
తెరపైకి మధుబాల విషాద గాథ, షాకింగ్ డిటేల్స్
తెరపై దేవత, నిజ జీవితంలో నరకం..
ఒకప్పుడు తన అందంతో, అభినయంతో భారతీయ సినీ ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసిన లెజెండరీ నటి మధుబాల పేరు వినగానే ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ పుడుతుంది. “బాలీవుడ్ వీనస్”గా పేరుగాంచిన ఆమె జీవితం బయటికి చూస్తే ఓ ఫెయిరీటేల్ లాగా కనిపించినా, లోపల మాత్రం ఎన్నో కన్నీళ్లు, విషాదాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు ఆ లెజెండరీ నటి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక భారీ బయోపిక్ తెరకెక్కబోతోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చినా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి సంజయ్ లీలా భన్సాలీ ప్రవేశించడంతో మళ్ళీ హాట్ టాపిక్ అయింది.
భన్సాలీ మార్క్ గ్రాండియర్.. కియారా గ్లామర్!
అత్యంత విలాసవంతమైన సెట్టింగ్స్, ఎమోషనల్ డ్రామాకు కేరాఫ్ అడ్రస్ అయిన సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా వస్తున్నారు. ఇక మధుబాల పాత్రలో గ్లోబల్ బ్యూటీ కియారా అద్వానీ మెరవనుంది. మధుబాల లైఫ్ లో ఉన్న ఆ మ్యాజిక్, ఆ గ్లామర్ పండించాలంటే కియారానే కరెక్ట్ అని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. 22 ఏళ్ల కెరీర్ లో 60 సినిమాలు చేసిన మధుబాల, కేవలం 36 ఏళ్లకే ఎందుకు మరణించింది? ఆమె ప్రేమకథలో ఉన్న విషాదమేంటి? అన్న పాయింట్స్‌ను ఈ సినిమాలో అద్బుతంగా చూపించబోతున్నారు.
మధుబాల విషాద గాధ
మధుబాల జీవితం నిజానికి ఒక విషాద గాథ. చిన్న వయసులోనే ఆమెకు గుండె సంబంధిత వ్యాధి వచ్చింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్‌తో ఆమె ప్రేమకథ సంచలనంగా మారింది. ఆ ప్రేమ చివరకు కోర్టు కేసు వరకు వెళ్లింది.
చివరికి ఆమె గాయకుడు కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె చాలా కాలం సినిమాలకు దూరమైంది. కేవలం 36 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం భారతీయ సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ పాత్రల్లో ఎవరు?
మధుబాల జీవితంలో కీలకమైన వ్యక్తులు దిలీప్ కుమార్, కిషోర్ కుమార్. ఈ ఇద్దరు స్టార్ల పాత్రల కోసం బాలీవుడ్‌లోని ఇద్దరు టాప్ హీరోలతో చర్చలు నడుస్తున్నాయి. జస్మీత్ కె.రీన్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. కియారా అద్వానీ ఇప్పటికే యశ్ సరసన 'టాక్సిక్' షూటింగ్ పూర్తి చేసి, ఈ మధుబాల బయోపిక్ కోసం ఫుల్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోంది. జూన్‌లో టాక్సిక్ రిలీజ్ అయ్యాక, ఈ బయోపిక్ పనులు పరుగులు పెట్టనున్నాయి. మధుబాల అందానికి కియారా మేకప్ తోడైతే థియేటర్లలలో అద్బుతాలు జరగటం ఖాయం!
ఇది మామూలు సినిమా కాదు.. ఒక విజువల్ వండర్!
మధుబాల స్టార్‌డమ్ వెనుక ఉన్న స్ట్రగుల్స్, ఆమె ప్రేమ వైఫల్యాలు, చివరికి ఆమె ఎదుర్కొన్న విషాద మరణం.. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగరాయడం పక్కా అనిపిస్తోంది. భన్సాలీ విజన్, కియారా గ్లామర్ కలిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి మధుబాల అసలు సిసలు జీవిత రహస్యాలను భన్సాలీ ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? మధుబాల పాత్రలో కియారా సెట్ అవుతుందా? కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయం చెప్పండి!

