ఫ్యామిలీతో చూడదగ్గ  థ్రిల్లర్:  సూక్ష్మదర్శిని రివ్యూ
x

ఫ్యామిలీతో చూడదగ్గ థ్రిల్లర్: 'సూక్ష్మదర్శిని' రివ్యూ

ఈ మధ్యకాలంలో ఒక దాని తర్వాత మరొకటి మళయాళ చిన్న సినిమాలు వచ్చి అబ్బురపరుస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో ఒక దాని తర్వాత మరొకటి మళయాళ చిన్న సినిమాలు వచ్చి అబ్బురపరుస్తున్నాయి. ముఖ్యంగా అవన్ని ఓటీటీ తెలుగు ప్రేక్షకుల కోసమే తీసారా అన్నట్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ 'సూక్ష్మదర్శిని' చిత్రం కూడా అలాంటిదే. 3 నుంచి 5 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం థియేటర్ల నుంచి 55 కోట్ల వరకు థియేటర్స్ లో రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ లోను అందరినీ తన వైపు చెప్పుకుంటోంది. ఫెరఫెక్ట్ స్క్రిప్ట్, బలమైన కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరు సినిమా పరుగెత్తింది. చూడటానికి కూర్చుంటే చివరిదాకా చూడాల్సిందే అన్నట్లుగా సీన్స్ నడుస్తాయి. ఎక్కడ ల్యాగ్ , బోర్ లేకుండా తీసిన ఈ సినిమా కథేంటి, అసలు ఏమిటి ఈ చిత్రం గొప్పదనం చూద్దాం.

స్టోరీ లైన్

ప్రియా (నజ్రియా) కొంచెం స్మార్ట్. ప్రతీది సూక్ష్మంగా పరిశీలించగల నేర్పు ఉందామెకు. ఆమె తన భర్త, పాపతో కలిసి ఓ విలేజ్ లో ఉంటుంది. వాళ్ల ప్రక్కింట్లోకి చాలా కాలం క్రితం ఆ ఊరు నుంచి వెళ్లిపోయిన మాన్యువల్ (బాసిల్ జోసెఫ్) వస్తాడు. అతని తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన తిరిగి ఆ ఊరుకి తీసుకుని రావాల్సిన సిట్యువేషన్ ఏర్పడుతుంది.

ప్రియా వాళ్ల కిటికీలో నుంచి చూస్తుంటే మాన్యుయెల్ వాళ్ళ ఇల్లు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అతని తల్లి అల్జీమర్స్ తో బాధపడుతున్నట్టు మాన్యువల్ అందరికి చెబుతాడు. అందుకు తగినట్లుగానే మధ్యలో ఒకటి రెండు సార్లు ఆమె ఇల్లు వదలి వెళ్లిపోవడం జరుగుతుంది. అప్పుడు .. మాన్యువల్ ఆమె ఎక్కడుందో తెలుసుకుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అందరు సానుభూతి చూపించి మాన్యుయెల్ కు సాయం చేస్తూంటారు.

కానీ మాన్యువల్ తల్లి ప్రవర్తనను గమనిస్తూ వస్తున్న ప్రియా, ఆమె అల్జీమర్స్ తో బాధపడుతుందనేది అబద్ధమని భావిస్తుంది. అలాగే మాన్యువల్ ప్రవర్తన కూడా ఆమెకి కాస్త అనుమానం గా అనిపిస్తుంది. ఒకసారి తన తల్లి కనిపించకుండా పోయిందని మాన్యువల్ చెప్పిన నాలుగు రోజులకు, ఓ రాత్రివేళ ఆ ఇంట్లోనే అతని తల్లిని ప్రియ చూస్తుంది. ఆ మరుసటి రోజు మాన్యువల్ ను అతని తల్లిని గురించి అడిగితే, ఇంకా ఆమె జాడ దొరకలేదనే చెబుతాడు. అప్పుడు ఏమైంది ...ఎందుకు మాన్యువల్ అబద్దం ఆడాడు. అసలు మాన్యుయెల్ ఇంట్లో ఏం జరుగుతోంది, ప్రియ ఆ మిస్టరీని ఎలా ఛేదించింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఏముంది సినిమాలో

చిన్న కథ, చిన్న సస్పెన్స్ కానీ స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని టూల్స్ వాడాలో అన్ని వాడి టైట్ గా రూపొందించారు. టైట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఎంత బాగా థ్రిల్ చేయవచ్చో ఈ సినిమా ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. సినిమా ప్రారంభమైన పది నిముషాల్లోపై పూర్తిగా కథలోకి వెళ్లిపోయారు. అలాగే మనం సినిమా మొదటి నుంచి చివరి దాకా అసలు తెరపై ఏం క్రైమ్ జరుగుతోంది. క్రిమినల్ ఎవరు, పట్టుబడతాడా అనే యాంగిల్ లోనే ఆలోచిస్తుంటాం. అలా మనం లీనమై చూడటమే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా కావచ్చు.

అలాగే ఈ సినిమాలో జరిగే ఇన్విస్టిగేషన్ ఎప్పుడూ ఏదో జరుగుతోంది అన్నట్లుగానే నడుస్తుంది తప్పించి, ఎవరు చేస్తున్నారు అనేది మనకు ఆలోచించే అవకాశం ఇవ్వదు. మొదటి నుంచి చివరిదాకా మాన్యువల్ పాత్ర చాలా బ్యాడ్ ఇంటెన్షన్ తో ఉన్నట్లు , ఏదో ఇస్తున్నట్టు హింట్ ఇస్తుండటంతో మన దృష్టి వేరే వైపుకు వెళ్లదు. అతను ఏం దాస్తున్నాడు...అన్నదే ముఖ్యాంశం. ఆ సీన్స్ బాగా పండాయి.

ఈ సినిమా ఆల్రెడ్ హిచ్ కాక్ Rear Window (1954), సైకో (1960) ని గుర్తు చేయచ్చు. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ గా , ఇన్విస్టిగేషన్ వర్క్ తో మాత్రం సినిమా బాగా వర్కవుట్ చేశారు. అసలు సూక్ష్మ దర్శిని అనే టైటిల్ లోనే కథను కొంత చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. క్లైమాక్స్ కొద్దిగా తేలిపోయింది అనిపించవచ్చు కానీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన సినిమా. తక్కువ ఖర్చు హై స్టాండర్డ్స్ తో స్టోరీ టెల్లింగ్ ఎలా చేయవచ్చు అనేది ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు.

చూడచ్చా

ఫెరఫెక్ట్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి మంచి ఆప్షన్. ఫ్యామిలీతో చూడదగినదే. ఎక్కడ అసభ్యత, అశ్లీలత లేవు. సంక్రాంతి సెలవులకు, వీకెండ్ కి మంచి కాలక్షేపం

ఎక్కడుంది

డిస్నీ 'హాట్ స్టార్'లో తెలుగులో ఉంది చిత్రం

Read More
Next Story