మెగాస్టార్  పాతికేళ్ల రాజకీయ చక్రం ఫుల్ సర్కిల్ తిరిగిందిలా...
x

మెగాస్టార్ పాతికేళ్ల రాజకీయ చక్రం ఫుల్ సర్కిల్ తిరిగిందిలా...

పాతికేళ్ల క్రితం రాజకీయాల్లోకి రానన్న చిరు, తర్వాత మనస్సు మార్చుకున్నారు, వచ్చారు, పోయారు. మళ్ళీ వస్తారా?


"నాకు గంజి నీళ్లు తెలుసు. బెంజ్ కారు తెలుసు. మొగల్తూరు కాలువలో ఈదా, స్కై డ్రైవ్ లు, బంగీ జంప్ లు చేసా, జీవితంలో అన్ని కోణాలన్నీ చూసా, పేదోడి కష్టాలేంటో నాకు తెలుసు, వారి కన్నీళ్లు తుడవటానికే వచ్చా, ఇది మహా యుద్ధం, ఇక్కడ సమస్యలే మనకు శత్రువులు ఈ పోరులో నేను మీలాగే సైనికుడుని, ధైర్యం, నిజాయితీ ఆయుధాలుగా ముందడుగు వేస్తే యుద్ధంలో మనకు ఎదురుండదు. మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం. ప్రజారాజ్యాన్ని నిర్మించుకుందాం"

ఈ మాటలు తిరుమల వెంకటేశుడి పాదాల చెంత చిరు పార్టీ పురుడు పోసుకున్నప్పుడు ,ప్రజా సంద్రం సాక్షిగా ప్రజారాజ్యం ఆవిర్భవించినప్పుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు ఇవి. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రకటించగానే ఆయన పార్టీ, అజెండాపై అటు పార్టీల్లోనూ, ఇటు జనంలోనూ ఆసక్తి పెరిగింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన తొలి రాజకీయ సభలో చిరంజీవి భావపూరిత ప్రసంగం సభకు వెళ్లిన వేలాది మంది జనం మాత్రమే కాకుండా టీవి ఉన్న ప్రతి చోటా జనం మూగి లక్షల్లో తిలకించారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి.. ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 288 స్థానాలలో పోటీ చేశారు. కానీ అంతకు పదేళ్ల క్రితం చిరంజీవి కు అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు అంటే నమ్ముతారా?'భవిష్యత్తు లో నన్ను ప్రభావితం చేసే, నన్ను కదిలించే పరిణామం కాని, సంఘటన కాని జరిగితే అప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తానేమో గానీ, ఇప్పుడు నాకు రాజకీయాల్లో ప్రవేశిం చాలన్న అభిలాష లేదు. అని చిరం జీవి స్పష్టంగా చెప్పారు. ఇది 1999లో నాటి మాట . అంటే ఇప్పటికి పాతికేళ్ల క్రిందది. అప్పుడు చిరంజీవి వెలుగు మాములుగా లేదు. ఈ క్రమంలో చిరంజీవి పుట్టిన రోజు ప్రత్యేక సంచిక వెలువరించిన 'ఆంధ్రప్రభ' వాళ్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. అనేక ప్రశ్నలు వేస్తూ మధ్యలో ... మీరు రాజకీయాల్లోకి

ఎప్పుడొస్తారు? అనే ప్రశ్న వేశారు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడూ చిరంజీవి రాజకీయాలు గురించి మాట్లాడింది లేదు. అందరి రాజకీయ నాయకులతో మంచి రిలేషన్స్ ఉండేవి. దాంతో జనజీవితానికి ఇంత దగ్గరగా ఉన్న చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు? అని సూటిగా అడిగేసరికి..

'అసలు రాజకీయాల గురించి ఆలోచించడమే లేదు' అని చిరంజీవి క్లియర్ కట్ గా చెప్పేసారు. ప్రజలకు ఏ విధంగా సహాయపడగలను నేదే, ఆదుకోగలను అనేదే తన ప్రస్తుత ఆలోచన అన్నారు. ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రానక్కరలేదన్నది చిరంజీవి భావనగా చెప్పారు. 'గాంధీజీ, మదర్ థెరెసా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఎలా తోడ్పడ్డారో చూడండని ఆయన ఉదాహరణలు చూపించారు. వారిస్థాయిలో కాకపో యినా తనవంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దామన్నది తన ధ్యేయమని చిరంజీవి అన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించిన వార్తలు, వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. స్వచ్ఛంద సేవా కార్య క్రమాలపైనే ప్రస్తుతం తన దృష్టిని కేంద్రీకరించినట్టు, అందుకు తగిన కార్యక్రమాలు రూపకల్పనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. 'భవిష్యత్తు లో నన్ను ప్రభావితం చేసే, నన్ను కదిలించే పరిణామం కాని, సంఘటన కాని జరిగితే అప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తానేమో గానీ, ఇప్పుడు నాకు రాజకీయాల్లో ప్రవేశిం చాలన్న అభిలాష లేదు. అని చిరంజీవి చెప్పారు.

ఆ ఇంటర్వూల్లో చిరంజీవి తనకు ప్రజా జీవనానికి సంబంధించి కొన్ని నిశ్చితాభిప్రాయాలు చెప్పుకొచ్చారు. తప్పుచేసిన రాజకీయ నాయకులను, అధికారులను నిలదీసే తత్వం ప్రజల్లో కలగాలని, అప్పుడే దేశం ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు. 'అమ్మా నాన్నా నాకేమి చ్చారు, ఈ దేశం నాకేమిచ్చింది అని అడిగేవాళ్ళే కానీ తన బాధ్యతను గుర్తె వేస్తారు? రిగి తనంతటతాను పైకిరావాలన్న దృక్పథం ఎంతమందికి ఉంది?' అని చిరంజీవి ప్రశ్నించారు. 'అసలు పూర్తి అవయవాలతో పుట్టడమే గొప్పవరంగా భావించాలి. చేతులు, కాళ్లు సవ్యంగా ఉన్నపుడు ఎవరో ఏదో చేయాలని ఆశించడమెందుకు? శ్రమపడి సాధిం చాలన్న పట్టుదల ఉండాలి' అని చెప్పారు.

