హిందూస్థానీ సంగీతం నేర్చుకుంటున్నా: ఆమీర్ ఖాన్
x

హిందూస్థానీ సంగీతం నేర్చుకుంటున్నా: ఆమీర్ ఖాన్

సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని, కుటుంబంతో సంతోషంగా గడిపానని ప్రముఖ నటుడు ఆమీర్ ఖాన్ అన్నారు. కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించారు.


సినిమాల నుంచి తీసుకున్న కాస్త విరామంలో హిందూస్థానీ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించానని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చెప్పారు. ఈ చిన్న విరామంలో నా కుటుంబంతో సంతోషంతో గడిపానని ఆమీర్ అన్నారు. " నేను చాలాకాలం నా పనిలో బిజీగా ఉన్నాను. కుటుంబంతో అనుకున్నంత సమయం గడపలేకపోయాను. ఈ లోటు ఇప్పుడు తీరింది" అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విరామం అనంతరం మళ్లీ సినిమాల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు వివరించారు.

ఈ నెల ప్రారంభంలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. " నేను ఇప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, 2022 లో విడుదల అయిన లాల్ సింగ్ చద్దా సినిమా పరాజయం తరువాత కాస్త విరామం తీసుకున్న"అని ఆమీర్ మీడియాకు చెప్పారు.

మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపటా లేడీస్’చిత్రాన్ని ఆమీర్ ఖాన్ నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

" మీరు ఇప్పటికి రోమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ఇప్పుడున్న వయస్సుకు అది కొంచెం అపురూపమే..కానీ వయస్సుకు తగ్గ రోమాన్స్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా, నటుడిగా అన్ని రకాల జోనర్ లు చేయడానికి ఏం అభ్యంతరం లేదు " అని సమాధానం ఇచ్చారు.

కిరణ్ రావు రెండవ చిత్రం లాపటా లేడీస్ చాలా బాగా తీశారని ప్రశంసించారు. మార్చి 1న సినిమా విడుదల అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ... ఈ సినిమా లాపటా లేడీస్ కోసం ఆమీర్ స్క్రీన్ టెస్ట్ లో పాల్గొన్నారని చెప్పారు. చివరకు ఇందులో పోలీస్ పాత్ర కోసం రవికిషన్ ను తీసుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుందని , కథ కొత్తగా ఉంటుందని వివరిచారు. కిరణ్ రావు తన మొదటి చిత్రం ‘ధోభీ ఘాట్’ ద్వారా ఫిలిం మేకింగ్ ప్రారంభించారు. ఈ చిత్రం 2010 లో విడుదల అయింది.

Read More
Next Story