ఫన్నీ సీరిస్ : నాగేంద్రన్స్ హనీమూన్స్ ఓటిటి రివ్యూ
x

ఫన్నీ సీరిస్ : 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ఓటిటి రివ్యూ

ఓటీటీలలో మళయాళ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరిస్ లు సైతం కొత్తగా,గమ్మత్తైన కాన్సెప్టులతో తీస్తున్నారు.


ఓటీటీలలో మళయాళ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరిస్ లు సైతం కొత్తగా,గమ్మత్తైన కాన్సెప్టులతో తీస్తున్నారు. ఓటిటిలలో వాటిని తెలుగులో అందించటంతో మనవాళ్లు చూడగలుగుతున్నారు. ఆ క్రమంలో తాజాగా 'నాగేంద్రన్స్ హనీమూన్స్' అనే మళయాళ వెబ్ సీరిస్ తెలుగులోకి వచ్చింది.డబ్బైల్లో సాగే ఈ వెబ్ సీరిస్ ట్యాగ్ లైన్ 1 లైఫ్, 5 వైఫ్స్ . ఐదుగురు భార్యలను నాగేంద్రన్ అనే వ్యక్తి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగింది?

కథేంటి

నాగేంద్రన్ (సూరజ్ వెంజరమూడు) బేవార్స్ టైప్. తల్లి అక్కడ ఇక్కడా పని చేసి సంపాదించి తెస్తే దాంతో లైఫ్ లీడ్ చేస్తూంటాడు. సంపాదన లేదని 40 ఏళ్లు దాటినా పెళ్లి గురించిన ఆలోచన చేయడు. అయితే అతనికి విలాసవంతమైన జీవితం గడపాలి ఉంటుంది. అందుకు కువైట్ వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ అందుకు ఆప్షన్ కనపడదు. ఈ లోగా అతని ఫ్రెండ్ ఒక అతను కువైట్ నుంచి తిరిగి వస్తాడు. అతని లైఫ్ స్టైల్ చూస్తాడు. ఎలాగైనా కువైట్ వెళ్లాలని ఫిక్సై పోతాడు.

అందుకు అతని స్నేహితుడు సోమన్ (అలగ్జాండర్ ప్రశాంత్) సాయిం చేస్తానంటాడు. సోమన్ పెళ్లిళ్ల బ్రోకర్. అయితే కువైట్ వెళ్లాలంటే 17 వేలు కావాలి. డబ్బైల్లో 17 వేలు పెద్ద మొత్తమే. టీ డబ్బులకు కూడా దిక్కులేని నాగేంద్రన్ ఇంత డబ్బు ఎక్కడ నుంచి తేగలగుతాడు. అందుకు సోమన్ ఓ ఉపాయం చెప్తాడు. పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బులతో దుబాయి వెళ్లచ్చు అంటాడు. దాంతో తన మామ కూతురుని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ మామ కట్నం ఇవ్వలేని పరిస్దితి. దాంతో తనకు ఈ పెళ్లి వర్కవుట్ కాలేదని పారిపోతాడు.

ఆ తర్వాత సోమన్ సలహాతో మరో సంభందం చూస్తాడు. లిల్లీ కుట్టి (గ్రేస్ ఆంటోని) అనే పోలీస్ చెల్లెలు ఒకామె ఉంటుంది. ఆమెకు కొద్దిగా పిచ్చి లాంటి తింగరతనం ఉండటంతో పెళ్లి కాదు. ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవటం కోసం ఆ ఊరు వెళ్లి తనకు పెళ్లి కాలేదని జోసఫ్ అనే పేరుతో పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లైన మరుసటి రోజే అతనికి అర్దమయ్యే విషయం ఏమిటంటే... లిల్లీ కుట్టి పేరుపై ఆస్తిపాస్తులున్నా, అవి ఇప్పట్లో రావనే విషయం అర్థమవుతుంది. దాంతో అక్కడ నుంచి బయిటపడతాడు. మళ్లీ సోమన్ వేరే చోటకు తీసుకెళ్లి వేరే సంభందం సెట్ చేస్తారు. అలా ఎక్కడక్కడి పేరు మార్చుకుని, ఊరు మార్చుకుని వరస పెళ్లిళ్లు చేసుకుంటున్న నాగేంద్రన్ కు 17 వేలు సమకూరాయా, పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తే వాళ్లు ఊరుకున్నారా..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే వెబ్ సీరిస్ చూడాల్సిందే.

ఎలా ఉంది

ప్రిమేజ్ చాలా చిన్నది సింపుల్ గా ఉంది. పెద్దగా మలుపులు లేవు. 70 ల నాటి వాతావరణం తేవటంతో సీరిస్ కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ స్ట్రక్చర్ చూస్తే ఇది ఓ సినిమా కథ అనుకుని సీరిస్ చేసినట్లు అనిపిస్తుంది. మూడో ఎపిసోడ్ నుంచి పోలీస్ ఇన్విస్టిగేషన్ ప్రారంభంతో కథ పాకాన పడుతుంది. అలాగే ఆరవ ఎపిసోడ్ లో చివర్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చి ముగించారు. అయితే ఇదేమీ కొత్త కాన్సెప్టు కాదు. మనకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవల మిస్టర్ వి వచ్చింది. ఆ నవల ఆధారంగా ప్రముఖ రచయిత సత్యానంద్ గారు దర్శకుడుగా మారి ఝాన్సీ రాణి అనే సినిమా డైరక్ట్ చేసారు. అదీ ఇలాంటిదే. కొద్దగా డ్రాగ్ చేసినట్లు అక్కడక్కడా అనిపించినా హ్యూమర్ టోన్ లో కథ చెప్పటంతో గడిచిపోతుంది. అయితే తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి అయితే పెద్దగా కలిగించదు. క్యారక్టర్ బిల్డింగ్ చేసుకుంటూ నాగేంద్రన్ పాత్ర చుట్టూ కథను నడిపారు.

టెక్నికల్ గా ...

దర్శకుడు నితిన్ రెంజి పనికర్ ఫన్నీగా ఈ సీరిస్ ని మలచటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సినిమా డబ్బైల నాటి వాతావరణం చాలా వరకూ తేగలగటంలో అన్ని క్రాప్ట్ లు కష్టపడ్డాయి. ముఖ్యంగా లొకేషన్స్ చాలా బాగున్నాయి. నిఖిల్ ప్రవీణ్ కెమెరా వర్క్ ప్రాణం పోసింది. అందమైన లొకేషన్స్ చూస్తున్నంతసేపు ఆహ్లాదంగా అనిపిస్తాయి. రంజిన్ రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , మన్సూర్ ఎడిటింగ్ బాగున్నాయి . ఆర్టిస్ట్ లలో సూరజ్ వెంజరమూడు,అలగ్జాండర్ ప్రశాంత్ పోటీ పడి చేసారు.

చూడచ్చా

టైటిల్ లో హానీమూన్ అని ఉంది కదా అని దూరం పెట్టాల్సిన పనిలేదు. సరదాగా చూసేయచ్చు. ఎపిసోడ్స్ కూడా చిన్నవే. కాకపోతే మరీ పిల్లలతో చూడదగినది కాదు.

ఎక్కడ చూడచ్చు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story