‘గర్ర్‌’(Grrr) ఓటిటి మూవీ రివ్యూ!
x

‘గర్ర్‌’(Grrr) ఓటిటి మూవీ రివ్యూ!

పేపరు మీద అద్బుతంగా అనిపించినవి అన్నీ తెరపై అద్బుతాలు సృష్టించకపోవచ్చు. షూటింగ్ టైమ్ లో ఆహా,ఓహో అనిపించే సీన్స్ థియేటర్స్ లో చెత్తగా కనిపించవచ్చు.


పేపరు మీద అద్బుతంగా అనిపించినవి అన్నీ తెరపై అద్బుతాలు సృష్టించకపోవచ్చు. షూటింగ్ టైమ్ లో ఆహా,ఓహో అనిపించే సీన్స్ థియేటర్స్ లో చెత్తగా కనిపించవచ్చు. అలాంటి అద్బుతం అనిపించిన ఓ ఐడియేనే తెరపైన తుస్సుమంది. ఆకలితో ఉన్న సింహం ఉన్న గుహ దగ్గరకి తెగ తాగి ఒళ్లు తెలియని స్దితిలో ఓ వ్యక్తి వెళ్తే జూ సిబ్బంది అతన్ని రక్షించటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది వినటానికి భలే ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. కొన్ని సార్లు కామెడీగా మరికొన్ని సార్లు సర్వైలల్ థ్రిల్లర్ గా కనిపించి తెరకెక్కించేదాకా మనస్సు ఊరుకోదు. అయితే ఫలితం... ఇదిగో ఇలా ‘గర్ర్‌’(Grrr)మంటుంది.

కథేంటి

తిరువనంతపురంలో రెజిమన్ నాడర్(కుంచాకో బోబన్) అనే కుర్రాడు రచన(అనఘ) అనే అమ్మాయిని తెగ ప్రేమిస్తూంటాడు. ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే ఎక్కడ తాగేసి పడిపోతాడో అని గత అనుభాలను దృష్టిలో పెట్టికుని అతని ఇంట్లో వాళ్లు కంగారు పడుతూంటారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి సిట్యువేషన్ వచ్చింది. ఆ అమ్మాయి తండ్రి లోకల్ పొలిటికల్ లీడర్. ఆయన తన కూతురు ప్రేమ వ్యవహారం పసిగట్టేస్తాడు. ఈలోగా వీళ్లిద్దరు లేచి వెళ్లి పెళ్లి చేసుకుందామనుకుంటారు. ప్లాన్ చేసుకుని ఆమెకు తెగ ఫోన్ చేస్తూంటాడు. అయితే ఆమె ఫోన్ స్విఛ్చాఫ్ చేసి ఉంటుంది. దాంతో ఆమె తనకు హ్యాండ్ ఇచ్చిందని ఫిక్సై తెగ తాగేస్తాడు. తన ప్రెండ్ తో పాటు కారులో వెళ్తూ ఓ చోట ఆగుతాడు. ఆ ప్రక్కనే జూ ఉంటుంది.

తాగిన మైకంలో ఆ జూలోకి వెళ్తాడు. అక్కడ ఓ సింహం గుహ దగ్గరకు మైకంలో చేరుకుంటాడు. సింహం బయిటకు వస్తే తినేస్తుంది. ఇదిచూసి జూ సిబ్బంది కంగారుపడతారు. డ్యూటీ లో ఉన్న జూ అధికారి హరిదాస్ నాయర్( సూరజ్ వెంజరమూడు) అతన్ని సేవ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో అతనిని కాపాడడానికి హరిదాస్ కూడా ఆ కంచె దాటి వెళ్తాడు. దీనితో ఇద్దరు అనుకోకుండా ప్రమాదంలో పడతారు. వీరిని కాపాడడానికి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?అప్పుడు ఏమైంది..ప్రేమ ఫలించిందా..సింహం నుంచి రక్షించపడ్డాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

మొన్నీ మధ్య మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ జానర్ లో సందడి చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా (Grrr)సర్వైవల్ థ్రిల్లర్ కాదు సర్వైవల్ కామెడీ అనే బ్రాండ్ తో మన ముందుకు దిగింది. అయితే ఈ సినిమా చూస్తుంటే మనకు అనిపించేదేమిటంటే ఈ కామెడీ చూసి మనం ఎలా సర్వైవ్ అవుతామని. అంత బోర్ కామెడీ నడుస్తూంటుంది. చిన్న పాయింట్ ని రెండున్నర గంటలు సేపు సాగ తీసి వదిలారు. సింహాన్నే ఈ సినిమా యుఎస్ పి అనుకుని ఉంటారు దర్శక,నిర్మాతలు. అంతేతప్పించి సినిమాకు అవసరమైన ప్రధానమైనవి రైటింగ్, స్క్రీన్ ప్లే, నటీనటులు ఫెరఫార్మెన్స్ లు అని భావించినట్లు లేదు.

సినిమా ప్రారంభమైన పావు గంటకే అసలు కథేంటో తెలిసిపోతుంది. అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. అసలు ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలు సినిమా మొత్తం అర్దమైపోతుంది. అంతకు మించి సినిమాలో విషయం కూడా ఏమీ లేదు. ఒక మనిషి ..సింహం గుహలో ఇరుక్కుంటే జరిగే హంగామాని ఎంతసేపు చూడగలం..అదీ కొత్తదనం లేని సీన్స్ తో...అదీ ప్రెడిక్టబుల్ క్రైమాక్స్ తో అదే జరిగింది. అయితే ఎవరీకి నచ్చదా అంటే పిల్లలకు కొన్ని సీన్స్ నచ్చుతాయి. వాళ్లే దర్శక,నిర్మాతల టార్గెట్ అయితే వంద శాతం సక్సెస్ సాధించినట్లే.

చూడచ్చా

పిల్లలకు కొద్దో గొప్పో నచ్చే కామెడీ ఇది. పెద్దవాళ్లకు ఏ మాత్రం నచ్చే అవకాసం లేదు. బోర్ కొడుతుంది.

ఎక్కడ ఉంది

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story