2025 గూగుల్‌లో తెగ వెతికిన ఇండియన్ ఫిల్మ్ ఇదా,కారణం?
x

2025 గూగుల్‌లో తెగ వెతికిన ఇండియన్ ఫిల్మ్ ఇదా,కారణం?

అతి కిరాతకమైన హింస రీజన్?

సాధారణంగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ అంటే మనకు గుర్తొచ్చేవి ఖాన్స్ సినిమాలు లేదా మన పాన్ ఇండియా స్టార్ల భారీ బడ్జెట్ చిత్రాలు! కానీ, 2025లో భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ ఊహించని ఒక వింత జరిగింది. కండలు తిరిగిన కటౌట్, కళ్ళల్లో కనిపిస్తున్న క్రూరత్వం, చేతిలో రక్తం చిందుతున్న కత్తి.. ఈ ఒక్క లుక్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ, గూగుల్‌లో 'మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ మూవీ'గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో'.

స్టార్ హీరోల రికార్డులను సైతం తుత్తునియలు చేస్తూ, ఒక ప్రాంతీయ భాషా చిత్రం గూగుల్ టాప్ సెర్చ్‌లోకి ఎలా వచ్చింది? అసలు ఈ 'మార్కో' ఎవరు? మలయాళ 'చాక్లెట్ బాయ్' ఉన్ని ముకుందన్‌ను అంత కిరాతకమైన 'బీస్ట్'లా మార్చిన ఆ వైలెంట్ సీక్రెట్ ఏంటి? థియేటర్లలో రక్తం ఏరులై పారుతున్నా, జనం ఈ సినిమా కోసం ఎందుకు ఎగబడుతున్నారు? కేవలం 30 కోట్లతో మొదలై.. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల విధ్వంసం సృష్టించిన ఈ సినిమా సక్సెస్ వెనుక ఉన్న 'రా అండ్ రస్టిక్' మ్యాజిక్ , ఆ 'వైలెంట్' సీక్రెట్ ఏంటి?

మోస్ట్ సెర్చింగ్ ఫిల్మ్ కేటగిరీలో...

ఎప్పటిలాగే ...ఈ ఏడాది గూగుల్ జాబితాలో బాలీవుడ్ చిత్రాలు ఆధిపత్యం చెలాయించాయి. సైయారా మొదటి స్థానంలో నిలిచింది. కాంతారా, కూలీ.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లోవార్ 2, సనమ్ తేరీ కసం, హౌస్‌ఫుల్ 5, గేమ్ చేంజర్, మిసెస్, మహావతార్ నరసింహ వంటి సినిమాలు ఉన్నాయి. ఇంత తీవ్ర తీవ్ర పోటీ మధ్య కూడా ఓ మలయాళ సినిమా ఆరో స్థానంలో ఉండటం.. అందరినీ ఆకర్షించింది. ఆ సినిమానే.. మార్కో. 2024 డిసెంబర్ లో విడుదల కావడం వల్ల ఈ ఏడాది మోస్ట్ సెర్చింగ్ ఫిల్మ్ కేటగిరీలో చేరింది.

రిలీజ్ కు ముందు నుంచే...

మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కాకముందే ఇంటర్నెట్‌ను ఊపేసింది. రిలీజ్ తర్వాత ఇక చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో హీరో ఉన్ని ముకుందన్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా, సాఫ్ట్ రోల్స్‌లో కనిపించిన ఉన్ని.. ఈ సినిమాలో మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్‌లో కనిపించారు. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ మూవీలో చూపించే 'రా' అండ్ 'రస్టిక్' ఎలిమెంట్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటమే కారణం అంటున్నారు విశ్లేషకులు.

గూగుల్‌లో రికార్డ్ సెర్చ్.. ఎందుకింత క్రేజ్?

2025లో మోస్ట్ గూగుల్డ్ మూవీగా 'మార్కో' నిలవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఈ సినిమాలో చూపించిన యాక్షన్ సీక్వెన్స్‌లు మునుపెన్నడూ చూడని విధంగా ఉండటం. మలయాళ సినిమాలకు ఇటీవల పెరుగుతున్న గ్లోబల్ క్రేజ్. మరీ ముఖ్యంగా, ఈ మూవీలో ఉన్ని ముకుందన్ పాత్ర వెనుక ఉన్న ఇంటెన్సిటీ. "మార్కో అంటే కేవలం సినిమా కాదు.. ఇదొక ఎమోషనల్ అండ్ వైలెంట్ జర్నీ" అంటూ మూవీ టీమ్ ఇస్తున్న హింట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి.

కథ ఏంటంటే:

రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం!. 'మార్కో' కేవలం ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాదు, ఇది ఒక పవర్‌ఫుల్ రివెంజ్ స్టోరీ. గోల్డ్ బిజినెస్‌లో తిరుగులేని ఆధిపత్యం ఉన్న 'అదాట్టు' కుటుంబానికి చెందిన మార్కో (ఉన్ని ముకుందన్), తన సోదరుడి కిరాతక హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా మెయిన్ ప్లాట్.

తన కుటుంబాన్ని నాశనం చేసిన శత్రువులను వేటాడి, చంపే క్రమంలో మార్కో చేసే వైలెంట్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో రచ్చ లేపాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో ఉన్ని ముకుందన్ చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టింది.

రికార్డుల వేట: బాక్సాఫీస్ షేక్!

ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయాయి.

బడ్జెట్: కేవలం 30 కోట్లు.

కలెక్షన్స్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 115 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

రికార్డ్: మలయాళ ఇండస్ట్రీలో 'A' సర్టిఫికేట్ పొంది 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి సినిమాగా 'మార్కో' చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం.

ఎందుకింత పెద్ద హిట్? :

హైపర్ వైలెన్స్: 'యానిమల్', 'కెజిఎఫ్' సినిమాల తర్వాత అంతటి రా అండ్ రస్టిక్ వైలెన్స్‌ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూశారు. ఇండియన్ స్క్రీన్ పై వన్ ఆఫ్ ది మోస్ట్ వైలెంట్ మూవీగా దీనికి పేరు వచ్చింది.

ఉన్ని ముకుందన్ మేకోవర్: ఇప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన ఉన్ని.. ఈ సినిమాలో 'బీస్ట్'లా మారడం యువతను విపరీతంగా ఆకట్టుకుంది.

రవి బస్రూర్ మ్యూజిక్: కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.

మొత్తానికి 'మార్కో' సినిమాతో మలయాళ ఇండస్ట్రీ తన సత్తా చాటింది. ఈ సినిమా సక్సెస్‌తో ఇప్పటికే 'మార్కో 2' సీక్వెల్ పనులను కూడా మేకర్స్ మొదలుపెట్టేశారు.

దక్షిణాది సినిమాల హవా.. బాక్సాఫీస్ భయం!

ఒకప్పుడు కేవలం మలయాళానికే పరిమితమైన సినిమాలకు ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. 'మార్కో' సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలయ్యి, పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇది గట్టి పోటీ ఇచ్చింది. అందుకే ఇప్పుడు గూగుల్‌లో ఈ సినిమా కోసం లక్షలాది మంది వెతుకుతున్నారు.

Read More
Next Story