మార్చి ఫస్ట్ వీక్ ..టాలీవుడ్ భాక్సాపీస్ ని భారీగా ముంచేసిందిలా
x

మార్చి ఫస్ట్ వీక్ ..టాలీవుడ్ భాక్సాపీస్ ని భారీగా ముంచేసిందిలా

మార్చ్ ఫస్ట్ వీకెండ్ లో ఆపరేషన్ వాలంటైన్ తో పాటు వెన్నెల కిషోర్ నటించిన చారి111 , భూతద్దం భాస్కర నారాయణ రిలీజ్ అయ్యాయి. పర్ ఫామెన్స్ పూర్, వివరాలు


మార్చి ఫస్ట్ వీక్ ..టాలీవుడ్ భాక్సాపీస్ ని భారీగా ముంచేసింది. మామూలుగానే ఫిబ్రవరి,మార్చి సినిమాల పరంగా అన్ సీజన్. గొప్పగా చెప్పుకునే సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వవు. అయితే కొంతమంది చాలా కాలం సరైన రిలీజ్ డేట్ దొరక్క వెయిట్ చేసి ఈ నెలలలో దిగిపోతూంటారు. పరీక్షల టైమ్ అయినా తమ సినిమా గొప్పగా ఉంటే ఖచ్చితంగా భాక్సాఫీస్ పరీక్షకు నిలబడుతుందని భావిస్తారు. ఫిబ్రవరి లో ఈగల్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మరియు ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు…వచ్చాయి. ఉన్నంతలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సేఫ్ అయ్యింది, మిగిలిన సినిమాలు హిట్ దరిదాపుల్లోకి వెళ్లలేదు.

ఇక మార్చ్ ఫస్ట్ వీకెండ్ లో మరిన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో భారీ సినిమా ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine). ఈ సినిమాతో పాటు వెన్నెల కిషోర్ నటించిన చారి111 , భూతద్దం భాస్కర నారాయణ అనే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆపరేషన్ కు ఓపినింగ్స్ అయినా దక్కాయి కానీ ఈ రెండు సినిమాలకు అదీ లేదు. ఆ తర్వాత వీకెండ్ ఏ సినిమాకు మినిమం చెప్పుకోదగ్గ కలెక్షన్స్ లేవు.

వరుస ఫ్లాఫ్స్ లతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్(Varun Tej) లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) తో కంబ్యాక్ ని ఎక్స్ పెర్ట్ చేశాడు కానీ మొదటి ఆటకే సినిమా కి ఆడియన్స్ నుండి భారీగా మిక్సుడ్ టాక్ సొంతం అవ్వగా సినిమా తర్వాత వీకెండ్ లో డల్ అయ్యిపోయింది. ఇంక సోమవారం నుంచి వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక భారీగా డ్రాప్ అయ్యింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది,

మొత్తం మీద సినిమా…. 3వ రోజు 58 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకున్న సినిమా 4వ రోజున 18 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ వచ్చింది. దాంతో సినిమా ఓవరాల్ గా 4 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
నైజాం: 0.92CR~
సీడెడ్ – 0.22CR~
మొత్తం ఆంధ్రా: 1.14CR~
మొత్తం AP-TG కలెక్షన్స్ :- 2.28RCR~(4.40CR~ గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా+ఓవర్ సీస్: 0.73CR~
మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 3.01CR(5.90CR~ Gross)

సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ చూస్తే బ్రేక్ ఈవెన్ బాగా కష్టమని అర్దమైపోతోంది. మిగిలిన రెండు సినిమాలు డిటెక్టివ్ ఫిల్మ్ లు. వాటికు కనీసం ఓపెనింగ్స్ కూడా లభించలేదు…ఈ వీకెండ్ మూవీస్ లో….భూతద్దం భాస్కర నారాయణ టాక్ పరంగా ఓకే అనిపించుకున్నా ప్రమోషన్స్ లేక పోవడం, స్టార్ వాల్యూ లేక పోవడంతో ఇంపాక్ట్ లేదు, దాంతో ఈ వీకెండ్ డిసాస్టరస్ గా నిలిచింది అని చెప్పొచ్చు… ఆల్ మోస్ట్ నెల రోజులుగా టాలీవుడ్ కి హిట్ అయతే దక్కలేదు అనే చెప్పాలి. దాదాపు అన్ని ఇండస్ట్రీలు కలెక్షన్స్ లేక సమ్మర్ కోసం ఎదురుచూస్తున్నాయి. కేవలం ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రం బాక్ టు బాక్ హిట్స్ తో దూసుకు పోతుంది.
ఇదిలా ఉంటే ...ఈ వారం మరో సినిమా కూడా రిలీజైంది.అది సమరసింహారెడ్డి. రీ రిలీజ్ ల ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన సమర సింహా రెడ్డి సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న నేపధ్యంలో…
భారీగా రీ రిలీజ్ ను ప్లాన్ చేశారు… ఆల్ మోస్ట్ 400 స్క్రీన్స్ లో సినిమాను రీ రిలీజ్ చేయగా సీడెడ్ ఏరియాలో మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్న సినిమా మిగిలిన చోట్ల ఏమాత్రం అంచనాలను అందుకులేక తడబడి పడిపోయింది.


Read More
Next Story