రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్”కథకు హెల్ప్ చేసిన లోక్ సభ ఎంపీ
పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నప్పుడు రాజకీయాలు బాగా తెలుసున్న వాళ్ళు స్క్రిప్ట్ సాయం చేస్తే సహజత్వం వస్తుందని దర్శకుడు శంకర్ భావించినట్లున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నప్పుడు రాజకీయాలు బాగా తెలుసున్న వాళ్ళు స్క్రిప్ట్ సాయం చేస్తే సహజత్వం వస్తుందని దర్శకుడు శంకర్ భావించినట్లున్నారు. ‘RRR’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న “గేమ్ ఛేంజర్”(Game Changer)చిత్రానికి కథా విభాగంలో ఓ లోక్ సభ యంపి చేత వర్క్ చేయించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ విషయం బయిటకు వచ్చాక అవి రెట్టింపు అయ్యాయనటంలో సందేహం లేదు.
‘గేమ్ ఛేంజర్’లో హీరో రామ్ చరణ్ (Ram Charan) ద్విపాత్రాభినయం చేశారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ అధికారిగా కొత్త కోణాల్ని ఆవిష్కరించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు గ్రాండ్ గా విడుదలయ్యాయి. మెల్లిమెల్లిగా బజ్ క్రియేట్ అవుతున్న ఈ చిత్రంపై వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కథని ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చారు. అయితే ఈ కథ పొలిటికల్ థ్రిల్లర్ కావటంతో శంకర్ మరో రచయితను సీన్ లోకి తెచ్చారు. ఆయన ఓ లోక్ సభ ఎంపీ కావటంతో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మరెవరో కాదు తమిళనాడు మదురైకి చెందిన ఎం పి ఎస్ వెంకటేశన్.
ఎస్ వెంకటేశన్..కేవలం రాజకీయ నాయకుడు గానే కాకుండా రచయితగా కూడా పాపులర్. ఆయన కమ్యూనిష్ట్ పార్టీ నాయకుడు. ఇప్పుడు సినిమా రచయిత కూడా అయ్యారు. డైరెక్టర్ శంకర్... వెంకటేశన్ రాసిన నవ యుగ నాయగన్ వేల్పారి నవల రైట్స్ తీసుకున్నారు. తన తదుపరి చిత్రం ఆ నవల ఆధారంగా చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో శంకర్ తో వెంకటేశన్ కు చర్చలు జరుగుతుండేవి. అప్పుడు ఆయన రాజకీయ ఆలోచనలు, అనుభవం తన సినిమాకు పనికి వస్తుందనిపించి, ఆయనతో ఆ ముక్క చెప్పారు. దాంతో వెంకటేశన్ థ్రిల్ లైపోయారు. ఆ విధంగా గేమ్ ఛేంజర్ సినిమాలోకి వెంకటేశన్ వచ్చి చేరారు.
వెంకటేశన్ వచ్చాక స్క్రిప్ట్ లో బాగా డెప్త్ పెరిగిందని, ఆయన కాంట్రిబ్యూషన్ కథకు బాగా వినియోగపడిందని యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ చేస్తున్న ఐఏఎస్ క్యారెక్టర్ డిజైన్ చేయటానికి వెంకటేశన్ చెప్పిన విషయాలు కీలకంగా నిలిచాయని చెప్తున్నారు. వెంకటేశన్ షూటింగ్ టైమ్ లో సెట్స్ కు వచ్చి తన విలువైన సూచనలు, కథలో చిన్న చిన్న మార్పులు చేశారని తెలుస్తోంది.
కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ..రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా కథ (Game Changer Movie Story) స్టోరీ రాశాగానీ అది పక్కా శంకర్ విజన్‌తో రూపొందింది. నా కథను ఆయన తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న దానికి ఆ సినిమా నిదర్శనం. ఆయన చిత్రాల ప్రభావంతోనే నేను దర్శకుడిగా మారా. నా కథతో శంకర్ మూవీ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. ఇటీవల విడుదలైన టీజర్ చాలా బాగుంది’’ అని అన్నారు. యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని అన్నారు.
అలాగే తన కెరీర్ లోనే మొదటి పొలిటికల్ స్టోరీ గేమ్ చేంజర్. ఆ కథ ను పూర్తి చేసిన తర్వాత..నా బెస్ట్ ఫ్రెండ్స్కు వినిపించాను. అది విన్న ప్రతి ఒక్కరికి కథ చాలా బాగా నచ్చింది. మెయిన్గా పెద్ద సినిమాల శంకర్ స్థాయిలో ఈ స్టోరీ ఉంది. ఈ సినిమా చాలా పెద్దగా చేయవచ్చని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. నేను కథను స్టార్ట్ చేసినప్పుడు భారీ స్థాయిలో మెసేజ్ ఉండి..దానికి తోడు పొలిటికల్ టచ్ ఉండాలని రాసుకున్నాను.
కానీ తీరా స్టోరీ పూర్తయ్యాకే తెలిసింది. ఇంత పెద్ద పొలిటికల్ మూవీని తీసే అనుభవం..ఆ స్థాయి నాకు లేదని. అందుకే ఈ స్టోరీని శంకర్ సర్కి వినిపించాను. అప్పుడు ఆయన స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయ్యి..సినిమా తెరకెక్కించాలని కూడా సిద్ధం అయ్యారని కార్తీక్ ఇంటర్వ్యూలో వివరించాడు. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో ఈ సినిమాను రూపొందించడం వల్ల..ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలియజేశారు. గేమ్ ఛేంజర్ సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని అన్నారు.
ఇదిలా ఉంటే విదేశంలో ముందస్తు విడుదల వేడుక జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నిలవనుంది. యు.ఎస్.ఎ. (కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, టెక్సాస్)లో డిసెంబరు 21 (Game Changer Pre Release Event Date) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర టీమ్ రీసెంట్ గా ప్రకటించింది. చాలా సినీ టీమ్ లు విదేశాలకు వెళ్లి తమ చిత్రాన్ని ప్రచారం చేశాయిగానీ ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి.
తెలుగు సినిమా స్థాయి, ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడంతో దానికి తగ్గట్టే ఆయా చిత్ర టీమ్ లు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ టీమ్ మరో అడుగు ముందుకేసింది. .జనవరి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ఓ ప్రెస్‌మీట్ తెలిపారు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను గురువారం పూర్తి చేసిన ఎస్.జె. సూర్య.. ‘‘అవుట్‌పుట్ చూస్తే.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది’’ అంటూ అభిమానుల అంచనాలు రెట్టింపు చేశారు.