
నిజం... ఇక థియేటర్ లో భోజనం చేస్తూ సినిమా చూడచ్చు!!
పీవీఆర్ ఐనాక్స్ కొత్త కాన్సెప్ట్!
ఇప్పుడు సినిమా చూడటం అనేది కేవలం సినిమా చూడడమే కాదు. రోజు రోజుకీ ఇదో కొత్త ఎక్సపీరియన్స్ గా మారిపోతోంది. థియేటర్స్ కాస్తా రకరకాల సౌకర్యాలతో బార్స్ క్రింద రెస్టారెంట్ ల క్రింద తమను తాము మార్చుకుంటున్నాయి. సినిమా చూస్తూ తాగొచ్చు లేదా భోజనం చేయచ్చు అనే రోజులు వచ్చేసాయి.
ఇంట్లోనే పెద్ద టీవీ, ఓటీటీ, సౌండ్ సిస్టమ్ ఉన్న కాలంలో — థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు ఇప్పుడు కేవలం సినిమా కోసం రాడు. అతనికి కావాల్సింది సౌకర్యం, శ్రద్ధ, భిన్నమైన అనుభవం. అదే దిశగా పీవీఆర్ ఐనాక్స్ తీసుకున్న కొత్త అడుగు — భారతదేశంలోనే తొలి డైన్-ఇన్ సినిమా, బెంగళూరులోని M5 ECity మాల్లో ప్రారంభమైంది.
సినిమా + భోజనం = లగ్జరీ అనుభవం
పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) భారతదేశంలోనే తొలి డైన్-ఇన్ సినిమాను బెంగళూరులోని M5 ECity మాల్లో ప్రారంభించింది. ఎనిమిది స్క్రీన్‌లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకులు తమ సీట్లోనే కూర్చుని షెఫ్ తయారు చేసిన వంటకాలను ఆస్వాదిస్తూ సినిమా చూడగలరు.
అంటే — ఎంటర్‌టైన్‌మెంట్, ఫుడ్, రిలాక్స్‌షన్ — మూడు కలిసిన లగ్జరీ సినిమా అనుభవం!
ఈ కొత్త కాన్సెప్ట్ భారతీయ సినిమావ్యవస్థలో ఓ విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు. థియేటర్లలో సినిమా చూడటాన్ని ఇష్టపడే పెద్ద వర్గం ఉన్నందున, ఈ ట్రెండ్ త్వరలో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశముంది.
ఎనిమిది స్క్రీన్‌లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకులు ఇప్పుడు సీట్లోనే కూర్చుని షెఫ్ స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.
అంటే సినిమా చూస్తూనే రుచికరమైన భోజనం — లగ్జరీ హోటల్ సర్వీస్ తరహాలో అందుతుంది.
ఇది కేవలం సినిమా హాల్ కాదు, లైఫ్‌స్టైల్ ఎక్స్పీరియెన్స్ సెంటర్.
సినిమా మారింది, ప్రేక్షకుడి అంచనాలు కూడా మారాయి
ఒకప్పుడు థియేటర్‌కి వెళ్లడం అంటే పెద్ద స్క్రీన్, కూల్ డ్రిక్స్, ఏసీ, పాప్‌కార్న్ ఉంటే చాలు.
ఇప్పుడు ప్రేక్షకుడు సోఫా సీటు, లగ్జరీ ఫీలింగ్, సర్వీస్ బెల్, రకరకాల ఫుడ్స్ వంటి సౌకర్యాలు కోరుకుంటున్నాడు.
ఈ మార్పు సినిమా పరిశ్రమకు కొత్త దిశ చూపుతోంది.
ఇప్పుడు “కథ బాగుంది” అనేది సరిపోదు — “థియేటర్ అనుభవం బాగుంది” అనేది కూడా సినిమాను హిట్ చేసే అంశమవుతోంది.
కొత్త ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయటానికే...
ప్రస్తుతం పీవీఆర్ ఐనాక్స్‌కు టికెటేతర ఆదాయాల్లో భాగంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ నుంచి మంచి ఆదాయం వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టికెట్ విక్రయాల ద్వారా రూ.2942.4 కోట్ల ఆదాయం రాగా.. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.3258.2 కోట్లుగా ఉంది. అదే సమయంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1733.5 కోట్లు ఎఫ్‌అండ్‌బీ విభాగం నుంచే వచ్చింది.
