Maamla Legal Hai | మామ్లా లీగల్ హై వెబ్ సిరీస్ రివ్యూ!
x
Maamla Legal Hai

Maamla Legal Hai | 'మామ్లా లీగల్ హై' వెబ్ సిరీస్ రివ్యూ!

కోర్టు చుట్టూ జరిగే కార్యకలాపాలను, ప్రేమ కలాపాలను, న్యాయ విలాపాలను.. కొద్దిపాటి సహజత్వంతో తెరకెక్కించిన సీరిస్ 'మామ్లా లీగల్ హై' (Maamla Legal Hai).


ఓటీటి మీడియం వచ్చాక చెప్పే కథల్లో వైవిధ్యం పెరిగింది. ఈ కథ ఆ కథ అని లేదు.. ఏ కథైనా సినిమాగా తెరకెక్కించవచ్చు. సినిమాగా లొంగకపోతే కొద్దిగా సాగతీత విధానం ఫాలో అయ్యి వెబ్ సీరిస్ గా తీసి వడ్డించేయవచ్చు అనేది మన మేకర్స్ కు అర్దమైపోయింది. దాంతో ఏ ఐడియా వచ్చినా దాన్ని వదిలిపెట్టడం లేదు. సినిమాగానో వెబ్ సీరిస్ గానో, డాక్యుమెంటరీ గానో ఏదీ కాకపోతే షార్ట్ ఫిల్మ్ గా అయినా మన ముందుకు తీసుకు వచ్చేస్తున్నారు. అలా కోర్టు చుట్టూ జరిగే కార్యకలాపాలను, ప్రేమ కలాపాలను, న్యాయ విలాపాలను.. సినిమాటెక్ గా కాకుండా కొద్దిపాటి సహజత్వంతో తెరకెక్కించిన సీరిస్ 'మామ్లా లీగల్ హై' (Maamla Legal Hai). ఈ సీరిస్ మనవాళ్లని కూడా ఎట్రాక్ట్ చేయటానికి ఓ కారణం ఉంది అది రవి కిషన్. ఎవరూ రవి కిషన్ ఎక్కడో విన్న పేరులా ఉందంటారా..?

రవి కిషన్ ఒకప్పటి భోజపురి హీరో..అలాగే మన తెలుగు విలన్ ... అల్లు అర్జున్‌ రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా అదరకొట్టాడు. తనదైన నటనతో, కామెడీతో ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు. కిక్-2, సుప్రీమ్, 90 ఎంఎల్, లై చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.అయితే ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిన ఉన్న రవికిషన్.. గతేడాది మిషన్‌ రాణిగంజ్‌ చిత్రంలో నటించారు. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చారహు. ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. రవి కిషన్, నైలా గ్రేవాల్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రల్లో మామ్లా లీగల్ హై అనే కామెడీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్‌ ని నెట్ ప్లిక్స్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. కోర్టు రూమ్‌ నేపథ్యంలో వస్తోన్న ఈ సిరీస్‌ను ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ పాండే దర్శకత్వంలో రూపొందించారు. మరి ఈ సిరీస్‌ అంతగా నవ్వించే ఎలిమెంట్స్ ఏమిటి... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరిస్ చూడదగ్గదేనా ఓ లుక్కేసేద్దాం.

స్టోరీ లైన్...

ఢిల్లీ పరిధిలోని 'పట్ పర్ గంజ్' జిల్లా కోర్టులో అడ్వకేట్ త్యాగి (రవికిషన్). ఆయనది న్యాయకుటుంబమే ..అంటే ఒకప్పుడు ఆయన తండ్రి జడ్జిగా పనిచేసారు. కానీ తను చెట్టు పేరు చెప్పుకుని కాయలు ఏరుకునే రకం కాదని.... తండ్రి పేరును ప్రస్తావించకుండానే జీవితంలో ఎదగాలనే పట్టుదలతో ముందుకు పోతూంటాడు త్యాగి. స్టెప్ బై స్టెప్ ఎదాగాలనే అతని కోరికకు సాయిం చేసేదెవరు...తమ కోర్టు ...లో ప్రతీ లాయిర్ ఆకలిమీద ఉంటారు. ఎవరైనా కోర్టు ఏరియాలోకి రావటం పాపం... చుట్టూ మూగేసి సెట్ చేసేస్తూంటారు. ఇలా లాయర్లుకు బేరాలు తెచ్చిపెట్టి కమీషన్ తీసుకునే బ్యాచ్ కూడా ఉంటుంది. అలాంటి చోట తన ఉనికి కోసం పోరాడుతూంటాడు త్యాగి.

