రజనీ  ‘కూలీ’ బిజినెస్‌కి ఎన్టీఆర్  బ్రేక్ వేస్తున్నాడా?
x

రజనీ ‘కూలీ’ బిజినెస్‌కి ఎన్టీఆర్ బ్రేక్ వేస్తున్నాడా?

ఆగస్ట్ 14న బాక్సాఫీస్‌ను బద్దలు చేసేది ఎవరు. ‘కూలీ’కి ‘వార్2’ అడ్డుపడుతోందా..


"లోకేష్ కనగరాజ్ వంటి దర్శకుడు సినిమా అనౌన్స్ చేస్తే, వెంటనే థియేటర్లు అప్‌గ్రేడ్ ప్లాన్లు మొదలు పెడతాయి." – సౌత్ ట్రేడ్ అనలిస్ట్

"రజనీకాంత్ సినిమా అనేది రిలీజ్ కాదు... ఒక పండుగ! అదీ లోకేష్‌తో కలిస్తే? బాక్సాఫీస్‌లో డైనమైట్ పేలినట్టే!" – డిస్ట్రిబ్యూటర్ల గిల్డ్ సభ్యుడు.

లోకేష్ కనగరాజ్ పేరు వింటేనే కుర్రాళ్లు కిక్కెత్తి పోతారు. వారి మైండ్ లో మాస్ మ్యూజిక్ ఊపొస్తుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘కూలీ’, ఆగస్ట్ 14 న రిలీజ్ అవుతోంది. దాంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద నేషన్‌గా మారింది.

స్టార్‌ కాస్ట్ విషయానికి వస్తే...రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ — ఒక్కో హీరోకి ఆయా భాషల్లో మిలియన్ల ఫాలోయింగ్. ఇప్పటికే రిలీజైన వీడియో గ్లింప్స్‌లో రజనీ స్టైల్, లోకేష్ మేకింగ్ కిక్కు అభిమానుల్లో ఓ రేంజ్ ఎనర్జీ క్రియేట్ చేసింది. అయిచే ఇప్పుడీ క్రేజ్ కు తగిన రేంజిలో బిజినెస్ అవ్వకుండా ఎన్టీఆర్... వార్ 2 అడ్డుపడుతోందని ట్రేడ్ లో వినపడుతోంది.

బిజినెస్ వార్

కూలి చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం ఇప్పటికే టాలీవుడ్ లో పెద్దవాళ్లు రంగంలోకి దిగారు —దిల్ రాజు, ఏసియన్ సునీల్, సితార నాగ వంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రధాన డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ రేసులో ఉన్నట్టు సమాచారం.

కూలీ నిర్మాతల డిమాండ్: తెలుగు రైట్స్ కు ₹45 కోట్లు (excl. GST)

బ్రేక్ ఈవెన్ టార్గెట్: ₹50 కోట్లు షేర్ తెచ్చే కలెక్షన్స్ వసూలు చేయాలి

అందుకోసం అవసరం: ఏకంగా ₹120 కోట్ల గ్రాస్ వసూలు (తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే) చేయగలిగాలి. ఇది డబ్బింగ్ సినిమాకు చాలా రిస్కీ బెట్టింగ్.

ఇది సాధ్యం కావాలంటే టైమింగ్, కంటెంట్, కాంపిటిషన్ అన్నీ సరిగ్గా కలవాలి.

WAR 2 అడ్డుపడుతోందా?

అయితే ఇప్పుడు అసలు సమస్య కూలి అంత వసూలు చేయలేదని కాదు. అందుకు వార్ 2 చిత్రం క్లాష్ అవ్వటమే. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌తో వస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2 . ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తుంది. అంటే ‘కూలీ’తో క్లాష్ ఖాయం.

ఎవరి సినిమా వాళ్లదే..ఎవరి క్రేజ్ వారిదే అనటానికి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఎంత బలంగా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ‘కూలీ’కు థియేటర్ల షేరింగ్‌లో పెద్ద పోటీ ఎదురవుతుంది. పాన్-ఇండియా కాంబో, డైరెక్టర్ క్రేజ్ ఉన్నా కూడా, వార్ 2 రిలీజ్ సమీపంలో ఉండటం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తలకిందులయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.

"రెండు పాన్-ఇండియా దిగ్గజాలు ఒకేసారి క్లాష్ అయితే, అది ఎవరికీ లాభదాయకం కాదు. ముఖ్యంగా, స్టార్ క్రేజ్ మీద ఆధారపడుతున్న డబ్బింగ్ సినిమాలు పోటీ పడటమే పెద్ద ప్రమాదం." – తెలుగు ట్రేడ్

డబ్బింగ్ రిస్క్ – ‘బ్రాండ్’ ఉన్నా, బాక్సాఫీస్‌ బరువే!

రజనీ, లోకేష్ లాంటి పేర్లు ఉంటే వసూళ్లు వస్తాయని గ్యారంటీ లేదు. డబ్బింగ్ సినిమాలకు మార్కెట్ ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతోంది. ఇప్పుడు ఆడియన్స్ సెన్సిబిలిటీస్, థియేటర్ షేర్, ట్రెండింగ్ మూవీస్ అన్నీ ప్రభావితం చేస్తున్నాయి. రీసెంట్ గా ఎంతో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైన థగ్ లైఫ్ రిజల్ట్ అందరినీ భయపెడుతోంది.

విక్రమ్ తర్వాత లోకేష్ పేరు ఓ బ్రాండ్‌గా మారిందనేది నిజం. కానీ తెలుగు ప్రేక్షకులు ఇక కేవలం స్టార్ ఇమేజ్‌కి థియేటర్‌కి రావడంలేదు – వారు కంటెంట్ కోసం వస్తున్నారు.

ఫైనల్ ఫోకస్:

ఎవరు ‘కూలీ’ సినిమాకు తెలుగు రైట్స్ కొంటారు? ఈ హైప్‌ని క్యాష్ చేసుకునే సత్తా ఎవరిలో ఉంది?లేదా ‘వార్ 2’ భయంతో వాయిదా పడుతుందా?

కూలీ విజయం సాధిస్తే అది లోకేష్ – రజనీ కాంబో గెలుపు మాత్రమే కాదు, డబ్బింగ్ మార్కెట్కి మళ్లీ బూస్ట్ కూడా. లేకపోతే ఇది డిస్ట్రిబ్యూషన్ రంగంలో భారీ లాస్ స్టోరీగా మిగిలిపోతుంది.

Read More
Next Story