మహేశ్ బాబా మజాకా! ‘గుంటూర్ కారం’ కి షేక్ అవుతున్న యూట్యూబ్
x

మహేశ్ బాబా మజాకా! ‘గుంటూర్ కారం’ కి షేక్ అవుతున్న యూట్యూబ్

ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూర్ కారం రికార్డ్ స్టాయిలో వ్యూస్ సాధించింది. తాజాగా ఇది ట్రెండింగ్ లో ఉంది.


సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘గుంటూరుకారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే 39 మిలియన్ వ్యూస్ సాధించి, అత్యధిక మంది వీక్షించిన దక్షిణ భారత ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

ట్రైలర్ లో ప్రిన్స్ మహేశ్ బాబు టైమింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఆయన చెప్పిన డైలాగ్లు, యాక్షన్ ఘట్టాలతో పాటు కాస్త కామెడీ కలిసినట్లు ఉన్నట్లుగా ట్రైలర్ ను మేకర్స్ చూపించారు. దీంతో కామెంట్ సెక్షన్ మొత్తం ప్రిన్స్ పై పొగడ్తలతో నిండిపోయింది. సూపర్ స్టార్ ఈ సారీ భారీ హిట్ అందుకుంటాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

గుంటూర్ కారంలో కథ గురించి కూడా ట్రైలర్ లో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. తల్లి- కొడుకు సెంటిమెంట్ తో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. తల్లికి చిన్నతనంలోనే దూరమైన కొడుకు రమణ పాత్రలో సూపర్ స్టార్ నటించనున్నారు. యాక్షన్ అంశాలతో పాటు ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రమణ కుటుంబం సంక్షిష్టమైన కుటుంబ నేపథ్యాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు.

సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ లాంటి స్టార్ లు సైతం ఉన్నారు. ఎస్ ఎస్ థమస్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు. వాటిలో దమ్ మసాలా, ఓ మై బేబీ, కుర్చీ మడత పెట్టి లాంటివి ఉన్నాయి. ఇవి ఇప్పటికే అభిమానులతో స్టెప్పులు వేయిస్తున్నాయి. సినిమా విడుదలపై అంచనాలు ఇవి మరింతగా పెంచాయి. ఒక్కోరోజులోనే గుంటూర్ కారం 39 లక్షల వ్యూస్ సాధించడంతో ట్రెండింగ్ టాపిక్ గా ఉంది. ఖలేజా విడుదలైన 12 సంవత్సరాల తరువాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Read More
Next Story