
తమన్నానే కావాలయ్యా : ఆ 6 నిమిషాల కోసం ₹6 కోట్లు
మిల్కీ బ్యూటీ డ్యాన్స్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు లేకపోయినా తమన్నా రేంజ్ తగ్గలేదు! కేవలం 6 నిమిషాల కోసం 6 కోట్లు.. ఇదా స్టార్ పవర్ అంటే? తమన్నా డ్యాన్స్‌కు ఆ రేంజ్ ఫీజు ఇవ్వడం కరెక్టేనా? అసలేం జరిగింది?
న్యూ ఇయర్ నైట్ అంటే పార్టీలే… సెలబ్రిటీ పెర్ఫార్మెన్సులే… కానీ ఈసారి గోవాలో జరిగిన ఒక డాన్స్ షో మాత్రం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌లోకి నెట్టేసింది. స్టేజ్ మీద కేవలం ఆరు నిమిషాలు… కానీ పేమెంట్ మాత్రం ₹6 కోట్లు! అవును, ఇది ఎవరికో కాదు… తమన్నా భాటియాకి. గోవాలోని హై-ప్రొఫైల్ క్లబ్‌లో డిసెంబర్ 31 నైట్ జరిగిన ఈ ప్రైవేట్ ఈవెంట్‌లో తమన్నా డాన్స్ చేసింది. వీడియోలు బయటకి రావడంతో నెట్టింట ఒక్కసారిగా ట్రెండ్ అయిపోయింది. కానీ అసలు హాట్ టాపిక్ డాన్స్ కాదు… డాన్స్ ఫీజు.
ఒక నిమిషానికి ₹1 కోటి? ఇది నిజమేనా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాక్ ప్రకారం… ఈ ఆరు నిమిషాల పెర్ఫార్మెన్స్‌కి తమన్నా ₹6 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అంటే… ప్రతి నిమిషానికి ₹1 కోటి! సాధారణంగా స్టేజ్ షోలకి సెలబ్రిటీలు లక్షలు లేదా కొన్ని కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఇది మాత్రం ఇండియన్ ఇండస్ట్రీలోనే టాప్ లెవెల్ రేట్‌గా మారిపోయింది.
ఎందుకు ఇంత డిమాండ్? ఎందుకు ఇప్పుడు?
సింపుల్‌గా చెప్పాలంటే… డాన్స్ సెన్సేషన్ = తమన్నా. ‘జైలర్’లో కావాలా, ‘స్త్రీ 2’లో ఆజ్ కీ రాత్, ‘రెయిడ్ 2’లో నషా… ఈ సాంగ్స్ నార్త్ ఇండియాలో ఆమెను మాస్ ఫేవరెట్‌గా మార్చేశాయి. థియేటర్ మాత్రమే కాదు… యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్, క్లబ్ ఫ్లోర్స్… ఎక్కడ చూసినా తమన్నా మూవ్‌మెంట్స్ ట్రెండ్.
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం…
‘రెయిడ్ 2’ స్పెషల్ సాంగ్‌కి దాదాపు ₹5 కోట్లు
‘జైలర్’కి సుమారు ₹3 కోట్లు
అంటే ఆమె మార్కెట్ వాల్యూ ఇప్పటికే టాప్ గేర్‌లో ఉంది.
స్టేజ్‌పై కాదు… బ్రాండ్‌గా ఆమె ఆడుతోంది!
ఇప్పుడు తమన్నా కేవలం హీరోయిన్ కాదు… హై-ఎండ్ బ్రాండ్ ప్యాకేజ్. ఒక ఈవెంట్‌కు ఆమె పేరు పడితే చాలు – టికెట్లు సేల్, సోషల్ మీడియా బజ్, క్లబ్ హైప్… అన్నీ ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. అందుకే ఆర్గనైజర్లు భారీ మొత్తాలు పెట్టడానికి వెనుకాడటం లేదు.
నెట్‌లో డిబేట్: ఇది ఓవర్‌రేటెడ్? లేక స్టార్ పవర్‌నా?
“6 నిమిషాలకు 6 కోట్లు… ఇది న్యాయమేనా?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, “డిమాండ్ ఉంటే రేటు ఉండాలి… ఇది బిజినెస్!” అని మరికొందరు డిఫెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం క్లియర్… తమన్నా పేరు ఇప్పుడు కేవలం సినిమాలో కాదు… ఈవెంట్లలో కూడా గోల్డ్ ప్రైస్!
గోవా డాన్స్‌తో ఆమె చేసిన పని ఒక్కటే – ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో ‘స్టార్ పవర్’కి కొత్త డెఫినిషన్ ఇచ్చింది. 6 నిమిషాలు… ₹6 కోట్లు… ఇది డాన్స్ కాదు, డామినేషన్! మరి నీకు ఏమనిపిస్తోంది? ఇది హైప్ మాత్రమేనా… లేక నిజమైన స్టార్ గేమ్ ఆ?

