
సున్నిత హాస్యం: 'లైఫ్ హిల్ గయీ' సీరిస్ రివ్యూ
ఈ సీరిస్ కథేంటి, చివరి దాకా చూడదగనదేనా వంటి విషయాలు చూద్దాం.
సున్నితమైన హాస్యం తో వచ్చే సీరిస్ లు మనకు ఓటీటీలలో తక్కువే. ఎందుకంటే వాటికి క్రైమ్ థ్రిల్లర్స్ కు ఉన్నంత ఆదరణ ఉండదు. బాగ పగలబడి నవ్వించగలిగితే అవి పండుతాయి..నిలబడతాయి.వ్యూస్ తెచ్చుకుంటాయి. రీసెంట్ గా 'లైఫ్ హిల్ గయీ' సీరిస్ కూడా కొంచెం అటూ ఇటూలో అలాంటిదే. చిన్నపాటి కామెడీ డ్రామా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీరిస్ కొంతమేరకు బాగానే నవ్విస్తుంది. బాగానే ఉందనిపిస్తుంది. ఈ సీరిస్ కథేంటి, చివరి దాకా చూడదగనదేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
ఉత్తరాఖండ్ లోని 'పంచ్ మోలి' అనే విలేజ్ లో జరిగే ఈ కథలో ఇద్దరూ బాగా డబ్బున్న పిల్లలు ...అసలు జీవితం ఏమిటి, కేవలం డబ్బులోనే అంతా లేదు అనే విషయం ఎలా తెలుసుకున్నారు వంటి విషయాలు చుట్టూ తిరుగుతుంది. హిమాలయ్ (వినయ్ పాఠక్) తన ఇద్దరు పిల్లలైన దేవ్ (దివ్యేన్దు) కల్కి (కుశ కపిల)తో కలిసి వస్తాడు. అక్కడ దేవ్ తాత పృథ్వీ వాళ్లకు ఓ టాస్క్ ఇస్తాడు. ఆ గ్రామంలో వారికి ఒక పాడుబడిన హోటల్ (బంగ్లా) ఉంటుంది.
దాన్ని ఇద్దరి మనవలలో ఎవరైతే తిరిగి పునద్దరించి, నిలబెడతారో వారికి ఆస్ది చెందుతుందనే కండీషన్ పెడతాడు. దాంతో వేరే దారి లేని పరిస్దితుల్లో ఆ విలేజ్ లో ఉంటూ హోటల్ ను రిపేర్ చేసి కొత్తగా చేసి, రన్ చేయటం మొదలెడతారు. అయితే ఈ విషయంలో దేవ్ - కల్కి ఇద్దరూ బాగా కష్టపడవలసి ఉంటుంది. అక్కడనుంచి వాళ్లు లోకల్ ఉండేవాళ్లను స్టాఫ్ గా తీసుకుని,డవలప్మెంట్ మొదలెడతారు. ఆ క్రమంలో వాళ్లు ఏ సమస్యలు ఎదుర్కొన్నారు. చివరకు ఏం సాధించారు అనేది తెలియాలంటే సీరిస్ చూడాలి.
ఎలా ఉంది
ఈ సీరిస్ ..కెనాడాలోని 'Schitt’s Creek' అనే సిట్ కామ్ ఆధారంగా చేసుకుని,లోకలైజ్ చేసి తీసినట్లున్నారు. అయితే అనుకున్నస్దాయిలో ఫన్ పండించలేకపోయారనే చెప్పాలి. అయితే కొద్దిపాటి కామెడీ తొంగిచూస్తూంటుంది. ఉత్తరాఖండ్ అంద,చందాలు ప్రకృతి మనని అలరిస్తూంటుంది. half-baked గా ఉన్న స్క్రిప్టు పూర్తి ఫన్ ని మనకు ఇవ్వటానికి ఇష్టపడదు. కథ ప్రక్కన పెట్టి మద్యలో వచ్చే ఫన్, ఆ ఊళ్లో జరిగే కొన్ని సరదా సంఘటనలను ఎంజాయ్ చేస్తూంటాము. చాలా థిన్ స్టోరీ లైన్ అవ్వటంతో పూర్తిగా క్యారక్టర్స్ డవలప్మెంట్ కాకపోవటం, డీప్ గా లోపలకి వెళ్లలేకపోవటం జరిగింది. చాలా చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది.
స్క్రీన్ ప్లే ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా చూసుకుని, బోర్ కొట్టే సీన్స్ ని తీసేసి ఉంటే మరో పంచాయిత్ అయ్యే అవకాసం ఉండేది. ప్రారంభం బాగానే ఉన్నా లోపలకి వెళ్లేకొలిదీ ఏమీ జరగటం లేదే అన్న ఫీలింగ్ వస్తుంది. దానికి తగ్గట్లు ఎమోషనల్ డ్రైవ్ కొరవడింది. కాకపోతే డైరక్టర్ అవకాసం ఉన్నప్పుడల్లా సిట్యువేషన్ కామెడీ, డైలాగు కామెడీతో పని పూర్తి,నెక్ట్స్ ఎపిసోడ్ లోకి మనని తీసుకెళ్తాడు. మధ్య మధ్యలో దెయ్యం వంటి ఎపిసోడ్స్ కూడా పెట్టి ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసారు. పూర్తిగా నిరాశపరచదు.అలాగని ఆనందపరచదు. అలా అలా వెళ్లిపోతుంది.
టెక్నికల్ గా
నేపధ్యం, నేపధ్య సంగీతం, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ అద్బుతం కాదు కానీ బాగానే సెట్ అయ్యాయి. ఆర్టిస్టులు నవ్వించటానికి చాలా ప్రయత్నం చేసారు. కొంతవరకూ సక్సెస్ అయ్యారు. అలాగే డైరక్టర్ ఉత్తరాఖాండ్ గ్రామం .. ఆ గ్రామంలోని మనుషులు,అక్కడవారి ప్రవర్తనలును మనకు పరిచయం చేస్తాడు.నేచరల్ గా వెళ్లాడు, పెద్దగా సినిమాటెక్ ప్రయత్నం అయితే చెయ్యకపోవటం కలిసొచ్చింది.
చూడచ్చా
సున్నితమైన హాస్యంతో నడిచే ఈ ఎపిసోడ్స్ ని ఫ్యామిలీతో కలిసి చూడచ్చు.
ఎక్కడుంది
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది