సంక్రాంతికి మామా అల్లుళ్ల సవాల్‌

లాల్‌సలాం వర్సెస్‌ కెప్టెన్‌ మిల్లర్‌..


సంక్రాంతికి మామా అల్లుళ్ల సవాల్‌
x
Cine Hero Rajinikanth

సినీ ప్రియులకు సంక్రాంతి పండుగే. టాలీవుడ్‌లో కనీసం ఓ అరడజను సినిమాలు రిలీజ్ అవుతాయని అంచనా. ఇప్పటికే ఐదారుగురు హీరోలు పోటీ పడుతుండగా మరో స్టార్ యాక్టర్ విజయ్‌ సేతుపతి ఈవార్ లో జాయిన్ అయ్యారు. టాలీవుడ్ లో సంక్రాంతికి 5 సినిమాలు పోటీపడుతున్నాయి. అయితే తమిళ్ లో కూడా ఈ సీజన్ లో పోటీ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇయర్ స్టార్టింగ్ తో పాటు .. సినిమాలకు సాలిడ్ సీజన్ సంక్రాంతి. ఈ పండక్కి కి తమిళ్ లో 4 పెద్ద సినిమాలుపోటీపడుతున్నాయి. వాటిలో రజనీకాంత్ లాల్ సలాం ఆడియన్స్ హాట్ ఫేవరెట్. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో వస్తున్న లాల్ సలామ్ లో రజనీకాంత్ ముస్లింగా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ తో పాటు రజనీకాంత్ సాలిడ్ ఎంట్రీ వీడియో రిలీజ్ చేసి .. ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది టీమ్. అయితే లాల్ సలాం సంక్రాంతి బరి నుంచి షిఫ్ట్ అయ్యిందంటూ రూమర్స్ వినిపిస్తున్నా .. ఇప్పటి వరకూ దీని మీద అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు టీమ్ . అందుకే జైలర్ తో రచ్చ చేసిన రజనీ.. లాల్ సలాంతో వచ్చేది సంక్రాంతికే అంటూ సంబరపడిపోతున్నారు ఫాన్స్ .

మామకు పోటీగా ధనుష్‌...
మామ పవర్ ఫుల్ మూవీతో వస్తుంటే .. అల్లుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో రాబోతున్నాడు . ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ నిజానికి ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే సీజన్ వర్కవుట్ అవుతుందని సంక్రాంతికి షిఫ్ట్ అయ్యారు ధనుష్. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్లో శివరాజ్ కుమార్ , సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో అంచనాల్ని ఒక్క సారిగా పెంచేసింది. ఎప్పుడూ డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే ధనుష్ ..ఈ సారి కూడా అదే రేంజ్ లో కెప్టెన్ మిల్లర్ గా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్నారు.
కత్రినా కైఫ్‌తో విజయ్‌ సేతుపతి..
ఇప్పటికే మామా అల్లుళ్ల పోటీ పీక్స్ లో ఉండే .. రీసెంట్ గా పొంగల్ వార్ లో జాయిన్ అయ్యారు మరో వర్సెటైల్ స్టార్ విజయ్ సేతుపతి . సౌత్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా కంటిన్యూ అవుతున్న విజయ్ సేతుపతి శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్లో ఇంట్రస్టింగ్ థ్రిల్లర్ మేరీ క్రిస్ మస్ మూవీ చేస్తున్నారు. కత్రినా కైఫ్ , విజయ్ సేతుపతి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా జనవరి 12న రిలీజ్ అవుతున్నట్టు ట్రైలర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది.
శివకార్తికేయన్‌ కూడా...
పెద్ద పెద్ద హీరోలు ఆల్రెడీ థియేటర్లోఖర్చీఫ్ వేసుకుని రెడీ గా ఉన్నా కూడా .. శివకార్తికేయన్ తన సూపర్ నేచురల్ సైంటిఫిక్ థ్రిల్లర్ అయలాన్ ని కూడా సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికే ఫిక్స్ అయ్యారు. రవికుమార్ డైరెక్షన్లో రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న ఈ ఇంట్రస్టింగ్ మూవీ ఇప్పటికే ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. ఈ సినిమాకు సంబందించి లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
Next Story