లిండ్సే లోహాన్  అవర్ లిటిల్ సీక్రెట్ రివ్యూ
x

లిండ్సే లోహాన్ 'అవర్ లిటిల్ సీక్రెట్' రివ్యూ

మీన్ గర్ల్స్, పేరెంట్ ట్రాప్, ఫ్రీకి ఫ్రైడే, ఐరిష్ విష్ వంటి సినిమాలతో పాపులర్ అయిన హాలీవుడ్ నటి లిండ్సే లోహాన్ తాజా చిత్రం 'అవర్ లిటిల్ సీక్రెట్'.

మీన్ గర్ల్స్, పేరెంట్ ట్రాప్, ఫ్రీకి ఫ్రైడే, ఐరిష్ విష్ వంటి సినిమాలతో పాపులర్ అయిన హాలీవుడ్ నటి లిండ్సే లోహాన్ తాజా చిత్రం 'అవర్ లిటిల్ సీక్రెట్'. నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం రాబోయే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానుకగా తీసుకువచ్చారు. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఈ సినిమా కథ..అర్వే (లిండ్సే లోహాన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె క్రిస్మస్ ని తన బాయ్ ఫ్రెండ్ కుటుంబంతో జరుపుకోవాలని వాళ్ల ఇంటికి వెళ్తుంది. అయితే అక్కడ సర్పైజ్ ఏమిటంటే ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు లోగన్ (Ian Harding) అక్కడ కనపడటం. అయితే అతను రావడానికి కారణం అతను ఆ ఇంటి అమ్మాయితో డేటింగ్ లో ఉంటాడు. దాంతో అమ్మాయి తరఫున అక్కడికి క్రిస్మస్ జరుపుకోవటానికి వస్తాడు. ఇద్దరూ ఒకరిని చూసుకుని మరొకరు షాక్ అవుతారు. అయితే ప్రస్తుత పరిస్దితుల్లో తమకు గతంలో ఉన్న పరిచయం బయిటపెట్టకూడదనుకుంటారు.

తాము డేటింగ్ చేస్తున్న వాళ్ళు సొంత అన్న చెల్లెలు కావడంతో వీళ్లిద్దరు ఆ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఎవరో కొత్తవాళ్లు ఉన్నట్లుగా ఉంటుంటారు. తమ ఎమోషన్స్ ని కూడా బయిటపెట్టుకోరు. కానీ కాలం కలిసి రాదు. వీళ్లిద్దరూ ఓ రాత్రి కలిసి ఉండాల్సిన సిట్యువేషన్ వస్తుంది. అక్కడ నుంచి వీళ్ల మధ్య జరిగే కొన్ని సంఘటనలు ఆ సీక్రెట్ ని బయిటపెట్టే దిశగా ఉంటాయి. అంతేకాదు ఆ ఇంట్లోనూ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అసలు ఇంతకీ వీళ్లిద్దరు గతంలో ఎందుకు విడిపోయారు. ఆ ఇంట్లో ఉన్న సీక్రెట్స్ ఏమిటి, చివరకు ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

లిండ్సే లోహాన్ తనకు ఇష్టమైన rom-com జానర్ లోకి ఈ సినిమాతో మళ్లీ వచ్చింది. ఆమె గత ప్రాజెక్టు ఐరిష్ విష్ Irish Wish ని గుర్తు చేస్తుంది. అయితే ఇదో క్రిస్మస్ ఫిల్మ్. కానీ ఎక్కువగా సరదాగా ఓ హాలీడే మూడ్ లోనే నడిపారు. 1996లో మొదలయ్యే ఈ కథ ప్రోలాగ్ ని యానిమేషన్ లో చూపటంతో మనని కథలోకి ఓ ఫీల్ తో తీసుకెళ్తారు. అయితే ప్రధాన పాత్రలు ఇద్దరు విడిపోయిన కారణం పెద్దగా రిజిస్టర్ చేయలేదు. అర్దం లేనిదిగా ఉంటుంది. కెరీర్ ఆపర్చునిటీ నే వీళ్ల ఫెరఫెక్ట్ రొమాన్స్ ని దెబ్బ కొట్టిందని డైలాగలులో తర్వాత మెల్లిగా చెప్తారు. దాంతో వీళ్లిద్దరి మధ్య ఉండాల్సిన ఎమోషనల్ డెప్త్ పూర్తిగా మిస్సైంది.

దాంతో కొన్ని కామెడీ సీన్స్ బాగున్నా...జస్ట్ ఓకే సినిమా అనిపిస్తుంది. ఎక్కడా ప్రధాన పాత్రలు కలిస్తే బాగుండును అనే మూడ్ క్రియేట్ చేయలేకపోయారు. క్యారెక్టర్ డెవలప్మెంట్, వారి బ్యాక్ స్టోరీలు సరిగ్గా చేసుకోకపోవటంతో ఈ సమస్య ఎదురైంది. దాంతో కొంత ఫోర్సెడ్ కామెడీ చోటు చేసుకుంది. ఈ సినిమా లైటర్ వీన్ లో నడిపినా ఎక్కువగా ఫ్యామిలీ మేటర్స్ చుట్టూ కథ,కథనం నడిపారు. క్యారెక్టర్ ఆర్క్ వర్కవుట్ కాలేదు. సినిమాలో రొమాన్స్ కన్నా కామెడీనే బాగా పండింది. టెక్నికల్ గా మంచి స్టార్టర్స్ ఉన్న ఈ సినిమాలో లిండ్సే లోహాన్ ఎప్పటిలాగే బాగా చేసింది.

చూడచ్చా

క్రిస్మస్ సినిమాగా వచ్చిన ఈ సినిమా కొన్ని కామెడీ సీన్స్ తో బాగానే ఉందనిపిస్తుంది. అసభ్యత,హింస లేకపోవటంతో ఫ్యామీలలో చూడవచ్చు.

ఎక్కడుంది

నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది

Read More
Next Story