‘ఆవేశం’రీమేక్ లో బాలయ్య , ఏముంది ఆ సినిమాలో ? కథేంటి?
బాలయ్య కు సినిమాల పరంగానూ, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన చేసే పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ ఉంటాయి. ఎక్కువ శాతం సీరియస్ గా సాగుతూంటాయి.
బాలయ్య కు సినిమాల పరంగానూ, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన చేసే పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ ఉంటాయి. ఎక్కువ శాతం సీరియస్ గా సాగుతూంటాయి. పూర్తి యాక్షన్ ఇమేజ్ తో సాగే ఆ పాత్రలు ఆయన కోసమే డిజైన్ చేస్తారు. వేరే వాళ్లు కనుక ఆ పాత్ర చేస్తే నవ్వులు పాలు అవుతారు. ఆయన వందశాతం ఆ ఎమోషన్స్ కు సెట్ అయ్యిపోతూంటారు. అందుకే కామెడీ సినిమాలు ఆయన కెరీర్ లో చేసినవి అతి తక్కువ. అప్పెడెప్పుడో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ - అబ్బాయ్, ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన గొప్పింటి అల్లుడు. అయితే ఇప్పుడు ఫన్ , యాక్షన్,ఎమోషన్ తో వచ్చిన ‘ఆవేశం’రీమేక్ లో ఆయన చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
మలయాళంలో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ‘ఆవేశం’ సినిమా పెద్ద హిట్ . దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందీ ఈ సినిమా. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రంగ అనే ఓ రౌడీ పాత్రలో పవర్ ఫుల్ క్యారక్టర్ లో కనిపించాడు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసే కథతో యాక్షన్ కామెడీగా ఆవేశం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మళయాళంలోనే రిలీజ్ అయినా ఓటీటీలో తెలుగులో తప్పించి మళయాళ, తమిళ, కన్నడ,హిందీ అన్ని భాషల్లో రిలీజైంది. తెలుగు రీమేక్ రైట్స్ మైత్రీ మూవీస్ వారు తీసుకుని రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు హరీష్ శంకర్ ని డైరక్టర్ గా ఎంచుకున్నారని వార్త.
హరీష్ శంకర్ ...రీమేక్స్ చేయటంలో సిద్దహస్తుడు. ఒరిజనల్ వాళ్లు కూడా వచ్చి హరీష్ శంకర్ రీమేక్ చేసిన సినిమా రైట్స్ మళ్లీ కొనుక్కుని రీమేక్ చేసుకోవాలనించే స్దాయిలో ఉంటుంది. గబ్బర్ సింగ్ , గద్దల కొండ గణేష్ తో హరీష్ శంకర్ ఆ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హిందీ చిత్రం రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ తో మన ముందుకు వస్తున్నాడు. డైలాగ్స్ అయితే మామూలుగా రాయడు. బాలయ్య , హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అందుకే ఓ వెర్షన్ రాసి బాలయ్యకు వినిపించబోతున్నారట. అంతకు ముందు ఇప్పుడు బాలయ్య సినిమాలపై నిర్ణయాలు తీసుకుంటన్న ఆయన కుమార్తె తేజస్విని వింటారట. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ట లే..ఎందుకంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
కథేంటంటే...
ఇక ఈ ఆవేశం కథ కథను సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే ‘మంచి వాళ్లతో విరోధం కన్నా, చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం’ అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వచ్చిన నలుగురు కుర్రాళ్లు అజు (హిప్‌స్టర్), బిబి (మిథున్ జై శంకర్), శంతన్ (రోషన్ షానవాజ్) . వీళ్లు కాస్త అల్లరి టైప్. వీళ్లు కాలేజ్ హాస్టల్‌లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండవచ్చని బీకే హాస్టల్‌లో దిగుతారు. ఈ క్రమంలోనే సీనియర్లు అయిన కుట్టీ (మిధుట్టి), అతడి ప్రెండ్స్ ఈ ముగ్గురిని దారుణంగా ర్యాగింగ్ చేస్తూంటారు.
దీంతో తమ సీనియర్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని స్థానికంగా ఉండే లోకల్ ఉండే రౌడీలను కోసం వెతుకుతుంటే, గ్యాంగ్‌స్టర్ అయిన రంజిత్ గంగాధర్ అలియాస్ రంగా (ఫహద్ ఫాజిల్) తారసపడతాడు. రంగాది ఒక డిఫెరెంట్ క్యారెక్టర్. ప్రేమ, సంతోషం, కోపం ఏదైనా అతిగా ప్రదర్శిస్తాడు. ర్యాగింగ్ విషయం తెలిసి, ఆ సీనియర్స్‌కు బుద్ధి చెబుతాడు. అయితే, అప్పటి నుంచి అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ వారి హవా కొనసాగుతుంది.
ఈ క్రమంలో చదువు పక్కకు వెళ్లిపోతుంది. అన్ని సబ్జెక్ట్‌ల్లోనూ ఫెయిల్ అవడంతో, కాలేజ్ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. దీంతో ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్లిపోయి చదువుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ, రంగ వీళ్లను వదిలిపెట్టడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురూ తీసుకున్న నిర్ణయం ఏంటి? రంగా నుంచి ఎలా తప్పించుకున్నారు? తనని మోసం చేస్తున్నారని తెలిసిన రంగా వాళ్ళను ఏం చేసాడన్నదే కథ.
ఏం నచ్చింది
ఈ సినిమాలో కథ కన్నా కథనం గొప్పగా ఉంటుంది. ‘ఆవేశం’లో రంగా పాత్రకు నెగెటివ్ షేడ్స్‌తో పాటు, కామెడీ, అతిగా రెస్పాండ్ అయ్యే తీరు తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చింది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని రోలర్‌కోస్టర్ ఎక్కించి నవ్వించాడు దర్శకుడు జితూ మాధవన్.
గ్యాంగ్‌స్టర్ రంగా పాత్రకే బాలయ్యను తీసుకుంటున్నారు. ఆ పాత్ర ఎంట్రీతోనే కథలో అసలు జోష్ మొదలవుతుంది. ఆ పాత్ర గెటప్, లుక్, విభిన్నంగా ఉంటుంది. డైలాగులు చెప్తూంటే థియేటర్స్ దద్దరిల్లాయి. కాబట్టే హరీష్ శంకర్ డైలాగులు రాస్తే బాలయ్య ఆ పాత్రలోకి వస్తే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆ తరువాత బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక.. హరీష్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముంది.