మైండ్ బ్లాక్ చేసే 7 థ్రిల్లర్ సినిమాలు!
x

మైండ్ బ్లాక్ చేసే 7 థ్రిల్లర్ సినిమాలు!

క్లైమాక్స్ చూశాక పిచ్చెక్కిపోవాల్సిందే!


సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, కొన్ని సినిమాలు మన మైండ్‌తో అత్యంత భయంకరమైన దెండాట ఆడుకుంటాయి. గంటల తరబడి మనల్ని కన్ఫ్యూజ్ చేసి, క్లైమాక్స్‌లో ఒకే ఒక్క ట్విస్ట్‌తో బాంబు పేల్చే ఆ అరాచక సినిమాలు ఇప్పుడు HBO Max (Max) లో స్ట్రీమ్ అవుతున్నాయి. దెయ్యాలు ఉండవు కానీ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఆ క్లైమాక్స్ చూశాక మీకు కలిగే ఆ షాక్ నుంచి బయటకు రావడానికి కనీసం ఒక వారం పడుతుంది! వివరాల్లోకి వెళితే...

ప్రస్తుతం ప్రేక్షకులు రొటీన్ సినిమాల కంటే బుర్రకు పని చెప్పే 'మైండ్ బెండింగ్' సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఏది వాస్తవమో, ఏది భ్రమనో తెలియక మనం తల పట్టుకుంటున్నప్పుడు డైరెక్టర్ ఇచ్చే ఆ ఒక్క ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అలాంటి టాప్ 7 సినిమాల లిస్ట్ ఇప్పుడు మీకోసం.

1. ది సబ్‌స్టాన్స్ (The Substance)

కథ: "వయసు అయిపోయింది.. ఇక నీకు గ్లామర్ లేదు" అని తన బాస్ అవమానిస్తే, ఆ స్టార్ హీరోయిన్ తట్టుకోలేకపోతుంది. అప్పుడే ఒక సీక్రెట్ డ్రగ్ గురించి తెలుస్తుంది. అది తీసుకుంటే ఆమె బాడీలో నుంచి మరో యవ్వనంగా, హాట్‌గా ఉండే కొత్త వర్షన్ పుట్టుకొస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఒకరు మేల్కొని ఉన్నప్పుడు మరొకరు నిద్రపోవాలి. ఈ ఇద్దరి మధ్య మొదలైన 'అందాల పోటీ' చివరకు ఎంత భయంకరమైన రక్తపాతానికి, బాడీ వికృతానికి దారితీసిందనేది మీరు ఊహించలేరు!

2. పర్ఫెక్ట్ బ్లూ (Perfect Blue)

కథ: సాఫ్ట్ ఇమేజ్ ఉన్న ఒక పాప్ సింగర్, కెరీర్ కోసం బోల్డ్ యాక్ట్రెస్‌గా మారాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఒక పిచ్చి ఫ్యాన్‌కు నచ్చదు. అతను ఆమె వెంటే పడి వేధిస్తుంటాడు. ఈ క్రమంలో రియాలిటీ ఏది? భ్రమ ఏది? అనేది ఆమెకు అర్థం కాదు. తనను వేధిస్తున్నది ఆ ఫ్యానా లేక తనలోని మరో కోణమా? మీ మెదడు మొద్దుబారిపోయేలా చేసే ఈ అనిమే థ్రిల్లర్ ఒక మాస్టర్ పీస్!

3. బాడీస్ బాడీస్ బాడీస్ (Bodies Bodies Bodies)

కథ: ఒక బంగ్లాలో పార్టీ చేసుకుంటున్న ఫ్రెండ్స్.. సరదాగా 'మర్డర్ గేమ్' ఆడదాం అనుకుంటారు. కానీ ఆ గేమ్ ఆడుతుండగానే నిజంగానే ఒక శవం పడుతుంది. వెలుతురు లేదు, బయట వర్షం.. ఆ చీకట్లో ఒకరి ముఖం ఒకరికి కనిపించదు. పక్కనున్నవాడే హంతకుడా? లేక బయటి నుంచి ఎవరైనా వచ్చారా? ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిన ఈ 'Gen Z' ఫ్రెండ్స్ చివరకు తెలుసుకున్న ఆ షాకింగ్ నిజం చూస్తే మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు, అంతే స్థాయిలో షాక్ అవుతారు!

