అన్నపూర్ణ వారి మిస్సైన..ఫెర్ ఫెక్ట్
x

'అన్నపూర్ణ' వారి మిస్సైన..ఫెర్ ఫెక్ట్

మిస్ ఫెరఫెక్ట్ అని పేరు పెట్టినంత మాత్రాన అంతా ఫెరఫెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. అలాగే అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చింది కదా అదిరిపోవాలని లేదు.


అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రీమింగ్ కు వచ్చే ప్రతీ వెబ్ సీరిస్ అద్బుతమవ్వాలని లేదు. సినిమాల్లాగానే వీటిల్లో ఎక్కువ శాతం సోసోగానే ఉంటున్నాయి. అయినా ఏదో ఒక వీడియో చూసి పడుకోవటానికి అలవాటుపడిన వాళ్లు ఎప్పుడో అప్పుడు క్లిక్ చేస్తారులే అనే ఆశతో కొన్నింటికి ఛాన్స్ ఇస్తాయి ఓటీటీ సంస్దలు. అలాంటి వెబ్ సిరీస్ అనిపిస్తుంది ‘మిస్ ఫర్ ఫెక్ట్’చూస్తూంటే. నిజానికి మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేకపోతే ఈ సిరీస్ జోలికే పోబుద్ది కాదు. ఇంతకీ ఏమిటా కంటెంట్ ఓ సారి చూడచ్చా..పూర్తిగా ఎవాయిడ్ చేయాలా?

కోవిడ్ కాలంలో జరిగే ఫన్ సీరిస్ గా దీన్ని ప్లాన్ చేసారు. ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తూంటుంది లావణ్య రావు(లావణ్య త్రిపాఠి). ఆమె ఓ ఓసీడీ బ్యాచ్. ప్రతీ విషయంలోనూ ఫెరఫెక్ట్ గా,అతి శుభ్రంగా ఉండాలనుకునేరకం. ఆమె తన ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్ కు వస్తుంది.

ఇక్కడ తనకు ఓ సొంత ప్లాట్ ఉండటంతో అందులో దిగుతుంది. సరిగ్గా అదే సమయంలో లాక్ డౌన్ విధిస్తారు. దాంతో ఎక్కడికి కదలలేని సిట్యువేషన్. అప్పుడు ఇక్కడే పరిచయమైన పనిమనిషి... కోవిడ్ కారణాలతో జ్యోతి (అభిజ్ఞ) ..తను పనికిరాలేకపోతున్నానని చెప్తుంది. అంతేకాకుండా...తను పనిచేసే ఇంట్లో కూడా ఆ మేటర్ చెప్పమని చెప్తుంది. దాంతో పక్కనే ఉండే రోహిత్(అభిజిత్)కు కూడా ఆ విషయం చెప్దామని అతని రూమ్ కు వెళ్తుంది లావణ్య. అక్కడ నుంచి కథ టర్న్ తిరుగుతుంది. ఆ విషయం చెప్పడానికి వెళ్లిన లావణ్యను ఇంకో పనిమనిషి అని అపార్దం చేసుకుంటాడు.

దానికి తగినట్లుగానే ఒకానొక సందర్భంలో తన పేరు లక్ష్మి అని లావణ్య అతనికి అబద్ధం చెబుతుంది. నిజానికి అతని పై అధికారిగా లావణ్య వచ్చింది. ఆ విషయం లాక్ డౌన్ వలన రోహిత్ కి తెలియదు. తమ ఆఫీస్ లోనే పనిచేసే వాడే అని రోహిత్ అని లావణ్యకు తెలియదు. ఇద్దరు మధ్యా మెల్లిమెల్లిగా ప్రేమ చిగురిస్తుంది. చివరకు రోహిత్-లావణ్యల పెళ్లి జరిగిందా? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

లాక్ డౌన్ టైమ్ లో జరిగిన ప్రేమ కథగా దీన్ని అల్లుకున్నాడు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. అందరూ మర్చిపోతున్న కోవిడ్ టైమ్ ని రొమాంటిక్ గా గుర్తు చేద్దామని దర్శకుడు ఉద్దేశ్యం కాబోలు. ఈ లాక్ డౌన్ నేపధ్యం తీసుకోవటం వల్ల కలిసొచ్చిన ఉపకారణం ఏమిటీ అంటే అరడజను పాత్రలు మినహా అపార్టుమెంటు వాసులెవరూ కనిపించకపోయినా ఎవరూ అడగరు. సీన్స్ అన్నీ వీళ్ల మధ్యే జరిగినా సరిపెట్టుకుంటారు.

అయితే అంతవరకూ తెలివిగా ప్లాన్ చేసుకన్న దర్శకుడు కాస్తంత కాంప్లిక్ట్స్ ని బలంగా పెట్టుకోలేకపోయారు. కొన్ని క్యారక్టర్స్ తో కథనం లాగేద్దామనకుకున్నాడు. అలా సీన్స్ లైటర్ వీన్ లో రాసేసుకుని 5 ఏఎపిసోడ్స్ దాకా వెళ్లిపోయి. అప్పుడు కథ గుర్తుకు వచ్చి కొద్దిగా అటు వైపు దృష్టి పెట్టారు. అయితే ఫ్యామిలీతో అడల్ట్ సీన్స్, బూతులు లేకుండా వచ్చిన వెబ్ సిరీస్ కావటంతో ఫ్యామిలీలు ధైర్యం చేయవచ్చు.

టైక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. ప్రశాంత్ ఆర్. విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది. కెమరాపనితనం ఆకట్టుకుంటుంది కాకపోతే స్క్రిప్టే కాస్తంత తేడా కొట్టింది. మెగా కోడులు మామూలుగా చేసుకుంటూ పోయింది. గొప్పగానూ లేదు..అలాగని పూర్తి చెత్తగానూ లేదు.

చూడచ్చా?

కొద్దిగా కాలక్షేపం.. ఫార్వర్డ్ అప్షన్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు





Read More
Next Story