చిరంజీవి అభిమానులే కాకుండా ఆంధ్ర రాజకీయాలను గమనిస్తున్నవా రెందరో ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు అనేది నిజం. అయితే 'ఆంధ్రప్రభ'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరం జీవి ఈ విషయంపై ఇచ్చిన జవాబులు గమనిస్తే రాజకీయ రంగ ప్రవేశంపై అప్పటికి 1999 నాటికి రాజకీయాలపై చిరంజీవి అంత అనుకూలంగా లేరని అర్థమవుతుంది.

అయితే పదేళ్లలో ఆయన ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి గెలుచుకున్న రెండు సీట్లు తీసేస్తే సీమాంధ్ర లో సీట్లు 16 మాత్రమే. ఇక ఓట్ల శాతం గమనిస్తే ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యానికి 16.32% శాతం ఓట్లు పోలయ్యాయి. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు. అయితే చిరంజీవి ఆ పార్టీని కంటిన్యూగా నడపలేకపోయారు. కారణాలు అందరికీ తెలినవే. కాంగ్రేస్ లో పార్టీ విలీనం చేయటం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.

ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా చిరు సేవలందించారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాలను ఎందుకు వద్దనుకున్నారో కూడా చెప్పుకొచ్చారు.చిరంజీవి మాట్లాడుతూ.. ‘బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నుంచి సేవలు అభిమానుల సహకారంతో ముందుకెళుతున్న టైం లో అప్పుడు ఇంకొంచెం సేవ చేయాలి అనిపించి రాజకీయాల్లోకి వెళ్ళాను. మనకు ఇంత ఇచ్చిన ప్రజలకు నేను కూడా ఏదో ఒక సేవ చెయ్యాలి అంటే రాజకీయాలు కరెక్ట్ అనుకున్నాను. కాని సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని నాకు తర్వాత అర్థమైంది. నేను గబుక్కున పాలిటిక్స్ లో కాలు వేసి పెద్ద తప్పు చేశాను అని అర్థమై మళ్ళీ ఇటు సినిమాల వైపు వచ్చేసాను.

పాలిటిక్స్ లో ఇంకొంచెం పెద్ద ఎత్తున సేవలు చేద్దామని వెళ్ళాను కానీ నేటి పాలిటిక్స్ లో నాలాంటి వాడు అనర్హుడు అనేది నిజం. నేను అందులోకి వెళ్లి సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అభిమానుల నుంచి అదే ఆదరణ, ప్రేమ ఉంటుందా అని అనుమానంగా ఉండేది. కాని తిరిగి వచ్చాక అదే ప్రేమ, అదే అభిమానం మీ గుండెల్లో చోటు అలాగే చూపించారు. అందుకే నేను బ్రతికినంత కాలం సినిమాల్లోనే ఉంటాను, ఓపిక ఉన్నంత కాలం మీకోసం సినిమాలు చేస్తూనే ఉంటాను,’అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

అయితే రాజకీయాలు వద్దనుకుని వెళ్లి ...వెనక్కి వచ్చిన చిరంజీవి ఓరకంగా తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు రాజకీయాల విషయంలో స్పూర్తిని ఇచ్చారనే చెప్పాలి. జనసేన పార్టీ స్థాపించి, ఏపీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించారు. ఎవరూ ఊహించనంతగా ఏపీ ఎన్నికల్లో కూటమి… దూసుకెళ్లింది. ఆధిక్యంలో సునామీనే. అయితే ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం కచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది నిజం. ఆ స్ఫూర్తి వచ్చింది మాత్రం తన అన్న చిరంజీవి వల్లే అనేది కూడా నిజం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిప్యూటీ సీఏం ప‌ద‌వి ద‌క్క‌డంతో ప్ర‌మాణ స్వీకారం చేస్తోన్న టైమ్‌లో స్టేజ్‌పై చిరంజీవి ఎమోష‌న‌ల్ అయ్యారు. ప్ర‌మాణ స్వీకారం చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు ప‌వ‌న్‌. ప్ర‌మాణ స్వీకార వేడుక‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను చిరంజీవి మోదీ అభినందించారు. చిరు, ప‌వ‌న్‌ల‌తో క‌లిసి అభివాదం చేశారు మోదీ.

ఇదంతా చూస్తుంటే... 25 ఏళ్లలో ఇంత జరిగిందా అనిపిస్తుంది. మళ్ళీ చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తాడా వస్తే బాగుండును అనేది ...చాలా మంది ఆశ .మొన్న బాబు మీటింగ్ లో మోడీ స్టేజి మీద జనం ముందుకు వచ్చి ఇద్దరి చేతులు పైకెత్తి నిలబడినపుడు అది మరింత బలపడింది. ఏమో ఆ మధ్యన 2007 లో వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’ పదేళ్ల పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. ఆ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ మళ్లీ వచ్చి రికార్డ్ లు బ్రద్దలు కొట్టి రీఎంట్రీలోనూ భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు చిరంజీవి. అలాగే రాజకీయాల్లోనూ రీఎంట్రీ ఇస్తారేమో చిరు. చూడాలి.

Read More
Next Story