ఐఐటీ కుర్రాడి చుట్టూ తిరిగే చిత్రం..
ఎన్నో రకాల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే దర్శకుడికి, నటుడికి గుర్తింపు తెచ్చే చిత్రాలు తక్కువే. వరుణ్ గ్రోవర్ డైరెక్ట్ చేసిన చిత్ర విశేషాలేంటో చూద్దాం..
వరుణ్ గ్రోవర్ (Varun Grower) గురించి పరిచయం అక్కర్లేదు. పాటల రచయిత, కమెడియన్, కవిగా సుపరిచితుడు. 2015లో ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘‘ఆల్ ఇండియా ర్యాంక్’’. 20 ఏళ్ల బోధిసత్వ శర్మ ఇందులో హీరో. ఈ చిత్రాన్ని ఇటీవల ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (Mumbai Film Festival), ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DIFF)లో ప్రదర్శించారు. ప్రేక్షకులు ప్రశంశల వర్షం కురిపించారు.
కథేమింటటే..
వివేక్ సింగ్ 17 ఏళ్ల కుర్రాడు. లక్నో వాసి. కొడుకును ఐఐటీ (IIT) పూర్తి చేయించి ఇంజనీర్ చేయాలన్నది వివేక్ తండ్రి ఆర్‌కే సింగ్ కల. అందుకోసం కొడుకును కోటలోని ఓ కోచింగ్ సెంటర్‌కు పంపుతాడు. అయితే వివేక్‌కు చదువంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఆర్‌కే సింగ్‌ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కొడుకును బాగా చదివిస్తే.. ప్రయోజకుడై కుటుంబాన్ని పైకి తెస్తాడన్న తండ్రి ఆశిస్తాడు. వివేక్ పయనమెటో చూడాలంటే సినిమా చూడాల్సిందే.1997 నాటి పరిస్థితుల నేపథ్యంలో కథను తెరకెక్కించారు దర్శకుడు గ్రోవర్. చిత్ర షూటింగ్ కోట, జైపూర్, లక్నో, ముంబైలో జరిగింది.
ఆ ఛాన్స్ కోసం చాలా కష్టపడ్డాడు..
బోధిసత్వ శర్మ (Bodisatva Sharma) నటించిన పాతాల్ లోక్ (2020), క్యాండీ(2021), ఖుదా హఫీజ్ 2 (2022) చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయినప్పటికి ఈ చిత్రంలో నటించే అవకాశం శర్మకు అంత ఈజీగా రాలేదు. చాలా అడిషన్స్, వర్క్‌షాపుల్లో తన టాలెంట్‌ను బయటపెట్టడంతో ఈ మూవీలో అవకాశం దక్కింది. దర్శకుడు గ్రోవర్ అంటే శర్మకు ఎనలేని అభిమానం.
మమ్మి బిగ్ ఫ్యాన్..
‘వరుణ్ గ్రోవర్ కామెడీని మా అమ్మ నాకు పరిచయం చేసింది. ఆమె ఆయనకు బిగ్ ఫ్యాన్. వరుణ్ సార్ రాసిన ‘మాసన్’ సినిమా చూయించింది. అంతకుముందు నేను సెక్‌ర్డ్ గేమ్ షో చూశా. కాని అది ఆయన రాసినట్టు నాకు తెలీదు. గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, ఉత్తపంజాబ్ చిత్రాలకు పాటలు కూడా రాశాడని తెలిసింది. ఆ సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. గ్రోవర్ చిత్రాలన్నింటిలోకెల్లా ‘దామ్ లాగాకే హైసా’ మూవీలోని ‘మోహ్..మోహ్ కే దాగే’ తన ఫెవరేట్ సాంగ్’’ అని చెప్పాడు శర్మ.
నన్నెపుడు కంపెల్ చేయలేదు..
బాల్యాన్ని అస్సాంలో గడిపిన శర్మ ఐదేళ్ల వయసులో ఢల్లీికి చేరుకున్నాడు. ‘‘నన్ను అర్థం చేసుకునే తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం. వాళ్లు నన్నెప్పుడు అది చెయ్.. ఇది చెయ్ అని ఫోర్స్ చేయలేదు. నేను డాక్టర్ కావాలనో లేక ఇంజనీర్ కావాలనో నన్ను ఒత్తిడి చేయలేదు.’’ - శర్మ.
