మూడు దశాబ్ధాల తరువాత భారత్ లో ‘మిస్ వరల్డ్’ పోటీలు
x

మూడు దశాబ్ధాల తరువాత భారత్ లో ‘మిస్ వరల్డ్’ పోటీలు

భారత్ లో మూడు దశాబ్దాల తరువాత మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ 71 వ ఎడిషన్ పోటీలకు మనదేశ వాణిజ్య రాజధాని ముంబై అతిథ్యం ఇవ్వడానికి ముస్తాబైంది.


ప్రపంచ సుందరి పోటీలకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు దేశ ఆర్థిక రాజధాని ఇందుకు వేదికగా నిలవనుంది. ఈ పోటీలు 71 ఎడిషన్, కాగా భారత్ లో ఇంతకుముందు 1996 లో ఈ పోటీలు నిర్వహించారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత మనదేశంలో తిరిగి మరోసారి విశ్వసుందరీ పోటీలు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 9న ఢిల్లీలోని టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభోత్సవ వేడుక, ‘ఇండియా వెల్కమ్ దీ వరల్డ్ గాలా’ కార్యక్రమం నిర్వహించడంతో పోటీలు అధికారికంగా ప్రారంభం అవుతాయి. మార్చి 9 న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ ఫినాలేతో పోటీలు ముగుస్తాయి. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కానుంది.

జీ20 కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘భారత్ మండపం’ సహ పలు వేదికలపై ఈ పోటీలు జరగనున్నాయి. వివిధ దేశాలకు చెందిన 120 మంది సుందరీమణులు ఇందులో పోటీ పడనున్నారు. ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా బిలావ్స్కా, (పోలాండ్) మాజీ విజేతలు టోని ఆన్ సింగ్(జమైకా), వెనెస్సా పోన్స్ డి లియోన్( మెక్సికో), మానుషి చిల్లర్( భారత్) స్టెఫానీ డెల్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

మిస్ వరల్డ్ ప్రెసిడెంట్, సీఈఓ జూలియా మోర్లీ మాట్లాడుతూ " భారత దేశంలో మిస్ వరల్డ్ 71 ఎడిషన్ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ దేశం నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను, ఇక్కడ పోటీ నిర్వహించేందుకు కృషి చేసిన జమీల్ సైదీని నా కృతజ్ఞతలు, 71 వ ఎడిషన్ కోసం మేము అద్భుతమైన బృందాన్ని సమీకరించాం" ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గతంలో 1996 లో భారత అంతర్జాతీయ పోటీలకు అతిథ్యం ఇచ్చింది. గతంలో రీటా ఫరియా పావెల్, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రాలు మిస్ వరల్డ్ కిరిటాన్ని కైవసం చేసుకున్నారు.

Read More
Next Story