శశి కుమార్ మై లార్డ్ మూవీ రివ్యూ!
x

శశి కుమార్ 'మై లార్డ్' మూవీ రివ్యూ!

బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సిన మనిషి కథ


సెంట్రల్ మినిస్టర్ సుజాత మోహన్ (ఆషా శరత్) కి పవర్ అంటే అధికారం పిచ్చి. ఆమెకి ఒకే నమ్మకం: “డబ్బుంటే ఏదైనా కొనచ్చు, “అధికారంతో ఎవ్వరినైనా మలచచ్చు”. దాంతోనే ఆమె ఆ స్దాయికి ఎదిగింది. కానీ లైఫ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇస్తుంది. ఆమెకి రెండు వారాల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం పడుతుంది. ఇక్కడే అసలు ఐరనీ. తన స్వంత పిల్లలు అయిన మాధవ్, గాయత్రి . తల్లి కోసం కిడ్నీ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. వాళ్లకు వాళ్ల జీవితం, ఆశలు,కోర్కెలు ముఖ్యం.

మరో ప్రక్క ముత్తు సిర్పి ( శశికుమార్) ది ఒక సర్వైవర్ స్టోరీ. ముత్తుది కోవిల్‌పట్టిలో సింపుల్, సింగిల్ లైఫ్. హృదయం మంచిదైతే ఉపయోగం ఏముంది .లైఫ్‌లో ఏదీ సెట్ కాలేదు. అతని లైఫ్‌లోకి వస్తుంది సుశీల(చైత్ర ఆచార్) . ఆమె అగ్గె పెట్టెల ఫ్యాక్టరీలో పని చేసే అమ్మాయి. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు — చిన్న ఆశలతో జీవితాన్ని మొదలెడతారు. కానీ… లైఫ్ వాళ్లని బ్రేక్ చేయడం మొదలెడుతుంది.

సుశీల అనారోగ్యం…హాస్పిటల్స్… అప్పులు… చివరికి లోకల్ వడ్డీ వ్యాపారి నరసింహం దగ్గర అప్పు పెరిగి, వడ్డీ పెరిగి పెరిగి జీవితం బయిటకు రాలేని ఓ ట్రాప్ లా మారుంది.

జీవితం ఆట అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది. మరో షాకింగ్ టర్న్. ముత్తు, అతని భార్య చనిపోయారని నరసింహం ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తారు. వారి పేరుతో వచ్చిన నష్టపరిహారం దోచేస్తాడు. ఇప్పుడు ముత్తు బ్రతికే ఉన్నాడు…కానీ సిస్టమ్ ముందు అతను “చచ్చిపోయిన వాడు”. ఇప్పుడు అతని ఫైట్ ఏంటంటే “నేను బ్రతికే ఉన్నాను” అని ప్రూవ్ చేయడం!

ఇలాంటి పరిస్థితుల్లోకి ఎంటర్ అవుతుంది సుజాత మోహన్ టీమ్. తనకు సరిపోయే కిడ్నీ ముత్తు దగ్గర ఉందని తెలుసుకున్న సుజాత మోహన్ టీమ్, అతన్ని ఒప్పించి సిటీకి తీసుకువస్తారు.వాళ్లకు ముత్తు అంటే: ఒక మనిషి కాదు. ఒక “కిడ్నీ మ్యాచింగ్ డేటా”. డబ్బు, ఒత్తిడి, పరిస్థితులు ముత్తును ఒప్పించేస్తాయి. అతను వాళ్లతో వెళ్తాడు. అక్కడి నుంచి కథ మారుతుంది. ఇక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ . చివరకు ఏమైంది..ముత్తు తన కిడ్నీ ఇచ్చాడా. సెంట్రల్ మినిస్టర్ బ్రతికిందా.. తను బ్రతికే ఉన్నానని ముత్తు ప్రపంచానికి చెప్పగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

My Lord ప్రారంభం సాధారణంగా అనిపించదు. కెమెరా మనుషుల ముఖాలపై కాదు… వారి నడుము భాగాలపై ఫోకస్ చేస్తుంది. ఇది ఎలాంటి గ్లామర్ చూపించడానికి కాదు. ఇది ఒక అసౌకర్యకరమైన నిజాన్ని చూపించే విజువల్ స్టేట్‌మెంట్. ఈ ప్రపంచంలో ధనికులు ఏదైనా కొనగలమని నమ్మితే… పేదవాళ్లు తమ దగ్గర ఉన్న ఒక్కటే ఆస్తి — తమ శరీరం కూడా అమ్మకానికి పెట్టాల్సిందేనని నమ్మే పరిస్థితి. ఈ ఒక్క విజువల్‌తోనే డైరెక్టర్ Raju Murugan సినిమా టోన్‌ని ఫిక్స్ చేస్తాడు. ఇది కేవలం కథ కాదు… ఇది ఒక సిస్టమ్‌పై సెటైరికల్ ఎటాక్ అని మనకు చెప్పేస్తాడు.

ఈ సినిమా మొత్తం ఒక థిన్ లైన్ మీద నడుస్తుంది. ఇది ఓపెన్‌గా సిస్టమ్‌ను క్రిటిసైజ్ చేస్తుంది… కానీ ఎక్కడా హెవీగా ప్రీచ్ చేయదు. ఉపన్యాసాలు ఇవ్వదు. దర్శకుడు Raju Murugan గత సినిమాల్లో కనిపించిన ఒక సమస్య ఓవర్ ఐడియాలజీ . అది ఇక్కడ కంట్రోల్‌లో ఉంది. అతను తన రాజకీయ ఆలోచనలను దాచకుండా చెప్పినా… అవి కథను దాటి వెళ్లనివ్వలేదు. ఈ సినిమా ఒక విషయం క్లియర్‌గా చెబుతుంది: మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి బయటివాళ్లు అవసరం లేదు. మన సిస్టమ్ లోపలే ఉన్నవాళ్లు చాలు అని.

ఈ కథలో జరిగే సంఘటనలు చాలా అబ్సర్డ్‌గా ఉంటాయి. కానీ స్క్రీన్‌ప్లే వాటిని కాంప్లికేట్ చేయదు. ప్రతి ట్విస్ట్ కూడా ఒక లాజికల్ కంటిన్యువేషన్ లాగా అనిపిస్తుంది. ఇది రైటింగ్ స్ట్రెంగ్త్. అయితే కొన్ని చోట్ల సినిమా లెంగ్త్ ఎక్కువగా అనిపిస్తుంది. హాస్పిటల్ సీక్వెన్స్‌లు, కొన్ని లీగల్ డ్రామా ఎలిమెంట్స్ కథ ఫ్లోని స్లో చేస్తాయి.

చూడచ్చా

My Lord ఒక పర్ఫెక్ట్ సినిమా కాదు. కానీ ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. శశి కుమార్ ఫెరఫార్మెన్స్ కోసం , డైరక్టర్ ఐడియాలజీ కోసం ఓ లుక్కేయచ్చు. ఇది మనల్ని నవ్విస్తుంది…అసౌకర్యానికి గురి చేస్తుంది…చివరికి ఆలోచింపజేస్తుంది.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది

Read More
Next Story