యాక్టింగ్ కోసం తప్పలేదు..
ఢిల్లీ బారకాంబ రోడ్‌లోని మోడ్రన్ స్కూల్‌లో చదువుకునే రోజుల్లో..ఫుట్‌బాల్, ధియేటర్, ఆర్ట్స్ గురించి తెలుసుకున్న శర్మ పదేళ్లవయస్సులో కళలపై ఆసక్తి పెంచుకున్నాడు. తనకు బాగా ఇష్టమైన యాక్టింగ్‌ను ఎంచుకుని అవకాశాల కోసం ముంబైకి బయల్దేరాడు. ఢిల్లీలో తన తల్లిదండ్రులను, స్నేహితులను వదిలి రావడం శర్మను బాధించింది. తన తోటివారు కాలేజీకి వెళ్తుంటే.. తను మాత్రం ఆడిషన్స్, సెట్స్‌కు వెళ్లేవాడు. స్వతంత్రంగా జీవించాలనుకున్నాడు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాడు.
ప్రోత్సాహం.. కలిసొచ్చింది..
శర్మ కన్నవారిని మెప్పించడానికి తన ఇష్టాలను త్యాగం చేయలేదు. నటన పట్ల శర్మకు ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఫ్రెంచ్, ఇరానియన్ చిత్రాలు చూసేలా ప్రోత్సహించారు. అలా చేయడం శర్మకు కలిసిసొచ్చింది.‘‘నేను సూపర్‌స్టార్ అవ్వాలని ముంబైకి రాలేదు. బోలెడంతా అభిమానుల్ని సంపాదించాలచుకోవాలన్నది నా లక్ష్యం కాదు. నాకు ఏది మంచిదనిపిస్తే అదే చేస్తా..’’అంటాడు శర్మ.
శశిభూషణ్ దగ్గర శిక్షణ..
‘పాతాల్ లోక్’ (Paatal Lok) చిత్రం కోసం శశిభూషన్ వద్ద శిక్షణ తీసుకున్నాడు శర్మ. ఆయనే ఆల్ ఇండియా ర్యాంక్ చిత్రంలో శర్మకు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ‘‘మాది టీచర్ ` స్టూడెంట్ బంధం. నేను ఆయనను తండ్రిలా గౌరవిస్తా. అంటూ తన ఆఫ్ స్క్రీన్ అనుభవాలను పంచుకున్నాడు శర్మ.
ఐ యామ్ శాటిస్‌ఫైడ్...
హ్యపీ టీనేజర్ పాత్రలో నటించడం శర్మకు కొత్తేమి కాదు. తన భావాలకు వ్యతిరేకంగా ఈ చిత్రంలో నటించడం వల్ల తన మానసిక స్థితిని ఇబ్బంది పెడుతుందా? అని అడిగినపుడు..‘ఈ పాత్రలో నటించడం కాస్త ఇబ్బంది అనిపించినా.. నాకు ఆనందాన్ని, సంతృప్తినిచ్చింద’ని శర్మ ఆన్సర్ చేశాడు.
శర్మకు తల్లి పాత్రలో గీతా అగర్వాల్ నటిస్తున్నారు. శశిభూషన్, గీతా అగర్వాల్, షీబా చంద యాక్టింగ్ ప్రేక్షకులు ఫీదా అయ్యారు. ఈ చిత్రానికి ముయుక్ - మైనిక్ మ్యూజిక్ అందించారు.
బోధిసత్వ శర్మ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్ కోర్సు చేస్తున్నాడు. ‘‘నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలో చాలా పుస్తకాలు చదివేవాణ్ణి. లిటరేచర్ చదవడం వల్ల నా యాక్టింగ్ కెరీర్‌కు ఉపయోగపడుతుంది."- బోధిసత్వ శర్మ
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ప్రసారమవుతున్న ‘రానా నాయుడు’ (Rana Naidu) పట్ల ఎంతో సంతోషంగా ఉన్న శర్మ 2024 ఫిబ్రవరిలో విడుదలయ్యే తన చిత్రం కోసం ఎంతో ఎక్సయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాడు.
గ్రోవర్ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ సీక్వెల్ వస్తుందని ఆశిద్దాం.