ఈ నేపథ్యంలో ఫుడ్ అండ్ బేవరేజెస్ నుంచి వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవడంతో పాటు, సినిమా ప్రియులకు సరికొత్త అనుభూతి పంచేందుకు డైన్-ఇన్-సినిమాను ప్రారంభించినట్లు పీవీఆర్ ఐనాక్స్ లీడ్ స్పెషలిస్ట్ అమీర్ బిజ్లీ పేర్కొన్నారు. ఇకపై మూవీ టికెట్లు మాత్రమే కాకుండా టేబుళ్లు కూడా విక్రయించబోతున్నట్లు చెప్పారు. ఒక్కరే వచ్చి సినిమా చూడకుండా కుటుంబ సభ్యులంతా కలిసి టేబుల్ బుక్ చేసుకుని సినిమా వినోదాన్ని ఆనందించొచ్చని పేర్కొన్నారు.
మిశ్రమ స్పందనలు — “లగ్జరీ అనుభవమా? లేక డిస్ట్రాక్షనా?”
ఈ కొత్త కాన్సెప్ట్‌పై ప్రజల్లో చర్చ చురుగ్గా సాగుతోంది. కొంతమంది దీనిని “సినిమా చూడడాన్ని నూతన స్థాయికి తీసుకెళ్లిన ప్రయత్నం”గా ప్రశంసిస్తుంటే, మరికొందరు “భోజనం వాసనలు, సర్వింగ్ మూవ్‌మెంట్‌లు సినిమాకు డిస్ట్రాక్షన్ అవుతాయి” అంటున్నారు.
సినిమా అంటే లైట్స్ ఆఫ్, సైలెన్స్, స్టోరీలో మునిగిపోవడం — అని భావించే ప్రేక్షకులకు ఈ లగ్జరీ డైనింగ్ థియేటర్లు కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు.
మారుతున్న మార్కెట్ – భవిష్యత్‌లో మరింత విస్తరణ
భారతదేశంలో థియేటర్ బిజినెస్ ఇప్పడు పూర్తిగా ఎక్స్‌పీరియెన్స్ ఆధారిత మార్కెట్గా మారుతోంది. బెంగళూరుతో మొదలైన ఈ “డైన్-ఇన్” కాన్సెప్ట్ త్వరలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సినిమా చైన్‌లు కేవలం స్క్రీన్‌లు కాకుండా డైనింగ్, లైఫ్స్టైల్, బ్రాండింగ్లో కూడా పోటీ పడబోతున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఇదే తరహాలో మరో నాలుగైదు డైన్-ఇన్ సినిమాలను ఆవిష్కరించబోతున్నట్లు బిజ్లీ చెప్పారు. ఒక్కో ఆడిటోరియం ఏర్పాటుకు రూ.3 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా లైవ్ షోలు, కాన్సర్ట్‌లు, కార్పొరేట్ ఈవెంట్లకూ డైన్-ఇన్‌ను వినియోగించనున్నట్లు చెప్పారు. టూ-సీటర్ టేబుల్‌కు రూ.490, ఫోర్ సీటర్ టేబుల్‌కు రూ.990గా ధరలను నిర్దేశించినట్లు తెలిపారు. దీనికి డైనమిక్ ప్రైసింగ్ మోడల్ వర్తిస్తుందన్నారు. అంటే ఈవెంట్‌ను బట్టి వీటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
క్లాసిక్ సినిమా మూడ్‌కి రక్షణ అవసరం
ఈ కొత్త లగ్జరీ ప్రయత్నాలు ఎంత ఆకర్షణీయమైనా — సినిమా ఆత్మ మాత్రం ఎప్పుడూ నిలిచిపోవాలి.
నిశ్శబ్దంగా లైట్స్ డిమ్ అయ్యే క్షణం, ఫస్ట్ ఫ్రేమ్‌లో స్కోర్ వినిపించే ఆ థ్రిల్ — ఈ క్లాసిక్ ఫీలింగ్‌ని ఏ కాన్సెప్ట్ కూడా తాకకూడదు.
మొత్తానికి
పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభించిన ఈ ‘డైన్-ఇన్ సినిమా’ భారతీయ సినిమావ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. ఇది సినిమా బిజినెస్‌లోని ఒక సాధారణ మార్పు కాదు — ప్రేక్షకుడు, అనుభవం, సాంస్కృతిక ధోరణి మారుతున్న సంకేతం. సినిమా ఇప్పుడు కేవలం తెరపై కనిపించేది కాదు — సీటులో కూర్చున్న మన అనుభవమే సినిమా అయిపోయింది.
ఏమైనా, ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న ఈ కాలంలో, ఇలాంటి ఇన్నోవేషన్లు అవసరమే. కానీ, క్లాసిక్ సినిమా అనుభవాన్ని విలువ చేసే ప్రేక్షకుల కోసం ఆ పాత మంత్రం కూడా నిలిచేలా చూడటం థియేటర్ల బాధ్యతగా భావిస్తున్నారు.
“సినిమా చూడటం ఇప్పుడు ఒక ఆహార రుచిలా మారింది… ప్రతి ప్రేక్షకుడు తన రుచికి తగిన థియేటర్ అనుభవం కోరుకుంటున్నాడు.”