మిస్ కావద్దు :ఓటీటీ లో ఈ వారం 4 మళయాళ సూపర్ హిట్ చిత్రాలు
x

మిస్ కావద్దు :ఓటీటీ లో ఈ వారం 4 మళయాళ సూపర్ హిట్ చిత్రాలు

మొదటి నుంచి వైవిధ్యమైన కథలు, పాత్రలకు పెట్టింది పేరు మలయాళ చిత్ర పరిశ్రమ.

మొదటి నుంచి వైవిధ్యమైన కథలు, పాత్రలకు పెట్టింది పేరు మలయాళ చిత్ర పరిశ్రమ. అందరికీ తెలుసున్న కాన్సెప్ట్‌ను సైతం ఎవరూ ఊహించని విధంగా చెబుతూ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నారు అక్కడి దర్శక-నిర్మాతలు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తెరకెక్కుతున్న సమయంలోనూ ఈ సినిమాల హవా నడుస్తోంది. భారీ స్టార్ కాస్ట్ లేకుండా తక్కువ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ.. కంటెంట్ బాగుండటంతో డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఆయా భాషల్లో కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఓటీటీ ప్రియులకు పండుగ చేస్తున్నాయి.

ఇక మళయాళ చిత్రాలు రెగ్యులర్ గా చూసే వారికి ఈ వారం పండగ అనే చెప్పాలి. ఈ వారం నాలుగు కొత్త సినిమాలు పాపులర్ ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాలు మంచి హిట్ అయ్యినవే. ఈ సినిమాలు మంచి స్టోరీ లైన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇప్పటికే థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలు Netflix, SonyLIV, Disney+ Hotstar లభ్యమవుతున్నాయి. ఆ నాలుగు సినిమాలు ఇవే.

'రైఫిల్ క్లబ్' (Rifle Club) :

సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ నటించిన తాజా మలయాళ సినిమా 'రైఫిల్ క్లబ్'. హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేయగా... దిలీష్ పోతన్, 'హృదయం' ఫేమ్ దర్శనా రాజేంద్రన్, సురభి లక్ష్మి, వినీత్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. డిసెంబర్ 19, 2024 న థియేటర్లలో విడుదలైంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చి రిలీజైంది.

'రైఫిల్ క్లబ్' కథ ఒక్క రోజులో జరుగుతుంది. అలాగని క్యారెక్టర్స్ పరిచయం చేయడానికి ఎక్కువ రోజుల సమయం తీసుకోలేదు. సన్నివేశాలతో పాటు పాత్రలను పరిచయం చేశారు. ఆ సీన్స్ మధ్యలో అంతర్లీనంగా సందేశం ఇచ్చారు. ఈ చిత్రం ఈ రోజు నుంచి జనవరి 16 నుంచి ఓటీటీలలో దిగింది.

పని (pani):

ప్రముఖ మళయాళ నటుడు జోజు జార్జ్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పని. ఒకే ఒక సంఘటన సాధారణ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి, దాచిన రహస్యాలను బహిర్గతం చేసే, విధేయతలను పరీక్షించే భయంకరమైన భయాలను ఎదుర్కొనేలా చేసే ప్రపంచంలోకి తీసుకెళుతుంది. నీడల నుంచి నిజం బయటపడుతుందా? లేదా దానిని బహిర్గతం చేసే ప్రయత్నంలో ప్రేమించే ప్రతిదాన్ని నాశనం చేస్తుందా? థియేట్రికల్‌ రన్‌ తర్వాత పానీ ఇప్పుడు జనవరి 16 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి వస్తోంది.

జోజు జార్జ్‌ మాట్లాడుతూ, ‘‘దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి మించినది పానీ. ఇది వాటిని బహిర్గతం చేయడానికి అయ్యే వ్యయ ప్రయాసలను వెల్లడిస్తుంది. ఇది కుటుంబం, విధేయత, న్యాయం, ప్రతీకారానికి సంబంధించినది, ఇక్కడ ప్రతి నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని లోతుగా ప్రతిబింబిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, పానీ ఇప్పుడు సోనీ లివ్‌లో మరింత మంది ప్రేక్షకులను

ఐయామ్ కథలన్ (I Am Kathalan) :

ఐయామ్ కథలన్ మలయాళ కామెడీ సినిమా. మనోరమ మ్యాక్స్ ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు అక్కడ మంచి అప్లాజ్ వచ్చింది. థియేటర్ రెవిన్యూ కూడా బాగా కలెక్ట్ చేసింది. హ్యాకర్ గా మారిన కాలేజీ స్టూడెంట్ కథ ఇది. కష్టాలు, సవాళ్లు ఒక మనిషిలోని పూర్తి స్థాయి పొటెన్షియల్ ని ఎలా బయటకు తీసుకు వస్తాయనేది ఈ సినిమా చూపెడుతుంది.

‘సూక్ష్మ దర్శిని’ (Sookshmadarshini)

అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ‘సూక్ష్మ దర్శిని’ మూవీ ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘రాజా రాణి’, ‘అంటే సుందరానికి..’వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నజ్రియా (Nazriya Nazim) సుపరిచితమే. ఇందులో కుతూహలం కలిగిన మహిళగా ఆద్యంతం అంతే ఉత్సాహంగా తెరపై కనిపించింది. వైవిధ్య, హాస్యభరిత పాత్రలతో అలరించే బసిల్‌ జోసెఫ్‌ (Basil Joseph) మాన్యువల్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబంతో చూడొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

Read More
Next Story