రెవిన్యూతో లాక్కొస్తున్నారు. మళయాళంలో మరీ దారణం అయ్యిపోయింది. ఓటీటీలో సినిమాల్ని ముందుగానే విడుదల చేయడం వల్ల థియేటర్ల యజమానులు సినిమా హాళ్ళని నడపడానికి ఇబ్బంది పడుతున్నారనీ, ఓటీటీలకి సమాంతరంగా సినిమా హాళ్ళని నడపలేమనీ, దీనికి ఒక పరిష్కారం కనుగొనాలనీ చాలా సినిమాలు థియేటర్లలో మంచి వసూళ్ళతో ఆడుతూ వుండగానే, ఓటీటీ విడుదల తేదీల్ని ప్రకటించడంతో ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదనీ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఎగ్జిబిటర్ల సంఘం.






ఈ గొడవ ముదిరిపాకన పాడింది. ఈ క్రమంలో కేరళ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ఇకపై మలయాళ సినిమాలను ప్రదర్శించకూడదని కేరళ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం(ఫిబ్రవరి 16)న సమావేశం అయిన కేరళ మూవీ ఓనర్స్ అసోసియేషన్ ఫిబ్రవరి 22 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి సినిమాలను రిలీజ్ చేయబోమని ప్రకటించింది. ఇది మలయాళ సినిమా ఇండస్ట్రీకు షాకే. ఇన్నాళ్లూ పట్టించుకోకపోయినా ఇప్పుడు తప్పించుకోవాటనికి వీలు లేదు. అసలు ఇంత స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటంటే?

గత రెండు సంవత్సరాల నుంచి ఈ యుద్దం జరుగుతోంది. ఓటీటీ సినిమా విడుదల తేదీ విషయంలో కేరళ థియేటర్ల యాజమాన్యాలు పూర్తి స్దాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. సినిమా విడుదలైన నెల రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్నది వారి డిమాండ్. ఇందుకోసం అసోసియేషన్ ఓ రూల్ కూడా తెచ్చింది. సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన 42 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీల్లో విడుదల చేయాలనేది ఆ ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ‘2018’, ‘పచువుమ్ అత్బుత విళక్కుమ్’ నిర్మాతలు పరిగణనలోకి తీసుకోలేదు. గతంలో చలనచిత్రాలు థియేటర్లలో విడుదలైన 32 రోజుల తర్వాత ఓటీటీల్లో విడుదల చేయాలని ఒక ఒక నిబంధన వుండేది. అయితే ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదని తేలడంతో పునః పరిశీలించాల్సి వచ్చింది. సవరించిన వ్యవధి 42 రోజులుగా నిర్ణయించారు. ఇకముందు ఎవరైనా నిర్మాత ఈ నిబంధనని ఉల్లంఘిస్తే ఆ నిర్మాత సినిమాల్ని బహిష్కరిస్తామని సంఘం హెచ్చరించింది.

కానీ ఆ రూల్ ను కొందరు నిర్మాతలు ఉల్లంఘిస్తూ వచ్చారు. వేరే దారి లేక వీరు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన ‘మలైకొట్టై వాలిబన్’ మూవీ కొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది థియేటర్ల యజమానులకు మరింత కోపం తెప్పించింది.

గతంలోనూ ఇలాంటి పరిస్దితి వచ్చింది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ‘2018’, ‘పచ్చువుమ్ అద్భుత విళక్కుం’ సినిమాల నిర్మాతలు ఓటీటీల్లో గడువుకంటే ముందే ప్రీమియర్ చేయడానికి అంగీకరించడంతో ఎగ్జిబిటర్ల సంఘం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ‘2018’, ‘పచ్చువుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమాలు థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్నాయనీ, అందుకని ఓటీటీల్లో ముందస్తుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ, లాస్ట్ ఇయిర్ జూన్ 7- 8 తేదీల్లో సినిమా హాళ్ళను పూర్తిగా మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన తర్వాత, నిర్ణీత వ్యవధి గడిచాక మాత్రమే ఓటీటీ విడుదలకి అనుమతించేట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది.
అలాగే ఎగ్జిబిటర్ల సంఘం మరో ఆరోపణ ఏమిటంటే, ఈ రోజుల్లో చాలా మలయాళ సినిమాలు ఓటీటీల్ని లక్ష్యంగా చేసుకునే ఏకైక ఉద్దేశ్యంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలే థియేటర్లకి నష్టం కలిగిస్తున్నాయంటున్నారు. ఈ సినిమాల్ని చూడడానికి థియేటర్ కొచ్చిన ప్రేక్షకులు తాము మోసపోయామని గ్రహిస్తున్నారు. దీంతో మళ్ళీ థియేటర్లకి రావడానికి సందేహిస్తున్నారని చెప్తున్నారు. అందుకని థియేటర్లని రక్షించడానికి ఏకైక మార్గం థియేటర్లని దృష్టిలో వుంచుకుని థియేటర్ సినిమాల్ని నిర్మాతలు నిర్మించడమే. ఇది హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యని పెంచుతుంది. ఇలా రూపొందించిన సినిమాలే తమకి అవసరమని ఎగ్జిబిటర్ల సంఘం చెప్తోంది.


Read More
Next Story