4. మిజరీ (Misery)

కథ: ఒక ఫేమస్ రైటర్ కారు ప్రమాదానికి గురైతే, అతనికి ప్రపంచంలోనే అతిపెద్ద అభిమాని అని చెప్పుకునే ఒక మహిళ అతన్ని రక్షిస్తుంది. కానీ అది రక్షణ కాదు.. ఒక నరకం! తనకి నచ్చినట్టుగా కథ రాయకపోతే అతని కాళ్ళు విరగ్గొట్టి, నడవలేని స్థితిలో బంధిస్తుంది. ఆ 'సైకో' అభిమాని కన్నుగప్పి, ఆ గది నుంచి అతను ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? ఈ సినిమా చూస్తున్నంత సేపు మీ ఊపిరి బిగబట్టాల్సిందే!

5. థ్రోన్ ఆఫ్ బ్లడ్ (Throne of Blood)

కథ: అడవిలో ఒక దెయ్యం చెప్పిన జోస్యం విని.. "నేనే రాజును కావాలి" అనే పిచ్చితో తన యజమానినే నమ్మించి గొంతు కోస్తాడు ఒక వీరుడు. అధికారం అయితే వస్తుంది కానీ, ఆ తర్వాత అతను అనుభవించే మానసిక నరకం మామూలుగా ఉండదు. రక్తసిక్తమైన చేతులతో, కంటి మీద కునుకు లేకుండా అతను చేసే ఆత్మరక్షణ పోరాటం ఒక విజువల్ వండర్. వెయ్యి బాణాలు ఒకేసారి అతనిపైకి దూసుకొచ్చే ఆ క్లైమాక్స్ సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

6. ద ప్లేయర్ (The Player)

కథ: ఒక పెద్ద సినిమా స్టూడియో హెడ్.. తనని ఎవరో బెదిరిస్తున్నారని భ్రమపడి, ఒక అమాయక రచయితను చంపేస్తాడు. ఆ హత్యను కవర్ చేయడానికి అతను చేసే ప్లాన్లు, మరోవైపు పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్.. ఈ మధ్యలో అతను చంపిన వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తోనే ప్రేమలో పడటం! హాలీవుడ్ మురికి రాజకీయాన్ని, ఒక మనిషిలోని స్వార్థాన్ని ఇంత కసిగా చూపించిన సినిమా మరొకటి ఉండదు.

7. టాక్సీ డ్రైవర్ (Taxi Driver)

కథ: రాత్రిపూట నిద్రపట్టని ఒక మాజీ సైనికుడు.. న్యూయార్క్ వీధుల్లో టాక్సీ నడుపుతూ అక్కడి గలీజును చూసి అసహ్యించుకుంటాడు. ఆ సమాజాన్ని తనే క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యి, తనని తాను ఒక మెషిన్ లా మార్చుకుంటాడు. ఒక చిన్న పిల్లను రక్షించడానికి అతను చేసే ఆ తుపాకీ యుద్ధం, అతని కళ్ళలో కనిపించే ఆ క్రూరత్వం చూస్తే రక్తం ఉడుకుతుంది. ఇది సినిమా కాదు, ఒక కసి!

ఈ సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, మనిషి మెదడులోని చీకటి కోణాలను ఆవిష్కరించే అద్భుతాలు. మీరు నిజమైన సినిమా ప్రేమికులైతే, ఈ వీకెండ్ లో ఈ సినిమాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఫినిష్ చేయండి. ఆ ట్విస్టులు చూశాక షాక్ అవ్వడం మాత్రం గ్యారెంటీ!

Read More
Next Story