ఆ కోర్టుకి కొత్తగా లాయర్ గా అనన్య వస్తుంది. అయితే అక్కడ పరిస్దితిలు చూసి షాక్ అవుతుంది. ఎవరికీ కేసు గెలవాలి లేదా పెద్ద లాయర్ అనిపించుకోవాలని ఉండదు. కమీషన్ ఇచ్చి ఏదో కేసు తెచ్చుకుని ఆ రోజు గడిపేయాలనే ఆలోచనలో ఉంటూంటారు. బ్రతుకు తెరవు తప్ప..నీతి,నిజాయితీ వంటి పదాలను అక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదని అర్దం చేసుకుంటుంది. ఆమెకు ఈ కమీషన్స్ ఇవ్వటం వంటివి ఇష్టం ఉండదు. దాంతో అక్కడ ఆమెని పట్టించుకునేవాడు ఉండరు. కానీ కొద్ది రోజులుకు కోర్టు మేనేజర్ విశ్వాస్ పరిచయమై ప్రెండ్ అవుతాడు. అయితే ఈ ప్రెండ్షిప్ ని అతని కాబోయే భార్య వర్ష అపార్దం చేసుకుంటుంది అది వేరే కథ. ఇలా ఎవరి పోరాటాల్లో వాళ్లు ఉండగా... ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలు వస్తాయి. ఆ హంగామా మొదలవుతుంది.

త్యాగీ ఎలాగైన గెలిచి తన ఉనికి చాటుకోవాలని ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. మరో ప్రక్క అనన్య...తను లా పుస్తకాల్లో చదువుకున్న దానికి బయిట కోర్టుల్లో ఉన్న పరిస్దితులకు మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అలా ఏ పాత్రకు ఆ పాత్ర ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నా..అందరికీ కేంద్రబిందువు కోర్టు..కేసులు. ఈ క్రమంలో త్యాగీ ఎలక్షన్స్ లో గెలుస్తాడా... అనన్య ఫస్టు కేసు పట్టుకోగలుగుతుందా? చివరకి ఏమౌతుంది..

ఓ రకంగా ఇది ఫన్ తో నడిచే వెబ్ సీరిస్. అయితే నేపధ్యం కొత్తగా అనిపిస్తుంది. రెగ్యులర్ గా ...కోర్టు రూమ్ డ్రామాలంటేనే సీరియస్ గా ఉంటాయి. అయితే హిలేరియస్ కోర్టు డ్రామా చేయాలనుకోవటం ఈ సీరిస్ ప్రత్యేకత. అలాగే ఈ సీరిస్ లో అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేస్తుంది. అయితే కథ దాదాపు 80 శాతం కోర్టు ప్రాంగణంలోనే నడుస్తుంది. లాయర్స్ కు ఉండే ఎక్సప్రెషన్స్ ...వాళ్ల బిహేవియర్స్.. .. బలహీనతలు .. వాళ్లకి తగిలే కేసులు .. వీటిని బేస్ చేసుకునే కథ రాసుకున్నారు. స్థానిక సమస్యలను తీసుకుని నేచరుల్ గా ప్రెజెంట్ చేసారు. టెక్నికల్ గా అద్బుతం అని చెప్పలేం కానీ నడిచిపోతుంది.

చూడచ్చా...

మీరు లాయర్ కాకపోయినా,లా చదువుకోవాలనికోకపోయినా,కోర్టు గురించి తెలుసుకోవాలని లేకపోయినా ఈ సీరిస్ ని సరదాగా ఓ లుక్కేయచ్చు. విరగబడి నవ్వలేం కానీ విసుక్కోకుండా చూసేయచ్చు.

Read More
Next Story